Balu Choudhary
-
బిగ్ ‘సి’ ఉగాది ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ ఉగాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీల కొనుగోలుపై 7.50% వరకు తక్షణ తగ్గింపు అందిస్తుంది. ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో వీటిని కొనుగోలు చేయవచ్చు. మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు సంవత్సరం పూర్తిగా, రెండో ఏటా రూ.8వేల వరకు ‘మొబైల్ ప్రొటెక్షన్’ అదనంగా పొందవచ్చు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51% వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రజలంతా ఉగాది ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ బాలు చౌదరి కోరారు. -
బిగ్ సి దసరా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ బిగ్ సి ఐదో బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీతార శృతి హాసన్ నియమితులయ్యారు. దసరా సందర్భంగా పండుగ ఆఫర్లుగా క్యాష్ బ్యాక్, ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లను ఆమె ఆవిష్కరించారని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. బ్రాండ్ అంబాసిడర్‌గా శృతి హాసన్ నియామకంతో తమ అమ్మకాలు మరింతగా పెరుగుతాయన్న ఆశాభావాన్ని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి వ్యక్తం చేశారు. బిగ్ సి అందిస్తున్న ఆఫర్లను వినియోగించుకోవాలని శృతి హాసన్ పేర్కొన్నారు. మొత్తం 102 బిగ్ సి షోరూమ్‌లు ఉన్నాయని, వీటిల్లో 30 షోరూమ్‌లను ఆధునీకీకరించి, లైవ్ షోరూమ్‌లుగా తీర్చిదిద్దామని బాలు చౌదరి వివరించారు. ప్రతి పండుగకు బిగ్ సి ప్రత్యేక ఆఫర్లనందిస్తోందని, అదే తరహాలో ఈ దసరాకు కూడా వినూత్నమైన ఆఫర్లనందిస్తున్నామని బాలు చౌదరి పేర్కొన్నారు.