నిఖిల్తోనూ అదే ఒప్పందం..!
టాలీవుడ్లో వరుసగా సక్సెస్ సాధిస్తున్న హీరోలు చాలా తక్కువ. అలాంటి అరుదైన ఘనత సాధించిన యంగ్ హీరో నిఖిల్. కెరీర్ స్టార్టింగ్లో మూస సినిమాలతో బోర్ కొట్టించిన నిఖిల్, ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలతో వరుస సక్సెస్లు సాధిస్తున్నాడు. ఇప్పటికే మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్, ప్రస్తుతం కన్నడ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్గా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతుంది. నిర్మాత అనీల్ సుంకర తన బ్యానర్లో ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేసేందుకు ఇష్టపడతారు. గతంలో 14 రీల్స్ బ్యానర్పై మహేష్ బాబు హీరోగా వరుసగా మూడు సినిమాలు నిర్మించారు. తరువాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనూ రాజ్ తరుణ్ హీరోగా వరుస సినిమాలు నిర్మించారు. ఇప్పుడ నిఖిల్ తోనూ అలాగే మూడు సినిమాల ఒప్పందం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. మరి ఒప్పందానికి నిఖిల్ అంగీకరిస్తాడో లేదో చూడాలి.