‘చాణక్య’గా గోపిచంద్‌ | Gopichand And AK Entertainments Movie Titled Chanakya | Sakshi
Sakshi News home page

‘చాణక్య’గా గోపిచంద్‌

Published Sun, Jun 9 2019 12:08 PM | Last Updated on Sun, Jun 9 2019 12:14 PM

Gopichand And AK Entertainments Movie Titled Chanakya’ - Sakshi

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తిరు ద‌ర్శక‌త్వంలో రామ‌బ్రహ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి ‘చాణక్య‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆదివారం ద‌ర్శక నిర్మాత‌లు విడుద‌ల చేశారు. త్వర‌లోనే ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

ద‌ర్శకుడు తిరు.. గోపీచంద్‌ను స‌రికొత్త పంథాలో చూపిస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రమిది. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్‌ ఖాన్ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement