![Megha Akash Comments in Vadakkupatti Ramasamy Audio Launch - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/28/megha-akash1.jpg.webp?itok=9mLZ13jE)
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తమిళంలో నిర్మించిన చిత్రం వడక్కుపట్టి రామసామి. కమెడియన్ సంతానం కథానాయకుడిగా నటించిన ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించారు. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
అతడితో నటించాలనుందన్న అల్లు శిరీష్
ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు శిరీష్ మాట్లాడుతూ.. హాస్య పాత్రలు పోషిస్తున్నప్పటి నుంచి నటుడు సంతానంను గమనిస్తున్నానని, ఇప్పుడు ఆయన సక్సెస్‌ఫుల్ కథానాయకుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. సంతానం హాస్యం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఇంటర్వ్యూలు కూడా ఆసక్తిగా చూస్తుంటానని చెప్పారు. సంతానంతో కలిసి నటించాలనుందన్నారు.
65 రోజుల్లో షూటింగ్ పూర్తి
సంతానం మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ తనతో రెండు చిత్రాలు చేస్తున్నారని, అందులో మొదటిగా విడుదలవుతున్న చిత్రం ఈ వడక్కుపట్టి రామసామి అని చెప్పారు. 65 రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా భారీస్థాయిలో నిర్మించారని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటికంటే ఇది భారీ బడ్జెట్ చిత్రమన్నారు.
అర్థం చేసుకున్నారు
మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ ప్రసాద్‌కు, క్రియేటివ్ నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. షూటింగ్ సమయంలో తన బామ్మ మరణించడంతో చాలా బాధపడ్డానని, దాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని చెప్పారు. మంచి బలమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు కార్తీక్ యోగికి ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: క్యాన్సర్‌తో చనిపోయిన ప్రముఖ హీరోయిన్.. ప్రముఖుల నివాళి
Comments
Please login to add a commentAdd a comment