బిగ్‘సి’లో రెడ్‌మి నోట్–4 స్మార్ట్‌ఫోన్లు
హైదరాబాద్: రెడ్‌మి నోట్–4 స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్‘సి’లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం షావోమి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ‘బిగ్‘సి’ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్‌మి నోట్–4 స్మార్ట్‌ఫోన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బిగ్‘సి’ షోరూమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు.