వైరల్: రన్నింగ్ బస్సు నుంచి పట్టుతప్పి రోడ్డున పడ్డ ఓ పిలగాడి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. కొందరు విద్యార్థులు, ఇతరులు ప్రమాదకర పరిస్థితుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అయితే.. అంతమందితో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి హఠాత్తుగా పట్టుతప్పి కిందపడిపోయాడు ఆ స్టూడెంట్.
కాస్తుంటే బస్సు వెనుక చక్రం కిందకు వెళ్లిపోయేవాడే. వెనుక కూడా ఏం వాహనాలు రాకపోవడంతో.. అదృష్టవశాత్తూ పిలగాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ఘటనను బస్సును బైక్‌పై ఫాలో అవుతూ వస్తున్న యువకులు వీడియో తీసినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ అనే వ్యక్తి తమిళనాడులో కాంచిపురం జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు మొదటగా ట్వీట్ చేశాడు.ఆ తర్వాత పలువురు తమ తమ అభిప్రాయాలతో ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తుండడం విశేషం.
Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs
— Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022
చాలాచోట్ల విద్యాసంస్థల రూట్‌లలో తక్కువ బస్సులు నడిపిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు. అయితే.. అత్యుత్సాహంతో కొందరు యువకులు హెచ్చరికలను పట్టించుకోకుండా ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేయడం కూడా తరచూ చూస్తుంటాం. ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం మాత్రమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది కూడా!.
ఇదీ చదవండి: వద్దురా సోదరా.. ఒకే బైక్‌పై ఏడుగురు
Comments
Please login to add a commentAdd a comment