Kanchipuram: కాంచీపురంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీషీటర్లు హతం | Two Rowdy Sheeters Were Killed In Encounter At Kanchipuram | Sakshi
Sakshi News home page

Kanchipuram: కాంచీపురంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీషీటర్లు హతం

Published Wed, Dec 27 2023 11:01 AM | Last Updated on Wed, Dec 27 2023 11:23 AM

Two Rowdy Sheeters Were Killed In Encounter At Kanchipuram - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోకి కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. 

వివరాల ప్రకారరం.. చెన్నైలోని కాంచీపురంలో బుధవారం తెల్లవారుజూమున ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. కాగా, మరో రౌడీ షీటర్‌ ప్రభ హత్య కేసులో వీద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 


అయితే, ప్రముఖ రౌడీ శరవణన్ అలియాస్ ప్రభాకరన్ (35)ను చంపిన కేసులో రఘువరన్, ఆసన్ (అలియాస్ కరుప్పు హసన్) నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో, బుధవారం తెల్లవారుజామున వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు వెల్లతురై నేతృత్వంలోని స్పెషల్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లగా.. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కొడవలి కత్తితో దాడి చేయడంతో ఏఎస్ఐ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్ గాయపడ్డారు.

అనంతరం, వీరిని లొంగిపోవాలని పోలీసులు ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. కత్తితో దాడులు చేస్తున్న క్రమంలో తమ ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఫైరింగ్‌ చేశారు. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. ఇద్దరు రౌడీలు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతదేహాలను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పోలీసులు చికిత్స నిమిత్తం కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రభాకరన్‌పై 30కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement