Beast Movie: Vijay Fans And Theatres Offered Free Of Cost Petrol, Details Inside - Sakshi
Sakshi News home page

Beast Movie-Vijay Fans: ఆ టికెట్లు ఉంటే ఒక లీటర్‌ పెట్రోల్‌ ఉచితం!

Published Wed, Apr 13 2022 1:14 PM | Last Updated on Wed, Apr 13 2022 2:33 PM

Beast Movie: Vijay Fans And Theatres Offered Free Of Cost Petrol To Audience - Sakshi

Chennai Theatres Offered Free Of Cost Petrol To FDFS Tickets: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ బీస్ట్‌ మూవీ బుధవారం(ఏప్రిల్‌ 13) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ రోజు విడుదల అనగా చెన్నై వారం నుంచి బీస్ట్‌ మూవీ సందడి మొదలైంది. ప్రతి థియేటర్‌ ముందు విజయ్‌ ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా లేదు. ఈ రోజు ఉదయం నుంచే థియేటర్ల వర్ద విజయ్‌ ఫ్యాన్స్‌ భారీ భారీ కటౌట్స్‌ ఏర్పాటు చేసి పాల అభిషేఖాలు, బాణా సంచాలు పెలుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

చదవండి: బీస్ట్‌ బాగోలేదట, థియేటర్‌కు నిప్పంటించిన ఫ్యాన్స్‌!

ఈ నేపథ్యంలో బీస్ట్‌ మూవీ చూసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాయి. ఫస్ట్‌షో చూసిన వారికి విరుద్‌ నగర్‌లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్‌ థియేటర్లు ఒక లీటరు పెట్రోల్‌ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే దీనికి వారు ఓ కండిషన్‌ కూడా పెట్టారు. ఎఫ్‌డీఎఫ్‌ఎస్‌(ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో) కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా ఈ థియేటర్లో ఫస్ట్‌ షోను ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు.

చదవండి: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ పెళ్లి సందడి షురూ! విశేషాలెన్నో!

ఇక్కడ ఒక ఎఫ్‌డీఎఫ్‌ఎస్‌ టికెట్‌ ధర రూ. 500 ఉండగా మిగతా థియటర్లో రూ. 400 నుంచి రూ. 300లుగా ఉంది. మరోవైపు చెన్నైలోని పలు చోట్లు విజయ్‌ ఫ్యాన్స్‌ సైతం ప్రేక్షకులకు లీటర్‌ ప్రెట్రోల్‌ను ఉచితంగా ఇస్తున్నారు. మక్కళ్‌ ఇయ్యక్కం తరపున అభిమానులంతా భీస్ట్‌ సినిమా చూసిన ప్రేక్షకులు లీటర్‌ ప్రెట్రోల్‌ను ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే బీస్ట్‌ మూవీ చూసేందుకు ఒన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా నెల్సన్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సరసన పూజ హెగ్డే సందడి చేసింది. ఈ మూవీలోని అరబిక్‌ కుత్తు పాట ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement