Santhanam
-
సడన్‌గా ఓటీటీ వచ్చేసిన స్టార్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన వడక్కుపట్టి రామసామి. పీరియాడికల్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1960-70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ కమెడియన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంపై బోల్తా కొట్టింది. కానీ గతంలో సంతానం - కార్తిక్ యోగి కాంబినేషన్లో వచ్చిన డిక్కీలోనా అనే మూవీ కమర్షియల్ సక్సెస్ కావడంతో వడక్కుపట్టి రామసామిపై అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.5.5 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు సాధించింది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి రానుందని టాక్. After a thundering response for the theatrical release, Fun-filled social drama #VadakkupattiRamasamy is now available on @PrimeVideoIN #VadakkupattiRamasamyOnPrime @karthikyogidir @akash_megha @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @RajaS_official @Sunilofficial… pic.twitter.com/rqAoormWfu — Santhanam (@iamsanthanam) March 12, 2024 -
ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. దాదాపు ఐదేళ్ల తర్వాత!
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్(ఇక్కడ నేనే కింగ్) అనే సినిమా చేస్తున్నారు. ఫుల్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే గతంలో సంతానం హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఏ1. తమిళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఐదేళ్ల తర్వాత తెలుగులోను అందుబాటులోకి వచ్చేసింది. అయితే థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఏ1 చిత్రం చూడాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. రెంటల్ విధానంలో తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. ఈ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రూ.79 చెల్లించాల్సిందే. కాగా.. రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా జాన్సన్ కే దర్శకుడిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ చక్కటి వసూళ్లను దక్కించుకున్నది. సంతానం తన కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరించాడు. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ రాబట్టింది. అయితే ఇప్పటికే తమిళ వర్షన్ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
యంగ్ హీరోయిన్‌తో జతకట్టిన స్టార్ కమెడియన్.. ఆసక్తిగా టైటిల్!
కోలీవుడ్‌లో హాస్యానికి మరో పేరు సంతానం. టాలీవుడ్లో బ్రహ్మనందంలాగే పంచ్ డైలాగులు చెప్పడంలో ఆయన స్టైలే వేరు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ఇంగ నాన్ దాన్ కింగ్ (ఇక్కడ నేనే కింగ్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని గోపురం ఫిలిమ్స్ పతాకంపై జీఎన్ అన్భచెలియన్ సమర్పణలో ఈయన కుమార్తె సుస్మిత అన్భచెల్లియన్ నిర్మిస్తున్నారు. ఇంగ నాన్ దాన్ కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రానికి ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కమలహాసన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అతనికి జంటగా ప్రియాలయ నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. నటుడు తంబి రామయ్య, మనోబాల, వైవిధ్య భరిత పాత్రలు పోషించిన ఇందులో మనీష్ కాంత్, వివేక్ ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది వినోదంతో కూడిన మంచి కథా చిత్రం అని దర్శకుడు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. எனது அன்புக்குரிய நண்பர், கோபுரம் பிலிம்ஸ் அன்புசெழியன் வழங்கும், சுஸ்மிதா அன்புசெழியன் தயாரிக்கும், தம்பி சந்தானம் நடிக்கும் புதிய படத்தின் பெயரையும், போஸ்டரையும் வெளியிடுவதில் மகிழ்கிறேன்.#IngaNaanThaanKingu#GNAnbuchezhian @Sushmitaanbu @gopuramfilms @Gopuram_Cinemas… pic.twitter.com/Jn2629UVP3 — Kamal Haasan (@ikamalhaasan) February 28, 2024 -
షూటింగ్ సమయంలో బామ్మ చనిపోవడంతో..: హీరోయిన్
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తమిళంలో నిర్మించిన చిత్రం వడక్కుపట్టి రామసామి. కమెడియన్ సంతానం కథానాయకుడిగా నటించిన ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించారు. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అతడితో నటించాలనుందన్న అల్లు శిరీష్ ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు శిరీష్ మాట్లాడుతూ.. హాస్య పాత్రలు పోషిస్తున్నప్పటి నుంచి నటుడు సంతానంను గమనిస్తున్నానని, ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ కథానాయకుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. సంతానం హాస్యం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఇంటర్వ్యూలు కూడా ఆసక్తిగా చూస్తుంటానని చెప్పారు. సంతానంతో కలిసి నటించాలనుందన్నారు. 65 రోజుల్లో షూటింగ్ పూర్తి సంతానం మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ తనతో రెండు చిత్రాలు చేస్తున్నారని, అందులో మొదటిగా విడుదలవుతున్న చిత్రం ఈ వడక్కుపట్టి రామసామి అని చెప్పారు. 65 రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా భారీస్థాయిలో నిర్మించారని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటికంటే ఇది భారీ బడ్జెట్ చిత్రమన్నారు. అర్థం చేసుకున్నారు మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ ప్రసాద్‌కు, క్రియేటివ్ నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. షూటింగ్ సమయంలో తన బామ్మ మరణించడంతో చాలా బాధపడ్డానని, దాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని చెప్పారు. మంచి బలమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు కార్తీక్ యోగికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: క్యాన్సర్‌తో చనిపోయిన ప్రముఖ హీరోయిన్.. ప్రముఖుల నివాళి -
ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు: యంగ్ డైరెక్టర్
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం లేటెస్ట్ మూవీ 'ఉడక్కపట్టి రామస్వామి'. దర్శకుడు కార్తీక్ యోగి తీసిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘాఆకాష్ హీరోయిన్గా నటించింది. ఇక రిలీజ్ దగ్గర పడిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం చైన్నెలో ప్రెస్ మీట ఏర్పాటు చేసి సినిమా గురించి పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు) 'ఇది 1974లో జరిగే కామెడీ మూవీ. సంతానం మట్టికుండల వ్యాపారిగా.. మేఘా ఆకాష్ మిలటరీ డాక్టర్‌గా నటించారు చెప్పారు. మద్రాస్ ఐ అనే అంటువ్యాధి కొత్తగా వ్యాపిస్తున్న సమయాన్ని హీరో ఎలా తనకు అనుకూలంగా వాడుకుంటాడు అనే విషయాన్ని కామెడీతో మిక్స్ చేసి సినిమా తీశాం. ఇది ఎవరి మనోభావాలకు దెబ్బతీయదు' అని దర్శకుడు కార్తీక్ యోగి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్?) -
హీరో సంతానం రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
హీరో సంతానం రూ.30 కోట్లు తీసుకునే స్థాయికి ఎదగాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. ఈయన తన స్టూడియో గ్రీన్ పతాకంపై సంతానం హీరోగా 80స్ బిల్డప్ అనే సినిమా నిర్మిస్తున్నారు. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి రాధిక ప్రీతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఆడుగళం నరేన్, దర్శకుడు కేఎస్ రవికుమార్, మొటై రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, దర్శకుడు సుందర్రాజన్, తంగదురై, స్వామినాథన్, కుంకీ అశ్విన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాకప్ రత్నరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. అప్పట్లో రూ.1.75 లక్షల పారితోషికం ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కల్యాణ్ మాట్లాడుతూ.. 'నాళయ ఇయక్కునార్ సీజన్ నుంచి బయటకు రాగానే దర్శకత్వం వహించాలని కలలు కన్నానన్నారు. దానిని నెరవేర్చింది నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా' అని పేర్కొన్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. తాను జిల్లని వర్ ఖాదర్ చిత్రాన్ని నిర్మించినప్పుడు అందులో నటించిన సంతానంకు రూ.1.75 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చానన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా రూ.3 కోట్లు తీసుకుంటున్నారని, రూ.30 కోట్లు తీసుకునే స్థాయికి సంతానం ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. అవకాశాల్లేక ఖాళీగా ఉన్నప్పుడు.. సంతానం మాట్లాడుతూ.. జ్ఞానం ఉన్న నిర్మాత జ్ఞానవేల్ రాజా అని పేర్కొన్నారు. 2024 అంతా ఆయనదే అని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు సరిగ్గా ఆడక ఇంటిలోనే కూర్చొన్నప్పుడు జ్ఞానవేల్ రాజా వచ్చి సలహాలు ఇచ్చేవారన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను దర్శకుడు కల్యాణ్ 20 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. బిగ్‌బాస్ రియాల్టీ గేమ్స్ కంటే తమ చిత్ర షూటింగ్‌లోనే కెమెరాలు అధికంగా ఉండేవని సంతానం పేర్కొన్నారు. చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్ -
స్టార్ కమెడియన్ కొత్త సినిమా.. విచిత్రమైన టైటిల్
'డీడీ రిటర్న్స్' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన కమెడియన్ కమ్ హీరో సంతానం.. ఆ తర్వాత 'కిక్' చిత్రంతో ఫెయిలయ్యాడు. అయితేనేం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడు చేస్తున్న సినిమాల్లో 'బిల్డప్' ఒకటి. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకుడు. రాధిక ప్రీతి హీరోయిన్. దర్శకుడు కేఎస్ రవికుమార్, ఆనంద్‌రాజ్, మన్సూర్ అలీ ఖాన్, మొట్టై రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) ఇది కామెడీ ఫాంటసీ విలేజ్ సినిమా అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. 1980 టైంలో జరిగే సినిమా ఇదని చెప్పాడు. ఈ క్రమంలోనే షూటింగ్ లోకేషన్స్, కాస్ట్యూమ్స్ కోసం చాలా కష్టపడినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరో విషయం ఏంటంటే.. మనోబాల, మైల్సామి నటించిన చివరి చిత్రం ఇదేనని అన్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) View this post on Instagram A post shared by Santhanam (@santa_santhanam) -
దర్శకనిర్మాత నన్ను వెతుక్కుంటూ పాండిచ్చేరి వచ్చారు: సంతానం
'డీడీ రిటర్న్స్' సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నాడు నటుడు సంతానం. తాజాగా ఇతడు ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈయన తాజాగా నటించిన చిత్రం కిక్. ఫార్చూన్ ఫిలిమ్స్ పతాకంపై నవీన్ రాజ్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా కన్నడ దర్శకుడు ప్రశాంత్ రాజ్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. తాన్యా నైతిక హీరోయిన్గా నటించింది. నటి రాగిణి త్రివేది, కోవై సరళ, తంబి రామయ్య, సెంథిల్, మన్సూర్ అలీ ఖాన్, బ్రహ్మానందం, సాధు కోకిల, ముత్తుకాళై, మనోబాల, కింగ్ కాంగ్, క్రేన్ మనోహర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అర్జున్ జాన్య సంగీతం, సుధాకర్ రాజ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర విడుదల హక్కులను వైఎంఆర్ క్రియేషన్స్ సంస్థ పొందింది. కాగా ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ.. ఒకరోజు ఈ చిత్ర నిర్మాత నవీన్ రాజ్, దర్శకుడు ప్రశాంత్ రాజ్ తనను వెతుక్కుంటూ పాండిచ్చేరి వరకూ వచ్చి కథ వినిపించారన్నారు. కథతో పాటు, వారి తమిళ భాషా నచ్చిందన్నారు. దీంతో చిత్ర షూటింగ్‌ను ఓకే షెడ్యూల్లో చైన్నెలో ప్రారంభించి న్యూయార్క్‌లో పూర్తి చేసినట్లు చెప్పారు. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా కిక్ ఉంటుందన్నారు. ఇది అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఇగో అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సినిమా అని చెప్పారు. దీన్ని డీడీ రిటర్న్స్ చిత్రంతో పోల్చరాదని, ఇది మరో తరహాలో ఉంటుందన్నారు. దీన్ని సంతానం చిత్రం అనడం కంటే దర్శకుడు ప్రశాంత్ రాజ్ చిత్రం అనే చెప్పాలన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను.. సినిమా ఎంట్రీకి ఆ ఫోటోనే కారణం: శ్రీలీల -
హీరోగా స్టార్ కమెడియన్.. బ్రహ్మానందంతో కలిసి!
కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన నటుడు సంతానం. ఇతడి కంటే ముందు వడివేలు, వివేక్ లాంటి కమెడియన్స్ హీరోలు అయ్యారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. సంతానం మాత్రం హీరోగా హిట్స్ కొడుతున్నాడు. ఆ మధ్య కొన్ని చిత్రాలు నిరాశపరిచినా.. ఈ మధ్యే 'డీడీ రిటర్న్స్' హిట్ కావడంతో సంతానంలో జోష్ వచ్చింది. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) ఈ క్రమంలోనే తాజాగా 'కిక్' మూవీతో అలరించడానికి సిద్ధమైపోయాడు. ఫార్చూన్ పతాకంపై సంతానం హీరోగా నటించిన చిత్రం కిక్. కన్నడంలో లవ్ గురు, గాని బనానా, విజిల్, ఆరెంజ్ మూవీస్ తీసిన ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్ హీరోయిన్. ఇందులో తంబిరామయ్య, బ్రహ్మానందం, సెంథిల్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాల, వైజీ మహేంద్రన్, షకీలా, స్కూల్ సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ ఈ జనవరిలోనే విడుదలైంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల రిలీజ్ కొంత ఆలస్యం అయిందని నిర్మాతలు పేర్కొన్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కిక్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
మళ్లీ కామెడీ బాట పట్టిన సంతానం
నటుడు సంతానం ఇంతకు ముందు హర్రర్ డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందిన దిల్లుక్కు దుడ్డు, డీడీ–2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తరువాత కామెడీకి భిన్నంగా నటించిన కొన్ని చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో సంతానం మళ్లీ తనకు కలిసివచ్చిన కామెడీతోనే చేసిన చిత్రం డీడీ రిటర్న్స్. ఆర్కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రమేష్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటించారు. నటుడు మారన్, సేతు, మొటై రాజేంద్రన్, ఫెప్సీ విజయన్, మునీష్ కాంత్, ప్రదీప్ రావత్, రెడిన్ కింగ్స్ లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రేమ్ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆప్రో సంగీతాన్ని, దీపక్ కుమార్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సంతానం మాట్లాడుతూ.. నేను నటించిన కొన్ని చిత్రాలు సంతానం సినిమాల మాదిరిగా లేవని కామెంట్లు వినిపించాయి.. అయితే డీడీ రిటర్న్స్ పూర్తిగా సంతానం చిత్రంలా యూనిట్ సభ్యులందరి సహకారంతో రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో ఒక్కో దెయ్యం ఒక్కో విధంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. చదవండి: ఈ బస్ డ్రైవర్ బిగ్‌బాస్‌లోకి -
లేడీ గెటప్‌లో ఉన్న ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
యాక్టర్స్ అందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉంటారు. అభిమానుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ టచ్ లో ఉంటారు. రెగ్యులర్ గా అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కాబట్టి 'త్రో బ్యాక్' పిక్స్ పేరిట కొన్నింటిని షేర్ చేస్తూ ఉంటారు. అలా కార్తీ షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. (ఇదీ చదవండి: అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి) ఇందులో కార్తీతో పాటు ఓ మహిళ ఉన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే అతడో స్టార్ కమెడియన్. సినిమాలో పాత్ర కోసం అమ్మాయిలా తయారయ్యాడు. అతడెవరో గుర్తుపట్టారా? బహుశా గుర్తుపట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే సదరు హాస్యనటుడు తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. కార్తీ పక్కన లేడీ గెటప్ లో ఉన్న కమెడియన్ సంతానం. 2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సంతానం.. తమిళంలోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించాడు. తన మేనరిజమ్స్, కామెడీతో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాడు. 2013 నుంచి కెరీర్ లో మరో మెట్టు ఎదిగిన ఇతడు.. హీరోగా మారాడు. అప్పటినుంచి లీడ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కిక్, డీడీ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరోవైపు కార్తీ కూడా 'జపాన్' సినిమా చేస్తున్నాడు. త్వరలో ఇది థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Karthi Sivakumar (@karthi_offl) (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
కమెడియన్‌కి జోడీగా హీరోయిన్ సురభి.. ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళసినిమా: కోలీవుడ్‌లో హాస్యనటుడి నుంచి కథానాయకుడుగా మారిన నటులలో సంతానం ఒకరు. అయితే చాలామంది హాస్య నటుల మాదిరిగా మళ్లీ కామెడీ పాత్రల వైపు వెళ్లకుండా కథానాయకుడుగానే కొనసాగుతూ ఉండటం విశేషం. నిజం చెప్పాలంటే సంతానంకు ఇటీవల సరైన హిట్టు పడలేదు. తను బాణీకి భిన్నంగా ప్రయోగాలు చేయడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే తాజాగా మళ్లీ తన పంథాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన చేతిలో కిక్ , వడక్కు పట్టి రామసామి చిత్రాలు ఉన్నాయి. తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ద్వారా ప్రేమ్ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు రామ్ బాల శిష్యుడు కావడం గమనార్హం. ఈ చిత్రానికి డీడీ∙రిటర్న్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. విచిత్ర టైటిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, ప్రోమో టీజర్‌ను తమిళ ఉగాది సందర్భంగా విడుదల చేశారు. కాగా నటుడు సంతానం ఇంతకుముందు దిల్లుక్కు దుడ్డు, దానికి సీక్వెల్లో నటించి సక్సెస్ సాధించారు. అవి హార్రర్, కామెడీ జానర్లో రూపొందిన కథా చిత్రాలు. కాగా తాజాగా ఈయన తనకు కలిసొచ్చిన అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. డీడీ రిటర్న్స్ చిత్ర నేపథ్యం కూడా హార్రర్, కామెడీ, థ్రిల్లర్‌నే. కాగా ఇందులో నటి సురభి నాయకిగా నటించనుంది. రెడిన్ కింగ్స్ లీ, లొల్లుసభ మారన్, మొట్టై రాజేంద్రన్, మునీస్కాంత్, దీనా, బిఫిన్, తంగదురై, దీపా, మానసి తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దీనిని ఆర్కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై సి.రమేష్ కుమార్ నిర్మిస్తున్నారు. చిత్రాన్ని ఈ ఏడాది లోనే తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
నటుడు సంతానంతో మేఘా ఆకాష్ రొమాన్స్!
తమిళసినిమా: సంతానంతో రొమాన్స్ చేయడానికి నటి మేఘా ఆకాష్ సిద్ధమయ్యారు. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడకుపట్టి రామసామి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఇంతకుముందు సంతానం హీరోగా డిక్కీలూన అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం వడకుపట్టి రామసామి. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నటుడు జాన్ విజయ్ ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మొటై రాజేంద్రన్, నిళల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్విలిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ రోల్డెన్ సంగీతాన్ని, దీపక్ చాయాగ్రహణంను అందిస్తున్నారు. తాజాగా కథానాయకిగా మేఘా ఆకాష్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా మేఘా ఆకాష్‌ను కోలీవుడ్‌లో చూసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న యాదూమ్ ఊరే యావరుమ్ కేళీర్, మానై పిడిక్కాద మనిదన్, సింగిల్ శంకరుమ్ స్మార్ట్ పోన్ సిమ్రానుమ్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా వడకు పట్టి రామసామి చిత్రంలో ఈమె డాక్టర్‌గా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోందని చెప్పారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
‘వడకుపట్టి రామసామి’గా సంతానం
తమిళ సినిమా: నటుడు సంతానం తాజా చిత్రం కిక్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఆయన నూతన చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దీనికి వడకుపట్టి రామసామి అనే టైటిల్ నిర్ణయించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు. సంతానం, దర్శకుడు కార్తీక్ యోగి కాంబినేషన్లో ఇంతకుముందు డిక్కిలూన అనే సక్సెస్ఫుల్ చిత్రం వచ్చింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ అధినేతలు ఇంతకుముందు తెలుగులో గూఢాచారి వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించి కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ ఇప్పటికే విట్నెస్, సాలా వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మించారు. తాజాగా సంతానం కథానాయకుడిగా వాడకుపట్టి రామసామి చిత్రం చేస్తున్నారు. దీని గురించి క్రియేట్ ప్రొడ్యూసర్ వి. శ్రీ నటరాజ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు వివిధ జానర్లలో కమర్షియల్ అంశాలతో కూడిన మంచి వినోదభరితమైన కథా చిత్రాలను అందించాలని తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. సంతానం నటించిన డిక్కీలూన చిత్రాన్ని చూశామన్నారు. దీంతో దర్శకుడు కార్తీక్ యోగి ఈ చిత్రకథ చెప్పగానే నచ్చిందన్నారు. వైద్య భరిత కథా చిత్రాలకు తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దర్శకుడు చెప్పిన కథకు ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించామని చెప్పారు. హీరోయిన్ ఎంపిక జరుగుతోందని తెలిపారు. నటుడు తమిళ్ కీలక పాత్ర పోషిస్తున్న ఇందులో జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి, మారన్, మొట్టె రాజేంద్రన్, నిళల్గళ్ రవి, శేషు, నటి జాక్యూలిన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. దీనికి సాన్ రోల్డన్ సంగీతాన్ని, దీపక్ చాయాగ్రహణను అందిస్తున్నారు. -
తమిళ కమెడియన్ కన్నడ సినిమాలో బ్రహ్మానందం, కోవై సరళ..
కోలీవుడ్ హాస్యనటుడు సంతానం తాజాగా శాండిల్‌వుడ్‌లో తన లక్కును పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (తమిళం, కన్నడం) ఈ నెల 26న బెంగళూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫిలింస్ పతాకంపై నవీన్ రాజ్ నిర్మిస్తున్నారు. నటి తాన్యా హోప్ నాయకి నటిస్తున్న ఇందులో దర్శకుడు భాగ్యరాజ్, బ్రహ్మానందం, సెంథిల్, మనోబాల, కోవై సరళ; మన్సూర్ అలీఖాన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_741246272.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే.. -
రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో చేరతా!
చెన్నై: రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో చేరతానని సంతానం అన్నారు. నటుడు సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ప్యారిస్ జయరాజ్. ఈ చిత్రం ద్వారా కె.జాన్సన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో సంతానంకు జంటగా నటి అనైకా సోటి, సస్టిక రాజేంద్రన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. మంగళవారం చిత్ర యూనిట్ సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. మీరు ఏ పార్టీలో చేరతారని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏ పార్టీ రాజ్యసభ సీటు ఇస్తే ఆ పార్టీలో చేరతానని సరదాగా పేర్కొన్నారు. రాజకీయాల్లో చేరే ఆలోచన లేదని, నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచడానికే ఇష్టపడతానని అన్నారు. -
సంతానంతో బాలీవుడ్ బ్యూటీ
సినిమా : నటుడు సంతానంతో బాలీవుడ్ బ్యూటీ అనైకా సాటీ రొమాన్స్ చేయనుంది. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు సంతానం. ఈయన నటించిన డగాల్టీ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. మరో చిత్రం సర్వర్‌సుందరం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా కన్నన్ దర్శకత్వంలో నటిస్తున్న బిస్కోత్, కార్తీక్ యోగి దర్శకత్వంలో నటిస్తున్న డిక్కిలోనా చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. కాగా సంతారం కొత్త చిత్రానికి రెడీ అయ్యాడు. జాన్సన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాగా ఈ దర్శకుడితో ఇంతకు ముందు ఏ 1 అనే సక్సెస్ఫుల్ చిత్రంలో సంతానం నటించారు. తాజాగా రెండోసారి జాన్సన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్ గ్లామరస్ నటి అనైకా సాటి నటిస్తోంది. ఈ అమ్మడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సత్య 2 చిత్రంలో నటించి అందాలను ఆరబోసింది. ఆ తరువాత తమిళంలో కావ్యవతలైవన్, ఆధర్వకు జంటగా సెమ్మబోద ఆగాదే చిత్రాలలో నటించింది. చిన్న గ్యాప్ తరువాత ఇప్పుడు సంతానంతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
హీరోబజన్ సింగ్
ఇండియన్ టీమ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన స్పిన్ బౌలింగ్‌తో మ్యాజిక్ చేసేవారు. ఈ మధ్యే నటుడిగా మారి యాక్టింగ్ మొదలుపెట్టారు. తమిళ నటుడు సంతానం నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లీడ్ యాక్టర్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ‘ఫ్రెండ్షిప్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక క్రికెటర్ లీడ్ యాక్టర్‌గా నటించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం పేర్కొంది. జేపీఆర్, శ్యామ్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
సంతానం హీరోగా ‘సర్వర్ సుందరం’
స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన చిత్రం ‘సర్వర్ సుందరం’. సంతానంకు జోడిగా వైభవి నటిస్తున్న ఈ చిత్రంలో రాధా రవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2016లోనే పూర్తయినప్పటికీ రకరకాల కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్‌కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు పోటీగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ వంటి సెన్సెషన్ స్టార్ సినిమా వస్తున్న రోజే ‘సర్వర్ సుందరం’రిలీజ్ అవుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా కోసం సంతానం హోటల్ సర్వర్‌గా ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా ఆడియన్స్‌ను ఫుల్‌గా అలరిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. అంతేకాకుండా మాస్ ఎలిమెంట్స్‌కు కూడా ఢోకా లేదని తెలిపారు. బల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ హర్ష వడ్డెల, డి. వెంకటేష్‌లు నిర్మించారు. -
ఏజెంట్ సంతానం?
ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నెల్లూరు బ్రాంచ్‌లో కేసులు సాల్వ్ చేశారు ఏజెంట్ ఆత్రేయ. ఇప్పుడు ఈ బ్యూరో చెన్నైలో కూడా ఓపెన్ కానుందని తెలిసింది. మరి అక్కడి కేసులను ఎవరు సాల్వ్ చేస్తారంటే... ఏజెంట్ సంతానం అని తెలిసింది. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిటెక్టివ్ చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. కామెడీ ఏజెంట్‌గా కితకితలు పెట్టారు నవీన్. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. నవీన్ పాత్రలో తమిళ హాస్య నటుడు సంతానం కనిపించనున్నారట. దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
తమిళంలో ‘ఏజెంట్ సాయి’ రీమేక్
తెలుగులో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఇందులో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి తొలి చిత్రంతోనే హిట్ సాధించాడు. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాపై తమిళ ఇండస్ట్రీ కన్నుపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం తమిళంలో రీమేక్ చేయనున్నారని టాక్. వంజగర్ ఉలగం అనే క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు మజోజ్ బీదా ఈ సినిమాను డైరెక్షన్ చేయనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక తారాగణాన్ని త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఇక ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా విషయానికి వస్తే అనాథ శవాల మిస్టరీని చేధించడానికి వెళ్లిన ఏజెంట్ సాయి చిక్కుల్లో పడతాడు. ఈ క్రమంలో అతను వాటి నుంచి ఎలా బయటపడతాడు.. ఆ మిస్టరీని ఎలా చేధించాడన్నదే మిగతా కథ. తెలుగులో హిట్‌టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం హిందీలో కూడా తెరకెక్కించే అవకాశాలు లేకపోలేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది రెండు భాషల్లోనూ ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇక తనదైన కామెడీతో ఎన్నో హిట్లు సాధించిన సంతానం గత కొంతకాలంగా వరుస ఫ్లాప్(దిల్లుక్కు దుడ్డు 2, ఏ1)లతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా సంతానం విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. -
షావుకారు జానకి @ 400
నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ చేసిన తారల్లో అలనాటి తార షావుకారు జానకి ఒకరు. కథానాయికగా ఒకప్పుడు వెండితెరను ఏలిన జానకి ఇప్పుడు బామ్మ పాత్రలు చేస్తున్నారు. ఆమె సినీ మైలురాయి 400వ చిత్రానికి చేరుకుంది. తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బామ్మ కస్తూరి పాత్రలో నటిస్తున్నారు జానకి. ఇది ఆమెకు 400వ చిత్రం కావడం విశేషం. ‘‘జానకిగారి ల్యాండ్ మార్క్ మూవీ మా చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఆమె ఎంతటి ప్రతిభాశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా చిత్రకథ, పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
నటుడు సంతానంపై ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: నటుడు సంతానంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దిల్లుక్కు దుడ్డు 2 చిత్రం తరువాత నటుడు సంతానం నటించిన చిత్రం ఏ 1. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇదే నెల 26వ తేది తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు అదే వివాదాంశంగా మారింది. ఏ1 చిత్రంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ విళ్లుపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. బ్రాహణ సమాజం అభివృద్ధి సంఘం రాష్ట్ర లక్ష్య సాధన కార్యదర్శి కార్తీక్ ఆధ్వర్యంలో కొందరు మంగళవారం విళ్లుపురం ఎస్పీ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో నటుడు సంతానం నటించిన ఏ 1 చిత్రం త్వరలో తెరపైకి రానుందన్నారు. కాగా ఆ చిత్రంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగానూ, ఎగతాలి చేసే విధంగానూ సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. చిత్ర దర్శక, నిర్మాతలను, అందులో నటించిన సంతానం తదితర నటీనటులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తమ చిత్రం గురించి ఇలాంటి విమర్శలు వస్తాయని, అయితే పనీపాటా లేనివారే అలాంటి విమర్శలు చేస్తారని నటుడు సంతానం మంగళవారం జరిగిన వీడియా సమావేశంలో పేర్కొనొడం గమనార్హం. -
కామెడీ విత్ యాక్షన్‌తో..
తమిళసినిమా: నటుడు సంతానం కామెడీ విత్ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. సంతానం నటిస్తున్న తాజా చిత్రం డకాల్టీ. ఈ చిత్రం ద్వారా బెంగాలీ బ్యూటీ రిత్తికాసేన్ హీరోయిన్గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే యోగిబాబు, రాధారవి, రేఖ, బాలీవుడ్ నటుడు హేమంత్పాండే, సంతానభారతి, మనోబాలా, నమోనారాయణ, స్టంట్శిల్వా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సంతానంతో నటుడు యోగిబాబు తొలిసారిగా నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ శిష్యుడు విజయ్‌ఆనంద్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ హాలీవుడ్ నటుడు జాకీచాన్ చిత్రాల తరహాలో డకాల్టీ చిత్రం కామెడీతో కూడిన ఫైట్స్ సన్నివేశాలతో జనరంజకంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను తిరుచెందూర్, తిరునెల్వేలి, కారైక్కుడి, చెన్నై, అంబాసముద్రం, కడప, పూనే, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా దీన్ని 18 రీల్స్ పతాకంపై తిరుపూర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్, సినీ డిస్ట్రిబ్యూటర్ ఎస్పీ. చౌదరి భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గాయకుడు విజయ్‌నారాయణన్ సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత నిర్మాత ఎస్పీ.చౌదరి సంతానం హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి పార్టు–3ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని ఆయన 3డీ ఫార్మెట్లో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం గురించి నటుడు సంతానంతో చర్చలు జరుపుతున్నట్లు నిర్మాత తెలిపారు. -
నేత్రదానం మహాదానం
కొరుక్కుపేట: నేత్రదానం మహాదానమని ప్రముఖ సినీనటుడు సంతానం పేర్కొన్నారు. ఈ మేరకు కంటి వైద్య చికిత్సలో ఆధునిక టెక్నాలజీని జోడించి నేత్ర వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రి చెన్నై శివారు ప్రాంతం అంబత్తూర్లో డాక్టర్ అగర్వాల్ ఐ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు సంతానం పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పటల్స్ సీఈఓ డాక్టర్ ఆదిల్ అగర్వాల్ మాట్లాడుతూ అంబత్తూర్లో తమ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు . ప్రారంభోత్సవ సందర్భంగా అర్హులైన పేదలు 100మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తామని ప్రకటిస్తూ పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబత్తూర్ ప్రజలకు తమ సేవలను చేరువ చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రి అంబూత్తూర్ క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ కౌశిక్ పిబి మాట్లాడుతూ అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలతో ఐ కేర్ సేవలు అందులో కార్నియా , క్యాటరాక్ట్, గ్లకోమా, పెడియాట్రిక్ ఐ కేర్ ట్రీట్మెంట్లు ఇంకా న్యూరో ఆప్తమాలజీ, రెటినా, లో విజన్ రెహాబిలిటేషన్ సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం నటుడు సంతానం మాట్లాడూతూ ప్రముఖ కంటి ఆస్పత్రిగా రాణిస్తున్న డాక్టర్ అగర్వాల్ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయమన్నారు. అన్ని దానాల్లోకంటే నేత్రదానం మహాదానం అని పేర్కొన్నారు . నేత్రదానం చేసేందుకు యువత ముందకు రావాలని పిలుపునిచ్చారు. -
‘మళ్లీ కమెడియన్‌గా మారలేను’
మళ్లీ కమెడియన్‌గా మారడం జరగదు అంటున్నాడు కమెడియన్ నుంచి కథానాయకుడిగా మారిన నటుడు సంతానం. ఈయన హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం దిల్లుక్కు దుడ్డు 2. ఇంతకుముందు సంతానం హీరోగా రాంబాలా దర్శకుడిగా పరిచయమై తెరకెక్కించిన చిత్రం దిల్లుక్కు దుడ్డు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా అదే కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దిల్లుక్కు దుడ్డు 2. మలయాళీ నటి శ్రితా శివదాస్ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మొట్టరాజేంద్రన్, విజయ్ టీవీ.రామర్. బిపిన్, శివశంకర్‌మాస్టర్, మారిముత్తు, జయప్రకాశ్, ప్రశాంత్, విజయ్ టీవీ ధనశేఖర్, సీఎం.కార్తీక్, నటి ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించారు. షబ్బీర్ సంగీతాన్ని, దీపక్‌కుమార్ పది ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరులు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దిల్లుక్కు దుడ్డు చిత్రంలో చివరి 20 నిమిషాలకు ప్రేక్షకులు విరగబడి నవ్వుకున్నారన్నారు. అలా ఈ సీక్వెల్లో చిత్రమంతా ఉండాలని భావించామన్నారు. అదేవిధంగా తన చిత్ర టీమ్ కథను తయారు చేసిందని చెప్పారు. దిల్లుక్కు దుడ్డు చిత్రంలో కథకు ముస్లిం యువతి అవసరం కావడంతో బాలీవుడ్ నటిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నామని, ఈ చిత్రంలో మలయాళీ యువత కథకు అవసరం అవడంతో కేరళ నటి శ్రితాశివదాస్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. హర్రర్, కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బాగా వచ్చిందని తెలిపారు. నటుడిగా కంటే నిర్మాతగా చిత్రం చేయడం కష్టం అని అన్నారు. అదేవిధంగా ఏడాదికి ఒక చిత్రమే చేయాలని తాను అనుకోలేదని, ఇప్పటికే నటించిన మూడు చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయని అన్నారు. హీరోగా అవకాశాలు లేకపోతే మళ్లీ కమెడియన్‌గా నటించే ఆలోచన లేదన్నారు. దర్శకత్వం చేస్తానని, అలా తన తొలి చిత్రాన్ని ఆర్య హీరోగా చేస్తానని అన్నారు. ఎలాంటి కథా చిత్రం చేసినా, అది మంచి చిత్రంగా ఉండాలన్నదే తన భావన అని చెప్పారు. ఇకపోతే ఆర్య పెళ్లి గురించి అడుగుతున్నారని, ఆ విషయాన్ని ఆయన్ని అడిగి చెబుతానని సంతానం అన్నారు. -
‘గ్లామర్ ఏ మాత్రం తగ్గదు’
సంతానంకు జంటగా, వల్లవనుక్కు పుల్లుం ఆయుధం, ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో పాపులర్ అయిన నటి ఆశ్నా జవేరి. గతంలో మోడలింగ్ రంగంలో దుమ్మురేపిన ఆశ్నాజవేరి 2014లో కోలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసింది చాలా తక్కువ సినిమాలే. అందుకు కారణం అవకాశాలు రాకపోవడమే. నాలుగేళ్లు దాటినా పెద్ద హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం రాకపోవడం, స్టార్ హీరోయిన్ ఇమేజ్ పొందలేకపోవడంతో ఇక లాభం లేదు అనుకుందో ఏమో అందాలారబోతకు గేట్లు తెరిచేసింది. తాజాగా విమల్‌తో రొమాన్స్ చేస్తున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రంలో గ్లామర్‌లో విచ్చలవిడిగా నటించేసిందట. ఈ విషయాన్ని ఆశ్నాజవేరినే చెప్పింది. తెలుగు చిత్రం గుంటూర్ టాకీస్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన ఈ బ్యూటీతో చిన్న భేటీ. ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రంలో అందాలారబోతకు గేట్లు తెరిచేశారట? ఈ చిత్రంలో తొలిసారిగా గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. అవును ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం పూర్తిగా గ్లామరస్ కథా చిత్రం. ఇది తెలుగు చిత్రం గుంటూర్ టాకీస్‌కు రీమేక్. ఆ చిత్రం మాదిరిగానే ఇందులోనూ గ్లామర్ ఏమాత్రం తగ్గదు. ఇక కథ డిమాండ్ మేరకే నేనూ గ్లామరస్‌గా నటించాను. అయితే దీన్ని ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్రంతో పోల్చకూడదు.ఆ చిత్రాన్ని నేను చూడకపోయినా, కచ్చితంగా ఇది అలా ఉండదు. ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం రొమాంటిక్ కామెడీ కథా చిత్రంగా ఉంటుంది. నటుడు విమల్‌కు జంటగా నటించడం గురించి? విమల్‌కు జంటగా నటించడం చాలా సంతోషకరమైన అనుభవం. ఆయన జాలీ టైపే అయినా, చాలా నిరాడంబరంగా ఉంటారు. విమల్‌తో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను. కోలీవుడ్‌లో మీ తొలి చిత్ర హీరో సంతానం గురించి? సంతానం ద్వారానే నేను కోలీవుడ్‌లో పాపులర్ అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నాను. అదే విధంగా విజయ్, అజిత్, సూర్య ప్రముఖ హీరోల సరసన నటించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు? నిజం చెప్పాలంటే నాకు పలాన పాత్రలో నటించాలని ఏమీ లేదు. కథకు, పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుని నటిస్తాను. తమిళం మినహా ఇతర భాషల్లో అవకాశాలేమైనా? తెలుగులో ఒక చిత్రం చేస్తున్నాను. అయితే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేయాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. -
వినోదమే వినోదం
‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు. -
‘దమ్ముంటే సొమ్మేరా’ మూవీ రివ్యూ
