సమంత.. పులకింత | Samantha Launched Big C 150th Store in Warangal | Sakshi
Sakshi News home page

సమంత.. పులకింత

Published Sun, Jul 23 2017 12:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

సమంత.. పులకింత

సమంత.. పులకింత

హన్మకొండ చౌరస్తా(వరంగల్‌): నగరంలో సినీ నటి సమంత సందడి చేశారు. ఓరుగుల్లు వాకిట్లో సిరి మల్లె పువ్వులాంటి నవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తూ మైమరిచిపోయారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని పోలీస్‌గ్రౌండ్స్‌ ఎదుట గల జీఎంఆర్‌అండ్‌ జీఎస్‌ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ రిటైల్‌ విక్రయ రంగ నెంబర్‌ 1 సంస్థ ‘బిగ్‌ సీ’ 150వ షోరూంను  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘బిగ్‌ సీ’ 100వ షోరూంను తానే ప్రారంభించానని, 150వ షో రూంను కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ వేగంగా విస్తరించి అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు.  అనంతరం ‘బిగ్‌ సీ’ ఫౌండర్‌ అండ్‌ సీఎండీ ఎం బాలుచౌదరి మాట్లాడుతూ రాష్రంలోని మిగతా షోరూంల మాదిరిగానే 150వ షోరూంను ఆధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దామన్నారు. మొబైల్‌ కొనుగోలు పై రూ.4,999 విలువ గల ట్రాలీ సూట్‌కేస్, రూ. 3590 విలువ గల సింగర్‌ మిక్సర్, రూ. 2999 విలువైన లోటోషూ, రూ. 1499  విలువై న ల్యాప్‌టా బ్యాగ్‌ లాంటి ఆఫర్లను అందిస్తున్నామన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement