బిగ్ సి దసరా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ బిగ్ సి ఐదో బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీతార శృతి హాసన్ నియమితులయ్యారు. దసరా సందర్భంగా పండుగ ఆఫర్లుగా క్యాష్ బ్యాక్, ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లను ఆమె ఆవిష్కరించారని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. బ్రాండ్ అంబాసిడర్‌గా శృతి హాసన్ నియామకంతో తమ అమ్మకాలు మరింతగా పెరుగుతాయన్న ఆశాభావాన్ని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి వ్యక్తం చేశారు.
బిగ్ సి అందిస్తున్న ఆఫర్లను వినియోగించుకోవాలని శృతి హాసన్ పేర్కొన్నారు. మొత్తం 102 బిగ్ సి షోరూమ్‌లు ఉన్నాయని, వీటిల్లో 30 షోరూమ్‌లను ఆధునీకీకరించి, లైవ్ షోరూమ్‌లుగా తీర్చిదిద్దామని బాలు చౌదరి వివరించారు. ప్రతి పండుగకు బిగ్ సి ప్రత్యేక ఆఫర్లనందిస్తోందని, అదే తరహాలో ఈ దసరాకు కూడా వినూత్నమైన ఆఫర్లనందిస్తున్నామని బాలు చౌదరి పేర్కొన్నారు.