టైటిల్ : దమ్ముంటే సొమ్మేరా జానర్ : హర్రర్ కామెడీ తారాగణం : సంతానం, అంచల్ సింగ్, ఆనంద్ రాజ్, సౌరభ్ శుక్లా, రాజేంద్రన్ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం : కార్తీక్ రాజా దర్శకత్వం : రామ్ బాలా నిర్మాత : నటరాజ్ సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమా ఫార్ములా కామెడీ హర్రర్. ఈ జానర్ లో తెరకెక్కిన చాలా సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. ఒక దశలో అన్నీ ఇదే తరహా సినిమాలు రావటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు. దీంతో వెండితెర మీద హర్రర్ కామెడీల జోరుకు బ్రేక్ పడింది. కొంత గ్యాప్ తరువాత మరో సారి అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా దమ్ముంటే సొమ్మేరా. కోలీవుడ్ కామెడీ స్టార్ సంతానం హీరోగా తెరకెక్కిన దిల్లుకు దుడ్డు సినిమాను దమ్ముంటే సొమ్మేరా పేరుతో తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌గా పరిచయం అయిన సంతానం, హీరోగా ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? హర్రర్ కామెడీ జానర్ మరోసారి సక్సెస్ ఫార్ములాగా ప్రూవ్ చేసుకుందా..? కథ : కుమార్ (సంతానం), కాజల్ (అంచల్ సింగ్) స్కూల్ ఫ్రెండ్స్. చిన్న వయసులోనే కాజల్‌కు కుమార్ అంటే ఇష్టం కలుగుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ కాజల్ తల్లిదండ్రులు ఆమెను విదేశాలకు పంపించటంతో ఇద్దరు దూరమవుతారు. చాలా ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన కాజల్.. కుమార్ కలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓ గొడవ కారణంగా కలుసుకున్న కుమార్, కాజల్‌లు గతం తెలుసుకొని ప్రేమలో పడతారు. కానీ కాజల్ తండ్రి సేట్ (సౌరబ్ శుక్లా) వారి ప్రేమను అంగీకరించడు. ఎలాగైనా కుమార్ అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ మణి (రాజేంద్రన్)తో కలిసి కుమార్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తాడు. సిటీలో చంపితే అందరికీ అనుమానం వస్తుందని నగరానికి దూరంగా శివగంగ పర్వతం మీద ఉన్న పాత బంగ్లాకు తీసుకెళ్లి చంపాలని నిర్ణయించుకుంటారు. కాజల్, కుమార్‌లకు పెళ్లి చేస్తానని అబద్ధం చెప్పి రెండు కుటుంబాలను దెయ్యాల బంగ్లాకు తీసుకెళతాడు. అలా బంగ్లాలోకి వెళ్లిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? ఆ బంగ్లా కథ ఏంటి..? దెయ్యాల భారీ నుంచి వారిని ఎవరు కాపాడారు..? చివరకు కాజల్, కుమార్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : తెలుగు తెర మీద హర్రర్ కామెడీ సినిమాలు చాలానే వచ్చాయి. దమ్ముంటే సొమ్మేరా కూడా దాదాపు అదే తరహాలో సాగుతుంది. కథ పరంగా కొత్తదనమేమీ లేకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్ట్ హాప్ కాస్త నెమ్మదిగా సాగినా.. కథ బంగ్లాలోకి ఎంటర్ అయిన తరువాత కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. (సాక్షి రివ్యూస్) హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్‌లో సో సోగా అనిపించినా.. కామెడీ సీన్స్ లో మాత్రం సంతానం కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్‌తో తన మార్క్ చూపించాడు. హీరోయిన్గా పరిచయం అయిన అంచల్ సింగ్ ఆకట్టుకుంది. గ్లామర్‌తో పాటు నటనలోనూ మెప్పించింది. కామెడీ హర్రర్ జానర్ కావటంతో ప్రతీ పాత్రలో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా హీరో తండ్రి పాత్రలో ఆనంద్ రాజ్, హీరోయిన్ తండ్రిగా సౌరభ్ శుక్లా, కాంట్రక్ట్ కిల్లర్ గా రాజేంద్రన్ తమ పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాప్లో వచ్చే రాజేంద్రన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. తమన్ సంగీతమందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కార్తీక్ రాజా అందించిన నేపథ్య సంగీతం హర్రర్ సినిమాకు కావాల్సిన ఎఫెక్ట్ తీసుకువచ్చింది. హర్రర్ చిత్రాలకు సినిమాటోగ్రఫి ఎంతో కీలకం. దీపక్ కుమార్ తన విజువల్స్‌తో ఆడియన్స్‌ను భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. (సాక్షి రివ్యూస్) ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
జూన్ 22న ‘దమ్ముంటే సొమ్మేరా’
కోలీవుడ్ కామెడీ స్టార్ సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దిల్లుడు దుడ్డు’. తమిళనాట ఘనవిజయం సాదించిన ఈ సినిమాను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ, ‘తమిళంలో తేండాల్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా ఇది. అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్ తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. ఈనెల 22న దాదాపు 200 ధియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు అంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. -
దమ్ముందా?
ప్రముఖ హాస్యనటుడు సంతానం, అంచల్ సింగ్ జంటగా రూపొందిన చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. రామ్‌బాల దర్శకత్వంలో శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో నటరాజ్ ఈ నెల 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ– ‘‘హాస్యనటుడిగా అలరించిన సంతానం హీరోగానూ అలరిస్తున్నాడు. ఆయన గత సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: దీపక్ కుమార్ పతి. -
నిర్మలాదేవిని విచారించిన సంతానం
టీ.నగర్: లైంగిక ఆరోపణలకు గురైన ప్రొఫెసర్ నిర్మలాదేవి వద్ద ప్రత్యేక విచారణ అధికారి సంతానం గురువారం విచారణ జరిపారు. అరుప్పుకోటై దేవాంగ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయిత్నంచినట్టు వచ్చిన ఆరోపణలు తెలిసిందే. దీనికి సంబంధించి ఆడియో టేపులు విడుదల కావడంతో నిర్మలాదేవిని అరెస్టు చేసి ఆమె వద్ద సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజులుగా విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించి మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఏకసభ్య విచారణ అధికారి సంతానం ఇది వరకే మదురై అరుప్పుకోటై ప్రాంతాల్లో ప్రాథమిక విచారణ జరిపారు. బుధవారం ఆయన రెండవ విడత విచారణను ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా పేర్కొనబడుతున్న నిర్మలాదేవి వద్ద సమగ్ర విచారణ జరిపేందుకు సంతానం నిర్ణయించారు. ఇందుకోసం మదురై సెంట్రల్ జైల్లో ఉన్న నిర్మలాదేవిని నేరుగా కలుసుకునేందుకు జైలు అధికారుల అనుమతి కోరారు. దీంతో అనుమతి లభించడంతో గురువారం ఉదయం సంతానం మదురై సెంట్రల్‌జైలుకు నేరుగా వెళ్లి నిర్మలాదేవి వద్ద విచారణ జరిపారు. ఆయనతో పాటు ప్రొఫెసర్లు కమలి, త్యాగేశ్వరి వెంట వెళ్లారు. శుక్రవారం సంతానం అరుప్పుకోటై కళాశాల నిర్వాహకులు, విద్యార్థినుల వద్ద విచారణ జరపనున్నారు. -
దమ్ముంటే సొమ్మే
సంతానం హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. అంచల్ సింగ్ కథానాయిక. రామ్‌బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాని శ్రీ కృష్ణా ఫిలింస్ బ్యానర్‌పై ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో నటరాజ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ –‘‘గట్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ ఈ టైటిల్ పెట్టారు. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందినే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి. -
నా తప్పూ ఉంది!
తమిళసినిమా: నా తప్పు లేదని అనడం లేదు. ఉంది అయితే..అని వ్యాఖ్యానించారు సంచలన నటుడు శింబు. ఆయనపై నిర్మాత మైఖెల్‌రాయప్పన్ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి నష్టపోయిన రూ.20 కోట్లు చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శింబుపై రెడ్ కార్డ్ వేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు సంతానం హీరోగా నటించిన చక్క పోడు పోడు రాజా చిత్రాన్ని నటుడు వీటీవీ, గణేశన్ నిర్మించారు. సేతురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా నటుడు శింబు సంగీత దర్శకుడగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ట్రిబుల్కేన్లోని కలవానర్ ఆవరణలో జరిగింది. ఆ కార్యక్రమంలో నటుడు ధనుష్ ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తానిక్కడికి శింబు ఆహ్వానం మేరకే వచ్చానన్నారు. తామిద్దరి మధ్య స్నేహమే ఉందన, కొందరు అనుకుంటున్నట్లు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న వాళ్లకే సమస్యలు ఉన్నాయని, వాళ్లే తమ మధ్య సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. శింబు ఆయన అభిమానులకోసం ఏడాదికి రెండు చిత్రాలైనా చేయాలని, ఆయన అభిమానుల తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మణిరత్నం నా అభిమానేమో అనంతరం నటుడు శింబు మాట్లాడుతూ తన మిత్రుడు సంతానం కోరిక మేరకే ఈ చిత్రానికి సంగీతాన్ని అందించానన్నారు.అతని ఎదుగుదలకు తానెప్పుడూ పక్కాబలంగా ఉంటానని అన్నారు. ఇటీవల తన గురించి చాలా చర్చ జరిగిందని, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిర్మాత తనపై ఆరోపణలు చేశారని అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్పడం లేదని, అయితే ఆయన చిత్ర షూటింగ్ సమయంలోనో, విడుదలకు ముందో, ఆ తరువాతో ఈ ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉండేదని, చిత్రం విడుదలైన ఆరు నెలలకు ఎవరో చెబితే రచ్చ చేయడం ఏమిటని ప్రశ్నించారు.తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని అన్నారు. ఇకపోతే తానిప్పుడు మణిరత్నం చిత్రంలో నటించనున్నానని, ఆయన కూడా తన అభిమానో ఏమోగానీ, ఆ చిత్రం నుంచి తనను తొలగించలేదని తెలిపారు.ఈ నెల 20 నుంచి చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు మణిరత్నం చెప్పారని శింబు తెలిపారు. -
సంతానం సినిమాకి శింభు సంగీతం
తమిళసినిమా: అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా అని అన్నారు నటుడు సంతానం. కామెడీ నుంచి హీరోగా మారిన ఈయన నటించిన తాజా చిత్రం చక్క పోడు పోడు రాజా. నటి వైభవి హీరోయిన్గా నటించిన ఇందులో వివేక్, వీటీవీ.గణేశ్, రోబోశంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీటీవీ.గణేశ్ నిర్మించిన ఈ చిత్రానికి జీఎల్.సేతురామన్ దర్శకత్వం వహించారు. సంచలన నటుడు శింబు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్నార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్తో ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. బుధవారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న చక్క పోడు పోడు రాజా చిత్ర విలేకరుల సమావేశాన్ని మంగళవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సంతానం మాట్లాడుతూ ఇది 200 శాతం కమర్శియల్ అంశాలతో రూపొందిన చిత్రం అని తెలిపారు. వివేక్, వీటీవీ.గణేశ్, రోబోశంకర్, పవర్‌స్టార్ శ్రీనివాసన్ వంటి ప్రముఖ హాస్యనటులు నటించడంతో వినోదభరితంగానూ ఉంటుందన్నారు. చిత్ర పరిశ్రమ కష్టాల్లో ఉందని అంటున్నారని, నిజానికి అలాంటిదేమి లేదని సంతానం వ్యాఖ్యానించారు. ఇక్కడ శ్రమ ముఖ్యం అన్నారు. అందరూ ఎవరి బాధ్యతలను వారు బాధ్యతాయుతంగా శ్రమించి పనిచేస్తే నష్టం అనేదే రాదన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న ఫైనాన్స్ విషయం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా అని పేర్కొన్నారు. ప్రణాలికతో చిత్రాలను రూపొందిస్తే ఎవరికీ నష్టం వచ్చే అవకాశం ఉండదని, ప్రకృతి సిద్ధమైన ఆటంకాలతో చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగితే రుణ భారం పెరుగుతుందని, అలాంటి సమయాల్లో చేసిన రుణం విషయంలో చర్చించుకోవచ్చు గానీ, ప్రణాళిక లేకుండా చిత్రాలు చేసి ఆలస్యం చేసుకుని రుణభారం పెరిగిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే అవుతుందన్నారు. నటుడు శింబు షూటింగ్‌ల విషయాల గురించి తనకు తెలియదు గానీ, ఈ చిత్రానికి అనుకున్న సమయంలోనే సంగీతాన్ని అందించారని అన్నారు. ఆయనపై ఇటీవల ఒక నిర్మాత చేసిన ఆరోపణల గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు బుధవారం జరగనున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై తనే బదులివ్వనున్నారని సంతానం పేర్కొన్నారు. -
‘సంతానం రియల్ హీరో అయిపోయాడు’
సాక్షి, చెన్నై: ‘హీరో సంతానం రియల్ హీరో అయిపోయాడు’: అని హీరో ఆర్య పేర్కొన్నారు. సంతానం నటిస్తున్న తాజా చిత్రం చక్క పోడు పోడు రాజా టీజర్ ఆవిష్కరణ శనివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో ఆర్య, దర్శకుడు రాజేశ్ అతిథులుగా హాజరై మాట్లాడారు. వీటీవీ.ప్రొడక్షన్స్ పతాకంపై వీటీవీ.గణేశ్ నిర్మించిన ఈ చిత్రానికి జీఎల్.సేతురామన్ దర్శకుడు. సంచలన నటుడు శింబు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా వైభవి శాండిల్య, వివేక్, సంపత్, వీటీవీ, గణేశ్, రోబోశంకర్, పవర్‌స్టార్, డా.సేతు, సంజనాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ.. సంతానం తనకు మంచి ఫ్రెండ్ అని, తనను మంచి మాస్ హీరోగా చూడాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకడినని అన్నారు. సంతానం ఆత్మవిశ్వాసం, శ్రమనే ఈ స్థాయిలో నిలిపాయన్నారు. చెక్క పోడు పోడు రాజా చిత్రం ద్వారా పక్కా మాస్ హీరోగా తెరపై కనిపించనున్నారని అన్నారు. సంతానంకు ఉదయం కూడా ఫోన్ చేసి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందా, నువ్వు వస్తావా? అని అనుమానంగా అడిగానని ఆయన అన్నారు. ఎందుకంటే అతను రాకుండా ఏదేనా గొడవ జరిగి తానెక్కడ దాక్కుంటానోనన్న భయంతోనే అలా అడిగాననీ హాస్యమాడారు. శింబుకు ఇంత అభిమానం ఉందనుకోలేదు హీరో సంతానం మాట్లాడుతూ.. శింబుకు తనంటే అభిమానం అని తెలుసుగానీ, ఇంత అభిమానం ఉందని తెలియదని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి హీరీష జయరాజ్‌ను అడగడానికి వెళ్లామన్నారు. అయితే ఆయన ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో చిత్ర నిర్మాత శింబునే సంగీతం అందించమని ఆడుగుదామన్నారు. అంత పెద్ద హీరో సంగీత దర్శకుడిగా మనకు పని చేస్తారా ? అన్న సందేహిస్తూ అడిగాం. శింబును అడగానే తనకు కొంచెం టైమ్ ఇవ్వండి అని అన్నారన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే తనకు ఫోన్ చేసి మీ చిత్రానికి సంగీత దర్శకుడెవరక్ష తెలుసా? ఎవరో వాట్సాప్‌లో పంపిస్తున్నాను చూడు అని అన్నారు. తాను వాట్సాప్ చూస్తే శింబు అని ఉందన్నారు. కేవలం తనపై అభిమానంతోనే ఆయన తమ చిత్రానికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించారని చెప్పారు. శింబు నెల రోజుల్లోనే ఆరు పాటలకు బాణీలు కట్టిచ్చారని సంతానం తెలిపారు. ఈ సినిమాలో సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా, అనిరుద్, టీ.రాజేందర్ తదితర ఐదుగురు సంగీతదర్శకులు పాడటం విశేషం అన్నారు. చక్క పోడు పోడు రాజా మంచి వినోదంతో కూడిన ఫుల్ మాస్ ఎంటర్టెయినర్గా ఉంటుందని సంతానం తెలిపారు. -
తమిళ దర్శకుడితో తెలుగు నిర్మాత
14 రీల్స్ బ్యానర్లో భాగస్వామిగా ఉన్న అనీల్ సుంకర, తన సొంత నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించి మంచి విజయాలు సాధించారు. ఈ దసరాకు ఈడు గోల్డ్ ఎహే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తొలిసారిగా ఓ తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది కూడా కోలీవుడ్, టాలీవుడ్‌లలో మంచి పేరున్న సెల్వరాఘవన్ దర్వకత్వంలో కావటం మరో విశేషం. ప్రస్తుతం ఎస్ జె సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన నెంజం మరప్పుదిల్లై సినిమా పనుల్లో బిజీగా ఉన్న సెల్వ.. ఆ సినిమా తరువాత ఓ వెరైటీ సినిమాకు రెడీ అవుతున్నాడు. హీరోగా మారిన కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను లోబడ్జెట్‌లో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు సెల్వ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అనీల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. -
చక్కపోడు పోడురాజా అంటున్న సంతానం
సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ప్రధాన పాత్ర పోషింస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చిత్రాల పేర్ల విషయంలో నటుడు సంతానం చాలా జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు.హాస్యనటుడి నుంచి కథానాయకుడిగా ఎదిగిన ఈ సక్సెస్ఫుల్ నటుడు గత చిత్రం దిల్లుకు దుడ్డు కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పుడాయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో సర్వర్‌సుందరం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.తాజాగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థలో ఒక చిత్రం, వీటీవి.ప్రొడక్షన్స సంస్థలో ఒక చిత్రం అంటూ చాలా బిజీగా ఉన్నారు. కాగా వీటీవీ గణేశ్ తన వీటీవీ.ప్రొడక్షన్స పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి చక్కపోడు రాజాపోడు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో సంతానం ఇంతకు ముందు పోషించని సరికొత్త పాత్రలో నటిస్తున్నారట. ధనవంతుడై తండ్రి వ్యాపార వ్యవహారాలను చూసుకునే ఎలాంటి చీకూ చింతా లేని యువకుడిగా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించారు. విశేషం ఏమిటంటే ఇందులో కథలో భాగంగా సాగే హాస్య పాత్రలో నటుడు వివేక్ నటిస్తున్నారు. నవ నటి భైరవి నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వీటీవీ.గణేశ్, పవర్‌స్టార్ శ్రీనివాసన్, రోబోశంకర్ వంటి వారు వినోదభరిత పాత్రల్లో నటిస్తుండగా సంపత్, శరత్లోహిత్దాలు ప్రతి నాయకులుగా నటిస్తున్నారు. జీఎస్.సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చాయాగ్రహణం అభినందన్, ఎడిటింగ్‌ను ఆంథోని, ఫైట్స్‌ను కణల్‌కన్నన్ కంపోజ్ చేస్తున్నారు. -
ఓడిఓడి ఉళక్కనుమ్ అంటున్న సంతానం
కథానాయకుడిగా మారిన హాస్యనటుడు సంతానం కథల విషయంలో ఆచీతూచీ అడుగేస్తున్నారు. చిత్ర టైటిల్ విషయాల్లోనూ చాలా శ్రద్ధ చూపుతున్నారనిపిస్తోంది. ప్రస్తుతం దివంగత హాస్యనటుడు నగేశ్ నటించిన సర్వర్ సుందరం చిత్ర టైటిల్లో నటిస్తున్న సంతానం తాజాగా మక్కల్ తిలకం ఎంజీఆర్ నటించిన చిత్రంలోని ఓడి ఓడి ఉళక్కనమ్ పాటలోని పల్లవిని తన చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించడం విశేషం. కాగా ఇప్పటి వరకూ పోలీ స్‌గా కొన్ని సన్నివేశాల్లోనే నటించిన సంతానం ఈ చిత్రంలో హీరోగా పూర్తిస్థాయి పోలీస్ పాత్రలో నటిం చనున్నట్లు దర్శకుడు కేఎస్.మణికంఠన్ తెలిపారు. ఇంతకు ముందు క న్నా లడ్డు తిన్న ఆశైయా వంటి విజ యవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన తాజా చిత్రం ఇది.కాగా వాసన్ బ్రదర్, శివశ్రీ పిక్చర్స్, వాసన్ విజువల్స్ వేంచర్స్ బ్యానర్లపై గత 60 ఏళ్లుగా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థల్లో ఒకటైన వాసన్ విజువల్స్ వెంచర్స్ ఈ మధ్య కాలంలో బాస్ ఎన్గిర భాస్కరన్, నాన్‌కడవుల్, నిమిర్న్దునిల్ చిత్రాలను నిర్మించింది. తాజాగా బాలాజీ ధరణీధరన్ దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన ఒరు పక్క కథై చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సంతానం హీరోగా నటించనున్న ఓడి ఓడి ఉళక్కనుమ్ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూ జా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు చిత్ర ప్రముఖులు అతిథులుగా హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిత్ర వివరాలను తెలుపుతూ కన్నాలడ్డు తిన్న ఆశైయా చిత్రం తరువాత తాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉం టుందన్నారు. అయితే హాస్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇందు లో సంతానానికి జంటగా నటి అమోరా విజీర్ నటించనున్నారని, ఇతర ముఖ్య పాత్రల్లో రోబోశంకర్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, ఎంఎస్.భాస్కర్, యోగిబాబు నటించనున్నారని తెలిపారు. సంగీతాన్ని జిబ్రాన్, చాయాగ్రహణం గోపీనాథ్ అందిస్తున్నారనని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను నవంబర్ తొలి వారంలో ప్రారంభించి 25 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సంతానంతో సాయిపల్లవి రొమాన్స్?
తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. అన్న జీవిత సత్యాన్ని ఒక పాటలో చెప్పారో మహాకవి. అలాగే చేతి వరకూ వచ్చి నోటి దాకా రాలేదంటారు. నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే కోలీవుడ్‌లో ఎదుర్కొంటున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్ ఘన విజయం అందులో నటించిన కథానాయికలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మలర్ పాత్రలో టీచర్‌గా నటించిన సాయి పల్లవి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో సహజంగానే ఆ చిత్ర హీరోయిన్లు ముగ్గురిపై కోలీవుడ్ దృష్టి పడింది. అయితే సాయిపల్లవి మినహా ఇతర భామలు మంజిమామోహన్, మడోనా సెబాస్టియన్లకు ఇప్పటికే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ఇక సాయి పల్లవికి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించాల్సింది. చివరి క్షణంలో బాలీవుడ్ భామ అతిథిరావు వచ్చి చేరింది. మణిరత్నం చిత్రం మిస్ అవ్వడం సాయిపల్లవికి పెద్ద దెబ్బే. చాలా నిరాశకు గురైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్ టాక్. సంచలన దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంతో రొమాన్స్ చేయడానికి సాయి పల్లవి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెల్వరాఘవన్ తదుపరి సంతానం హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నాయకిగా సాయి పల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ సారి అయినా సాయి పల్లవికి కోలీవుడ్‌కు లైన్ క్లియర్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. సంతానం ప్రస్తుతం వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం కూడా ఆయన తాజా చిత్రానికి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం. -
సంతానంపై పొగడ్తల వర్షం
నటుడు సంతానంను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నటి రెజీనా. సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అలాంటిది సినిమా రంగంలో ప్రతిభను గుర్తిస్తున్నారో లేదోగానీ సక్సెస్‌ను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక్కడ లక్కే ప్రధాన పాత్రను పోషిస్తోందని చెప్పక తప్పదు. ఒక భాషలో నిరాదరణకు గురైన వారు మరో భాషలో ఆదరణను పొందితే వారిని మళ్లీ పిలిచి మరీ అవకాశాలివ్వడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు నటి అనుష్క, ఇలియానా, హన్సిక లాంటి వాళ్లంతా ఆదిలో కోలీవుడ్‌లో నిరాదరణకు గురైన వారే. అనుష్క రెండు అనే చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోశారు. అయినా ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌నే నమ్ముకున్నారు. అక్కడ సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న తరువాత మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది. ఇలా పలు సంఘటనలు ఉన్నాయి. నటి రెజీనా కథా ఇంతే. మొదట్లో తమిళంలో కేడీబిల్లా కిల్లాడిరంగా తదితర కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఆమెను దూరంగా పెట్టేశారు. టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రెజీనా అక్కడ విజయాలను అందుకున్నారు. ఫలితం కోలీవుడ్ ఇప్పుడు వరుసగా అవకాశాలందిస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెజీనా తాను నటించనున్న హీరోలను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధర్వకు జంటగా జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సెల్వరాఘవన్ ఈ భామకు మరో అవకాశం కల్పించినట్లు తాజా సమాచారం. సంతానం హీరోగా తాను చేస్తున్న తదుపరి చిత్రంలోనూ రెజీనానే నాయకి అట. హాస్య పాత్రల్లో నటించి కథానాయకుడైన సంతానంతో నటించనున్నారేమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ చాంతాడంత కారణానే చెప్పేస్తున్నారు. అదేమిటో చూద్దాం. నాకు సంతానం హాస్యనటుడిగానూ, కథానాయకుడిగానూ నచ్చుతారు. అంతగా ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. ముఖ్యంగా హీరోగా అవతారమెత్తిన తరువాత తన బాడీలాంగ్వేజ్‌ను పక్కాగా మార్చుకున్నారు. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ ఇతర హీరోలు ఆశ్చర్యపోయేలా సూపర్‌గా నటిస్తున్నారు. అందుకే ఆయనతో నటించనుండడం సంతోషంగా ఉంది. -
మళ్లీ ఆయనే ఇచ్చారు
సిఫారసులు బాగా పనిచేస్తాయి. అయితే అందుకు నేమ్, ఫేమ్ ఉండాలన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విషయానికి వస్తే సిఫారసుల విషయంలో కథానాయకుల ప్రభావం చాలా ఉంటుంది. అయితే చాలా మంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. ముఖ్యంగా కథానాయికల విషయంలో వారి జోక్యం ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. కోలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఎదిగిన నటుడు సంతానం ఇటీవల హీరోగా మారి వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన దిల్లుకు దుడ్డు చిత్రం కలెక్షన్ల పరంగా ఇరగదీసింది. సంతానం ఆరంభంలో హీరోగా నటించిన వల్లవనుక్కుమ్ పుల్లుమ్ ఆయుధం, ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాల్లో ఆయనకు జంటగా నటి ఆస్నా జవేరి నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. సంతానం.. నటి ఆస్నా జవేరికి సిఫారసులు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అంతే కాదు ఆ చిత్రాల హీరోహీరోయిన్లు సంతానం, ఆస్నా జవేరిలపై వదంతులు వెల్లువెత్తాయి. దీంతో సంతానం తదుపరి చిత్రాల్లో ఆస్నా జవేరి కనిపించలేదు. సంతానం కావాలనే పక్కన పెట్టినట్లు గుసగుసలు వినిపించాయి. అయినా కోలీవుడ్‌ను వదిలి వెళ్లని ఉత్తరాది భామ ఆస్నా జవేరి ఇక్కడే మకాం వేసి అవకాశాల వేటలో పడ్డారు. అలా ఒక చిత్రం అవకాశాన్ని సంపాదించుకున్నారు కూడా. ప్రస్తుతం తను మీన్కుళంబుమ్ మనపాలైయం అనే చిత్రంలో కాళిదాస్ జయరాం సరసన నటిస్తున్నారు. అయితే కొత్త అవకాశాలేమీ రాకపోవడంతో మళ్లీ సంతానంను ఆశ్రయించి సిఫారసు చేయమని అడిగారట. ప్రస్తుతం విజయాల జోరులో ఉన్న సంతానం త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా కొన్ని కథలు వింటున్నారు. ఒక నూతన దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అంతే కాదు అందులో ఆయనకు జంటగా ఆస్నా జవేరిని సిఫారసు చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద మూడో సారి సంతానంతో జతకట్టడానికి ఆస్నాజవేరి రెడీ అవుతున్నారన్న మాట. -
మణికంఠన్ దర్శకత్వంలో సంతానం
దిల్లుక్కుదుడ్డు చిత్రంతో వసూళ్ల వర్షం కు రిపించిన నటుడు సంతానంకు ప్రస్తుతం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయనతో చిత్రాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రాల ఎంపికలో తొందరపడని సంతానం తాజాగా కన్నాలడ్డు తిన్న ఆశై యా చిత్ర దర్శకుడు మణికంఠన్‌కు మరో అవకాశం ఇచ్చారు. వీరి కాంబినేషన్లో వాసస్ విజువల్స్ వేంచర్స్ అధినేతలు కేఎస్.శీనివాసన్, కేఎస్.శివరామన్ ఒక వి నోదభరిత కథా చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు.ఇంతకు ముందు బాస్ ఎన్గి ర భాస్కరన్, నాన్‌కడవుల్, నిమిర్నుదు నిల్ వంటి విజయవంతమైన చి త్రాలను నిర్మిం చిన ఈ నిర్మాతలు నూతన చిత్ర వివరాలను తెలుపుతూ సంతానం, మణికఠన్ల కాంబి నేషన్‌లో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన పూర్తి వినోదభరిత ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటిం చే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.అక్టోబర్ నుం చి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాసన్ బ్రదర్స్, శివశ్రీ పిక్చర్స్, వాసన్ విజు వల్స్ వెంచర్స్ అనుబంధ సంస్థలు గత 60 ఏళ్లుగా చిత్రాలను నిర్మిస్తున్నాయి. ఈ సంస్థలు 55కు పైగా ఉత్తమ చిత్రాలను అందించాయన్నది గమనార్హం. ప్రస్తుతం బాలాజీ ధరణీ ధరన్ దర్శకత్వంలో కాళీ దాస్ జయరామ్ హీరోగా ఒరుపక్క కథై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సంతానం కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న మాట. -
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం కథానాయకుడిగా నటించనున్నారన్నది తాజా న్యూస్. ఇది నిజంగా సంచలన కాంబినేషన్ చిత్రం కానుందని భావించవచ్చు. హాస్యానికి మారుపేరుగా మారిన నటుడు సంతానం. ప్రపంచంలో వినోదాన్ని కోరుకోని వారు, ఆస్వాదించని వారు ఉండరు. ఇక నవ్వు అన్నది దైవానుగ్రహం అంటారు. అలాంటి నవ్వులను పూయించి, ప్రేక్షకులను ఆహ్లాదపరచే నటులు కొంత మందే ఉంటారు. అలాంటి వారి పట్టికలో నటుడు సంతానం పేరు తప్పకుండా చోటు చేసుకుంటుంది. సంతానం రైమింగ్ సెన్స్, కౌంటర్ కామెడీ ప్రత్యేకం. తనదైన బాణీలో వినోదాన్ని అందిస్తూ హాస్యనటుడిగా ఎదిగిన సంతానం ఇటీవల కథానాయకుడిగా మారి వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల విడుదలైన దిల్లుక్కుదుడ్డు చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది. దర్శకుడు సెల్వరాఘవన్ బాణి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన చిత్రాల్లో వినోదం ఉన్నా, భావోద్రేకాలు అధికంగా ఉంటాయి.అలాగనీ హాస్యం ఆయన బాణీ కాదని చెప్పలేం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలా చాలా మంచి వినోదం ఉంటుంది. ఏదేమైనా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం హీరోగా నటించనున్నారన్న వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా సంతానం సర్వర్ సుందరం చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఏ తరహాలో ఉంటుందో ఇప్పుడే ఊహించడం కష్టం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. -
