ఓడిఓడి ఉళక్కనుమ్ అంటున్న సంతానం | Santhanam as police officer in his new movie | Sakshi
Sakshi News home page

ఓడిఓడి ఉళక్కనుమ్ అంటున్న సంతానం

Oct 29 2016 1:39 AM | Updated on Aug 21 2018 6:22 PM

ఓడిఓడి ఉళక్కనుమ్ అంటున్న సంతానం - Sakshi

ఓడిఓడి ఉళక్కనుమ్ అంటున్న సంతానం

కథానాయకుడిగా మారిన హాస్యనటుడు సంతానం కథల విషయంలో ఆచీతూచీ అడుగేస్తున్నారు.

కథానాయకుడిగా మారిన హాస్యనటుడు సంతానం కథల విషయంలో ఆచీతూచీ అడుగేస్తున్నారు. చిత్ర టైటిల్ విషయాల్లోనూ చాలా శ్రద్ధ చూపుతున్నారనిపిస్తోంది. ప్రస్తుతం దివంగత హాస్యనటుడు నగేశ్ నటించిన సర్వర్ సుందరం చిత్ర టైటిల్‌లో నటిస్తున్న సంతానం తాజాగా మక్కల్ తిలకం ఎంజీఆర్ నటించిన చిత్రంలోని ఓడి ఓడి ఉళక్కనమ్ పాటలోని పల్లవిని తన చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించడం విశేషం. కాగా ఇప్పటి వరకూ పోలీ స్‌గా కొన్ని సన్నివేశాల్లోనే నటించిన సంతానం ఈ చిత్రంలో హీరోగా పూర్తిస్థాయి పోలీస్ పాత్రలో నటిం చనున్నట్లు దర్శకుడు కేఎస్.మణికంఠన్ తెలిపారు.

ఇంతకు ముందు క న్నా లడ్డు తిన్న ఆశైయా వంటి విజ యవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన తాజా చిత్రం ఇది.కాగా వాసన్ బ్రదర్, శివశ్రీ పిక్చర్స్, వాసన్ విజువల్స్ వేంచర్స్ బ్యానర్లపై గత 60 ఏళ్లుగా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థల్లో ఒకటైన వాసన్ విజువల్స్ వెంచర్స్  ఈ మధ్య కాలంలో బాస్ ఎన్గిర భాస్కరన్, నాన్‌కడవుల్, నిమిర్న్దునిల్ చిత్రాలను నిర్మించింది. తాజాగా బాలాజీ ధరణీధరన్ దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన ఒరు పక్క కథై చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సంతానం హీరోగా నటించనున్న ఓడి ఓడి ఉళక్కనుమ్ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూ జా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు చిత్ర ప్రముఖులు అతిథులుగా హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిత్ర వివరాలను తెలుపుతూ కన్నాలడ్డు తిన్న ఆశైయా చిత్రం తరువాత తాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉం టుందన్నారు. అయితే హాస్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇందు లో సంతానానికి జంటగా నటి అమోరా విజీర్ నటించనున్నారని, ఇతర ముఖ్య పాత్రల్లో రోబోశంకర్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, ఎంఎస్.భాస్కర్, యోగిబాబు నటించనున్నారని తెలిపారు. సంగీతాన్ని జిబ్రాన్, చాయాగ్రహణం గోపీనాథ్ అందిస్తున్నారనని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను నవంబర్ తొలి వారంలో ప్రారంభించి 25 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement