తమిళ దర్శకుడితో తెలుగు నిర్మాత
14 రీల్స్ బ్యానర్లో భాగస్వామిగా ఉన్న అనీల్ సుంకర, తన సొంత నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించి మంచి విజయాలు సాధించారు. ఈ దసరాకు ఈడు గోల్డ్ ఎహే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తొలిసారిగా ఓ తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది కూడా కోలీవుడ్, టాలీవుడ్లలో మంచి పేరున్న సెల్వరాఘవన్ దర్వకత్వంలో కావటం మరో విశేషం.
ప్రస్తుతం ఎస్ జె సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన నెంజం మరప్పుదిల్లై సినిమా పనుల్లో బిజీగా ఉన్న సెల్వ.. ఆ సినిమా తరువాత ఓ వెరైటీ సినిమాకు రెడీ అవుతున్నాడు. హీరోగా మారిన కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను లోబడ్జెట్లో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు సెల్వ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అనీల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.