Free petrol
-
ఇక్కడ పెట్రోల్ ఫ్రీ
-
బంపర్ ఆఫర్, బీస్ట్ మూవీ చూసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితం!
Chennai Theatres Offered Free Of Cost Petrol To FDFS Tickets: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బీస్ట్ మూవీ బుధవారం(ఏప్రిల్ 13) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ రోజు విడుదల అనగా చెన్నై వారం నుంచి బీస్ట్ మూవీ సందడి మొదలైంది. ప్రతి థియేటర్ ముందు విజయ్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఈ రోజు ఉదయం నుంచే థియేటర్ల వర్ద విజయ్ ఫ్యాన్స్ భారీ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాల అభిషేఖాలు, బాణా సంచాలు పెలుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. చదవండి: బీస్ట్ బాగోలేదట, థియేటర్‌కు నిప్పంటించిన ఫ్యాన్స్! ఈ నేపథ్యంలో బీస్ట్ మూవీ చూసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఫస్ట్‌షో చూసిన వారికి విరుద్ నగర్‌లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్ థియేటర్లు ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే దీనికి వారు ఓ కండిషన్ కూడా పెట్టారు. ఎఫ్డీఎఫ్ఎస్(ఫస్ట్ డే ఫస్ట్ షో) కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా ఈ థియేటర్లో ఫస్ట్ షోను ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. చదవండి: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పెళ్లి సందడి షురూ! విశేషాలెన్నో! ఇక్కడ ఒక ఎఫ్డీఎఫ్ఎస్ టికెట్ ధర రూ. 500 ఉండగా మిగతా థియటర్లో రూ. 400 నుంచి రూ. 300లుగా ఉంది. మరోవైపు చెన్నైలోని పలు చోట్లు విజయ్ ఫ్యాన్స్ సైతం ప్రేక్షకులకు లీటర్ ప్రెట్రోల్ను ఉచితంగా ఇస్తున్నారు. మక్కళ్ ఇయ్యక్కం తరపున అభిమానులంతా భీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులు లీటర్ ప్రెట్రోల్ను ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే బీస్ట్ మూవీ చూసేందుకు ఒన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా నెల్సన్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే సందడి చేసింది. ఈ మూవీలోని అరబిక్ కుత్తు పాట ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. -
ఆ పెట్రోల్ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!!
పెట్రోల్, డీజిల్ ఈ రోజుల్లో చాలా ఖరీదైనవి. ప్రతిఒక్కరూ.. ఆచి తూచి జాగ్రత్తగా వాడుతున్నారు. మరి ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే మీరేం చేస్తారు? వెంటనే రెక్కలు కట్టుకునిమరీ అక్కడ వాలిపోతారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెట్రోల్ బంక్ ఓనర్ ఏకంగా మూడు రోజులపాటు వచ్చిన కస్టమర్లందరికీ ఫ్రీ పెట్రోల్ ఇచ్చాడు. తమ ఇంట ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! బేతుల్ జిల్లాకి చెందిన దీపక్ సైనాని అనే వ్యక్తి, తన చెల్లెలికి అక్టోబర్ 9న ఆడపిల్ల పుట్టింది. మేనకోడలు పుట్టిన సంబరంలో దీపక్ సైనాని పెట్రోల్ బంకుకు వచ్చిన కష్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు. దసరా నవరాత్రుల వేళ అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్ కొన్నవారికి 10 శాతం పెట్రోల్ ఫ్రీగా అందించానని స్థానిక మీడియాలు వెల్లడించాడు. కాగా గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానుంటుతున్న విషయం తెలిసిందే! ఇటువంటి సమయంలో మూడురోజుల పాటు వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందించడంతో దీపక్ సైనాని వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా ఆడపిల్ల పుడితే వెంటనే ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించే ఈ రోజుల్లో, ఇంత విలువైన బహుమతి మేకోడలికి అందించిన అతని ఉన్నతమనసును చాటిచెబుతోంది. చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..? -
పెట్రోల్ ధరలతో అల్లాడుతున్నారా? ఈ ఆఫర్ మీకోసమే!
చెన్నె: పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.110కి లీటర్ పెట్రోల్ చేరువయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.115 నుంచి 118 వరకు చేరుకుంది. ధరలు ఇలా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించేస్తున్నారు. అత్యవసరం.. ముఖ్యమైన పనులకే వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే ఓ కంపెనీ బంపర్ ఆఫర్ అందించింది. లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఎందుకు? ఏమిటి? ఎక్కడో తెలుసుకోండి! చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉతిరామేరూర్‌లో శ్రీరామ్ వాహన ఫైనాన్స్ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రజలందరూ తమ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ సమర్పిస్తే చాలు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఎగబడ్డారు. కంపెనీ కార్యాలయానికి ఆధార్, పాన్ కార్డు పత్రాలతో బారులుతీరారు. అయితే పత్రాలు ఇచ్చిన వారందరికీ ఆ కంపెనీ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తమ కంపెనీలోనే వాహనాల ఫైనాన్స్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై పన్నును రూ.3 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చేందుకు ఎగబడ్డ ప్రజలు (ఫొటో: IndiaToday) -
Petrol Free: ఈ పేరుంటే చాలు మీకు పెట్రోల్ ఫ్రీ.. ఫ్రీ
అహ్మదాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి స్వదేశానికి చేరుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనకు భారీగా కానుకలు, ప్రోత్సహాకాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ పెట్రోల్ బంక్ యజమాని నీరజ్ చోప్రాకు గౌరవం ఇస్తూ ప్రజలకు ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నారు. అయితే ఒక షరతుపై పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించడంతో గుజరాత్‌లోని బరూచ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ యజమాని ఆయూబ్ పఠాన్ ఆనందంలో మునిగిపోయాడు. దీంతో నీరజ్ చోప్రా పేరు ఉన్నవారికి రూ.501 విలువైన పెట్రోల్ ఉచితంగా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ఆ పేరు ఉన్న వ్యక్తులు వచ్చి తమ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి పెట్రోల్ వేసుకువెళ్లవచ్చని తెలిపాడు. దీంతో ఆ రాష్ట్రంలో నీరజ్ పేరు ఉన్నవారందరూ పెట్రోల్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే ఇది రెండు రోజులు మాత్రమేనని ఆయూబ్ తెలిపారు. ఈ రెండు రోజుల కార్యక్రమం నీరజ్‌చోప్రాకు గౌరవంగా ఇస్తున్నాం. నిజమైన నీరజ్ పేరు ఉన్నవారికే పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయూబ్ పఠాన్ స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలో సోమవారం నీరజ్ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. నీరజ్ చోప్రాకు జ్ఞాపికలు అందించి అతడి ప్రతిభపై ప్రశంసలు కురిపించింది. అయితే ఈ ఉచిత పెట్రోల్ ఆఫర్ సోమవారంతో ముగిసింది. -
త్వరపడండి: పద్యాలు చెప్తే లీటర్ పెట్రోల్ ఉచితం!
సాక్షి, చెన్నై: "సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు, పద్యం లేని సాహిత్యం" ఉండదని చెప్తుంటారు. కానీ ఇప్పుడు పద్యం, సామెతలను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఇంగ్లీషు గలగలా మాట్లాడే పిల్లలు పద్యాలు చదవమంటే నోరు తిరగడం లేదు, మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేస్తున్నారు. నిరంతరం ఫోనులోనే ముఖం పెడుతూ దానికి బానిసలవుతున్నారు. ఈ వైఖరి భాషాభిమానులను, సాహిత్యారాధికుల మనసును కలిచి వేస్తోంది. దీంతో తమిళనాడుకు చెందిన కె సెంగుత్తువన్ ఓ అద్భుత ఉపాయం ఆలోచించాడు. అది కానీ అమల్లో పెడితే చచ్చినట్లు పద్యం నేర్చుకుని అప్పజెప్తారని భావించాడు. వెంటనే తన పెట్రోల్ బంకులో 'పద్యం చెప్పి పెట్రోల్ పట్టుకెళ్లు' అనే ఆఫర్‌ను ప్రకటించాడు. తిరుక్కురల్‌లోని 20 ద్విపద పద్యాలు చెప్తే ఒక లీటర్, 10 పద్యాలు చెప్తే అర లీటర్ పెట్రోల్ ఉచితమని వెల్లడించాడు. అసలే పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా పెట్రోల్ ఇస్తామంటే ఊరుకుంటారా! పిల్లలను కూర్చోబెట్టి మరీ పద్యాలు నేర్పించి నేరుగా కరూర్ జిల్లాలోని పెట్రోల్ పంపుకు తీసుకువెళ్తున్నారు. జనవరి 16న ప్రకటించిన ఈ ఆఫర్ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు 176 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఫ్రీ పెట్రోల్ ఆఫర్ గురించి సెంగుత్తువన్ మాట్లాడుతూ.. "లాక్డౌన్ వల్ల పిల్లలు ఫోన్లకు మరింత అతుక్కుపోయారు. వారు ప్రముఖ తిరుక్కురళ్ పద్యాలు నేర్చుకోవాలన్న కాంక్షతోనే ఈ ఆఫర్‌కు శ్రీకారం చుట్టాను. ఒకరికి ఒకసారి మాత్రమే ఫ్రీ పెట్రోల్ లాంటి ఆంక్షలేమీ లేవు. కాకపోతే రెండోసారి ఈ ఆఫర్ అందుకోవాలంటే మళ్లీ కొత్త పద్యాలు అప్పజెప్పాల్సిందే. తల్లిదండ్రుల భారాన్ని కొంతైనా తీర్చాలంటే పిల్లలు పద్యాలు కంఠస్తం చేయక తప్పదు మరి" అని చెప్తున్నాడు. చదవండి: వైరల్: ఇదేం చేప.. చంపినా బతికేస్తోంది! వెలుగులోకి వేల ఏళ్ల నాటి బీర్ ఫ్యాక్టరీ పేట్రేగుతున్న పెట్రోల్ దొంగలు -
బంపర్ ఆఫర్ : 5 లీటర్ల పెట్రోలు ఉచితం
సాక్షి,ముంబై: ఉచిత పెట్రోలు ఆఫర్‌ను మరి కొన్ని రోజులు పొడిగించింది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). వినియోగదారులకు 5లీటర్ల దాకా ఉచిత పెట్రోల్ ఆఫర్ చేస్తున్న ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. అయితే డిసెంబరు 15వరకు పొడిగించినట్టు ఎస్బీఐ ట్విటర్లో ప్రకటించింది. ఎస్బీఐ కార్డు లేదా, భీమ్ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్లెట్ల పెట్రోలు కొంటే 5 లీటర్ల వరకూ పెట్రోలు పూర్తిగా ఉచితంగా పొందండి. 2018 డిసెంబర్ 15 వరకు ఈ ఆఫర్ అంటూ ట్విటర్ ప్రకటనలో తెలిపింది. ఆఫర్ పొందాలంటే ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి. 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపంవచ్చు. అయితే ప్రతీ ఎస్ఎంఎస్కు డిఫరెంట్ కోడ్ ఉండాలి. ఆఫర్ పొందేందుకు అనుసరించాల్సిన విధానం ► ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ల నుండి రూ. 100 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అదీ భీమ్, ఎస్‌బీఐకార్డు ద్వారా చెల్లింపులకు మాత్రమే. ► 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు సెండ్ చేయాలి. ► భీమ్ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్ , ఎస్బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో 6అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇలా అందిన ఎస్ఎంఎస్లలో ఎంపికచేసిన దానికి 50, 100, 150, 200 రూపాయలు స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్ పొందే అవకాశం. ఆఫర్ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు. Fuel up with BHIM SBI Pay at any Indian Oil Retail outlet and get up to 5 litres of petrol absolutely free! Offer extended until 15th Dec 2018. For more details, visit: https://t.co/SItjGjVIxN Download now: https://t.co/1ho06MbWn9#IndianOil #NPCI #Offer #Deal #Fuel #Petrol pic.twitter.com/yBixwxYLZH — State Bank of India (@TheOfficialSBI) December 4, 2018 -
నెలకు 5 లీటర్ల పెట్రోల్ ఉచితం
పనాజి: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీలుపడి వరాలు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫ్రీ మంత్రం జపిస్తున్నాయి. గోవాలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు నెలకు 5 లీటర్ల చొప్పున పెట్రోల్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సోమవారం గోవా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలకు ఉచితంగా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. గోవాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ జనాకర్షక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ప్రెషర్ కుకర్లను ఇస్తామని చెప్పారు.