Actor Santhanam Said He Join The Party If Given A Rajya Sabha Seat - Sakshi
Sakshi News home page

రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో చేరతా! 

Published Wed, Feb 10 2021 7:22 AM | Last Updated on Wed, Feb 10 2021 8:56 AM

Santhanam Says Rajya Seat For Joining Of Political Party In Tamil Nadu - Sakshi

చెన్నై: రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో చేరతానని సంతానం అన్నారు. నటుడు సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ప్యారిస్‌ జయరాజ్‌. ఈ చిత్రం ద్వారా కె.జాన్సన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో సంతానంకు జంటగా నటి అనైకా సోటి, సస్టిక రాజేంద్రన్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది.  మంగళవారం చిత్ర యూనిట్‌ సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది.  మీరు ఏ పార్టీలో చేరతారని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏ పార్టీ రాజ్యసభ సీటు ఇస్తే ఆ పార్టీలో చేరతానని సరదాగా పేర్కొన్నారు. రాజకీయాల్లో చేరే ఆలోచన లేదని, నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచడానికే ఇష్టపడతానని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement