![A Finance Company Offer Litre Petrol Free In Kanchipuram TN - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/11/Petrol-Free-Kanchipuram-1.jpg.webp?itok=zfd9UGcG)
చెన్నె: పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.110కి లీటర్ పెట్రోల్ చేరువయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.115 నుంచి 118 వరకు చేరుకుంది. ధరలు ఇలా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించేస్తున్నారు. అత్యవసరం.. ముఖ్యమైన పనులకే వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే ఓ కంపెనీ బంపర్ ఆఫర్ అందించింది. లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఎందుకు? ఏమిటి? ఎక్కడో తెలుసుకోండి!
చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ
తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉతిరామేరూర్‌లో శ్రీరామ్ వాహన ఫైనాన్స్ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రజలందరూ తమ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ సమర్పిస్తే చాలు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఎగబడ్డారు. కంపెనీ కార్యాలయానికి ఆధార్, పాన్ కార్డు పత్రాలతో బారులుతీరారు. అయితే పత్రాలు ఇచ్చిన వారందరికీ ఆ కంపెనీ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తమ కంపెనీలోనే వాహనాల ఫైనాన్స్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై పన్నును రూ.3 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి
ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చేందుకు ఎగబడ్డ ప్రజలు (ఫొటో: IndiaToday)
Comments
Please login to add a commentAdd a comment