
బిగ్-సి అతిపెద్ద లైవ్ షోరూం ప్రారంభం
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ బిగ్ ‘సి’ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద షోరూంను నెలకొల్పింది. సినీ తార చార్మి చేతుల మీదుగా శనివారం ఈ షోరూం ప్రారంభమైంది. 100కు పైగా మొబైల్ ఫోన్ల లైవ్ డెమో ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున లైవ్ డెమో ఏర్పాటు చేయడం మొబైల్స్ రంగంలో తొలిసారి అని బిగ్ ‘సి’ చైర్మన్ యం.బాలు చౌదరి తెలి పారు. ఈ సందర్భంగా 20 శాతం వరకు క్యాష్ బ్యాక్, ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లను అందిస్తున్నట్టు చెప్పారు. అన్ని కంపెనీల మొబైల్స్‌తోపాటు ఐఫోన్ 5ఎస్ కూడా షోరూంలో లభిస్తుందని వివరించారు. మొబైల్ ఫోన్ల రిటైల్ రంగంలో 125 స్టోర్లతో బిగ్ ‘సి’ తొలి స్థానాన్ని కొనసాగిస్తోందని పేర్కొ న్నారు. అందుబాటు ధరల్లో మొబైల్స్ అందించడంతోపాటు ప్రతీ పండుగ, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బిగ్ ‘సి’ వినూత్న ఆఫర్లను ప్రకటించడం అభినందనీయమని చార్మి అన్నారు.