‘కిరాక్‌ పార్టీ’ ప్రీ టీజర్‌ | Nikhil Kirrak party Pre teaser | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 10:54 AM | Last Updated on Thu, Jan 18 2018 10:56 AM

Nikhil Kirrak party Pre teaser - Sakshi

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. జనవరి 22న తొలి పాటను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు నిఖిల్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement