
మల్టీబ్రాండ్ మొబైల్ షోరూమ్ బిగ్ ‘సి’... ‘వన్‌ప్లస్7టీ’ విక్రయాలను ప్రారంభించింది. హైదరాబాద్ (కూకట్‌పల్లి, బాలాజీనగర్) షో రూమ్‌లో ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో బిగ్‘సి’ బ్రాండ్ అంబాసిడర్, సినీతార సమంత అక్కినేని, సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మే నేజర్ వికాస్ అగర్వాల్, బిగ్‘సి’ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, కైలాశ్ లఖ్యాని, బాలజీ రెడ్డి, ఆర్.గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. వన్‌ప్లస్ 7టీ వి క్రయాలకు సంబంధించి రూ.1,500 ఇన్‌స్టెం ట్ క్యాష్ బ్యాక్ (హెచ్‌డీఎఫ్‌సీ), ఆరు నెలల ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లపై ఎటువంటి అదనపు సొమ్మూ వసులు చేయకపోవడం వంటి ఆఫర్లు ఉన్నట్లు సంబంధిత ప్రకటన పేర్కొంది.