బిగ్‌సీలో 12వ వార్షికోత్సవ ఆఫర్లు | Big-C12th Anniversary offers | Sakshi
Sakshi News home page

బిగ్‌సీలో 12వ వార్షికోత్సవ ఆఫర్లు

Published Sun, Dec 14 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

బిగ్‌సీలో 12వ వార్షికోత్సవ ఆఫర్లు

బిగ్‌సీలో 12వ వార్షికోత్సవ ఆఫర్లు

సాక్షి, హైదరాబాద్: 12వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నామని బిగ్‌సీ చైర్మన్ బాలు చౌదరి పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని బిగ్‌సీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ విక్రయదారులతో పోల్చితే తమ షోరూమ్‌లలో తక్కువ ధరలకే మొబైల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మొబైల్ ఫోన్లపై 2 సంవత్సరాల వరకు వారంటీ, ఇన్సూరెన్స్ సదుపాయాలను బిగ్‌సీ అందిస్తోందన్నారు.

కస్టమర్‌కు తాను కొనుగోలు చేసిన మొబైల్ నచ్చకపోతే 15 రోజులలోగా ఆ మొబైల్‌ను వెనక్కు ఇచ్చి మరో మొబైల్‌ను తీసుకునే వినూత్న సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా మొబైల్స్ కొనుగోలుపై 50 శాతం వరకు డిస్కౌంట్, ఒకటి కొంటే మరోటి ఉచితం, ఒకటి కొంటే రెండు ఉచితం, స్మార్ట్ ఆఫర్స్, మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి  వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు వివరించారు.

ఆఫర్లలో కొన్ని...
రూ.7,199 విలువగల నోకియా ల్యూమియా మొబైల్ కొనుగోలుపై రూ.2,000 విలువగల రెండు ఫీచర్ ఫోన్లూ ఉచితం.
నోకియా ల్యుమియా 630 మొబైల్ కొనుగోలుపై రూ.2,000 విలువగల పవర్‌బ్యాంక్ మరియు శామ్‌సంగ్ బ్లూటూత్ ఉచితం.
సెల్‌కాన్ క్యూ455 మొబైల్ కొనుగోలుపై రూ.1000 విలువగల శామ్‌సంగ్ బ్లూటూత్ ఉచితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement