చెన్నై: ఇంటర్నెట్ గ్రామాలకు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా నెట్టింట ఒక్క వీడియో చాలు.. సామాన్యులు సెలబ్రిటీలుగా మారిని ఘటనలు బోలెడు ఉన్నాయి. వీడియోలతో లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. దీంతో యూజర్లు కొందరు కంటెంట్ క్రియేటర్లుగా మారుతూ.. వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది.
ప్రస్తుతం యువత చేసే పనులు కొన్ని పనులు సాధారణంగా నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా విద్యార్థులు నడిచి లేదా బైక్, సైకిల్,లేదా కారు ఇలా వాళ్లకు అందుబాటులో ఉన్న వాహనాలపై కళాశాలకు వస్తుంటారు. అయితే నల్లూరులోని జయరాజ్ అన్నపాకియం కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి మాత్రం కాలేజ్‌కి ఏకంగా ట్రాక్టర్ తీసుకువచ్చాడు.
కళాశాల పూర్తయిన అనంతరం ఆ స్టూడెంట్ ట్రాక్టర్ తోలుకుంటూ వెళ్లగా దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వీడియో చూసిన నెటిజెన్లు ”ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు”, “ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఎలెవషన్స్ ఇచ్చావ్ చూడు తమ్ముడు నువ్వు తోపు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tractor esuku vacchesav entra😂😝😜 pic.twitter.com/4KIQxz7P1x
— Poley_Adiripoley (@poleyadiripoley) August 3, 2023
Comments
Please login to add a commentAdd a comment