గోవాలో సర్వర్‌సుందరం చిత్రీకరణ
దివంగత ప్రఖ్యాత హాస్యనటుడు నగేష్ నటించిన క్లాసిక్ మూవీ సర్వర్‌సందరం. అదే పేరుతో ఇప్పుడు ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగి కథానాయకుడిగా అవతారమెత్తిన సంతానం చిత్రం చేస్తున్నారు.ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం సోమవారం నుంచి గోవాలో చిత్రీకరణ జరుపుకోనుంది. కెనన్యా ఫిలింస్ పతాకంపై జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయిన నగేష్ చిత్రం సర్వర్‌సందరం పేరుకు భంగం కలిగించకుండా ఉండాలంటే సంతానం నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ముందడుగు వేస్తోందనిపిస్తోంది. సంతానం నుంచి దర్శకుడు, చిత్ర యూనిట్ అంతా తాజా సర్వర్‌సుందరం విషయంలో ప్రత్యేక దృష్టి చూపుతోందట. చిత్రాన్ని గోవాలో మొదలెట్టి దుబాయ్, చెన్నై, తంజావూర్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి సుందరమైన ప్రదేశాల్లో సర్వర్‌సుందరం చిత్ర షూటింగ్‌ను జూన్ వరకూ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. సంతానం తను ధరించే దుస్తుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందుకోసం దేశంలోని 15 మంది ప్రముఖ సర్వర్లను రప్పించి వారిని కన్సల్టెంట్లుగా నియమించుకుని దుస్తులు తదితర విషయాల్లో వారి సూచనలు, సలహాలతో చిత్రీకరణ జరపనున్నారట. చిత్ర దర్శకుడు ఆనంద్ బాల్కీ కూడా పూర్వం సర్వర్ కావడంతో ఈ సర్వర్‌సుందరం చిత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సంసిద్ధమయ్యారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీత బాణీలు కడుతున్నారన్నది గమనార్హం. -
సంతానంకు జంటగా వైభవి శాండిల్య
హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి ఎదిగిన నటుడు సంతానం. ఇప్పటి తన స్థాయిని నిలబెట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఈయన చిత్రాల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సంతానం దిల్లుక్కు దుడ్డు, సర్వర్ సుందరం చిత్రాల్లో నటిస్తున్నారు. దిల్లుక్కుదుడ్డు చిత్రంలో తన ఆస్థాన హీరోయిన్గా ప్రచారంలో ఉన్న ఆస్నా జవేరి నటిస్తుండగా, సర్వర్‌సందరం చిత్రంలో మరాఠి బ్యూటీ వైభవి శాండిల్యను హీరోయిన్గా ఎంపిక చేశారు. కెనన్యా ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి శాండిల్యను ఎంపిక చేయడం గురించి చిత్రం యూనిట్ పేర్కొంటూ మహారాష్ట్ర కోలీవుడ్‌కు చాలా మంది ప్రతిభావంతుల్ని అందించిందన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి తాజాగా పరిచయం అవుతున్న వైభవి శాండిల్య కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. మూడు నెలల అన్వేషణ ఫలం వైభవి శాండిల్య అని అన్నారు. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు మంచే జరిగిందన్నారు. వైభవి సౌందర్యవతి మాత్రమే కాకుండా మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని తెలిపారు. అంతేకాదు భరతనాట్యం, కథాకళి నృత్యాల్లో నైపుణ్యం పొందిన నటి అని చెప్పారు.అలాంటి నటిని సర్వర్ సుందరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామన్నారు. వైభవి శాండిల్యకు ఇక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. -
సినీనటుల రాకతో తిరుమలలో సందడి
-
‘చిరునవ్వుల చిరుజల్లు’ స్టిల్స్
-
ఆర్య ప్రతీకారం
అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ స్నేహంతోపాటు పగలు, ప్రతీకారాలు వంటివి కలగడం సహజం. అలా నటుడు ఆర్య హాస్య నటుడు సంతానం మధ్య మంచి మైత్రి ఉంది. వీరిద్దరూ కలసి పలు చిత్రాల్లో స్నేహితులుగా నటించారు. అలాంటిది ఇటీవల సంతానం నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు ఆర్య. ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారట. ఈ విషయాన్ని సంతానం చిత్ర యూనిట్ సాక్షిగా చెప్పడం విశేషం. మొన్నటి వరకు మంచి మిత్రులుగా వున్న వీరి మధ్య అంత శత్రుత్వం ఎలా కలిగిందంటే.... సంతానం ప్రస్తుతం ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఆష్కా జవేరి నటిస్తున్నారు. ఈ చిత్రం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వాసువుం శరవణనుం ఒన్నా పడిచ్చవాంగా చిత్రంలో ఆర్య, సంతానం మరోసారి స్నేహితులుగా నటిస్తున్నారు. ఈ సంగతి అటు ఉంచితే సంతానం చిత్రం షూటింగ్ సమయంలోనే ఆర్య నటిస్తున్న యట్చకన్ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో షూటింగ్ గ్యాప్‌లో ఆర్య, సంతానం షూటింగ్‌కు వచ్చి వెళ్లారు. పాటకు డాన్స్ మూవెంట్ను రిహార్సిల్ చేసే మూడ్‌లో వున్న సంతానం ఆర్య రాకను గమనించలేదు. సంతానం షాట్‌కు రెడీ అవడంతో ఆర్య నృత్య దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టి షాట్ కెమెరా, యాక్షన్ అన్నారు. దీంతో సంతానం, నటి ఆష్కా ఆడటం మొదలెట్టారు. అయితే వన్స్‌మోర్ ఇంకా బాగా ఆడాలంటూ ఆర్య పలుమార్లు సంతానంతో డాన్స్ చేయించడంతో అలసిపోయి ఇక నా వల్ల కాదు బాబు అంటూ ఆర్యను చూసి ‘‘నేను సినిమాలో పగ తీర్చుకుంటే మీరిప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారని అర్థం అయ్యింది మీకో నమస్కారం’’ అనడంతో యూనిట్ సభ్యులందరూ సరదాగా నవ్వుకున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. -
సంతానంకు జోడిగా భాను
తామరభర్ణి చిత్రంలో విశాల్‌కు జంటగా పరిచయమైన మలయాళీ కుట్టి భాను. ఆ చిత్రం హిట్ అయినా, ఈ అమ్మడుకు కష్టాలు వెంటాడుతూ వస్తున్నాయి. ఇందుకు కుటుంబ సమస్య కూడా కారణం. ఆ మధ్య వసంత్ దర్శకత్వంలో మూన్డ్రు పేరు మూన్డ్రు కాదల్‌లో ముగ్గురు నాయకిల్లో ఒకరుగా నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు రాజేష్ మరో అవకాశం కల్పించారు. తాను దర్శకత్వం వహిస్తున్న వాసువుం...శరవణను ఎన్న పడి చవ్వంగ చిత్రంలో ఆర్య, తమన్న నాయకా నాయకీలుగా నటిస్తున్నారు. ఇందులో హాస్య పాత్రలో సంతానం నటిస్తుండగా, అతడికి జంటగా భాను ఎంపిక అయ్యారు. ఇది ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న ఇతివృత్తాంతంతో నిర్మిస్తున్న చిత్రం. ఇది పూర్తిగా వినోద భరిత చిత్రం. ఇందులో భాను పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. సంతానంతో డ్యూయెట్స్ కూడా పాడుతుందట.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో తమన్న, ఆర్యలపై పాట చిత్రీకరణ సాగుతోంది. తదుపరి సంతానం భానుల యుగళ గీతం చిత్రీకరించనున్నట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సూర్యకు షాక్ ఇచ్చిన సంతానం
-
ఇక్కడ బ్రహ్మానందం...అక్కడ సంతానం
-
చిరునవ్వుల చిరుజల్లు మూవీ ఆడియో ఆవిష్కరణ
-
మే 9న వల్లవునుక్కు పుల్లుం ఆయుధం
వల్లవునుక్కు పుల్లుం ఆయు ధం చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 9న విడుదల కానుంది. ప్రముఖ హాస్యనటుడు సం తానం తొలిసారి సోలో హీరో గా నటిస్తున్నా రు. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న చిత్రానికి రేమేక్ ఇది. ఈ చిత్రానికి శ్రీనాథ్ దర్శకుడు. ముంబయి మోడల్ అష్నా జువేరి హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో నాగినీడు, మిర్చి సెంథిల్, వీటీవీ గణేష్, రాజ్కుమరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.సిద్ధార్థ్ లిపిన్ సంగీత స్వరాలు అంది స్తున్నారు. ఈ చిత్రం గురించి పీవీపీ నిర్వాహకులు తెలుపుతూ వల్లవునుక్కు పుల్లుం ఆయుధం చిత్రం రొమాంటిక్ ఫ్యామి లీ ఎంటర్టైనరని పేర్కొన్నారు. సంతానం ఇందులో వాటర్ క్యాన్లు సరఫరా చేసే యువకుడిగా నటిస్తున్నారని తెలి పారు. దురదృష్టం ముందు పుట్టి ఆ తర్వాత తను పుట్టాడన్నట్టుండే సంతానం ఉన్న పని ఊడడంతో సొంత ఊరులో తల్లిదండ్రులు సొత్తు ఉందని తెలిసి దాన్ని అమ్మి మంచి వ్యాపారం చేసుకుందామనే ఆశతో ఆ గ్రామానికి వెళతాడన్నారు. అక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో చిక్కుకుని ఎలాంటి పాట్లు పడ్డాడు? చివరికి ఎలా బయటపడ్డాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాల సమాహారంగా వల్లవునుక్కు పుల్లుం ఆయుధం చిత్రం ఉంటుందన్నారు. దీనికి ఒక ప్రము ఖ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలిపారు. చిత్రంలో పలు హైలెట్స్ ఉన్నా సంతానం ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. చిత్ర ఆడియోను ఈ నెల 14న, చిత్రం విడుదలను మే 9న చేయనున్నట్లు తెలిపారు. -
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. -
రంగం మొదలైంది మూవీ న్యూ స్టిల్స్
-
రాజా రాణి మూవీ స్టిల్స్