Big C Announces Ugadi Festival 2023 Special Offers And Discounts, Check Details - Sakshi
Sakshi News home page

Ugadi 2023 బిగ్‌ ‘సి’: వినూత్నఫెస్టివ్‌ ఆఫర్లు  

Published Sat, Mar 18 2023 4:23 PM | Last Updated on Sat, Mar 18 2023 6:27 PM

do you know the Big C announces Ugadi festive offers check here - Sakshi

హైదరాబాద్‌: మొబైల్స్‌ రిటైల్‌ విక్రయ సంస్థ ‘బిగ్‌ సి’ ఉగాది పండుగ సందర్భంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది.మొబైల్స్, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ యం.బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుపై పదిశాతం వరకు క్యాష్‌ బ్యాక్‌తో పాటు ఎలాంటి వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండా సులభ ఈఎంఐలలో పొందొచ్చన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్‌: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!)

స్మార్ట్‌ టీవీల కొనుగోలుపై 1,500 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇస్తుందన్నారు. సులభ ఈఎంఐ పద్ధతిలో ల్యాప్‌టాప్స్‌ కొనే సౌకర్యం కూడా ఉందన్నారు. ‘‘ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. మా రిటైల్‌ స్టోర్లలో ఆన్‌లైన్‌ కంటే తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి’’ అని బాలు చౌదరి కోరారు.  

బ్రాండెడ్ ఉపకరణాలపై 51 శాతం తగ్గింపు, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు, రూ.2000 విలువైన అడాప్టర్ ఉచితం వంటి ఇతర ఆఫర్‌లు కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లలో శాంసంగ్‌ మొబైల్‌పై రూ.పదివేలు, Vivoపై రూ.5,000, Oppo మొబైల్‌పై 10 శాతంతగ్గింపు లాంటివి ఉన్నాయి.  (వాల్‌మార్ట్‌ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement