running bus
-
రన్నింగ్ బస్సులో నుంచి దూకేశాడు.. ఇక అంతే..! మీరైనా జర జాగ్రత్త..!!
రాజన్న: నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఒకరు మృతిచెందిన సంఘటన గురువారం తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిరిసిల్లకు వస్తుండగా తంగళ్లపల్లికి చేరుకోగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా రన్నింగ్ బస్సులో నుంచి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికి తెలియకపోవడంతో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
షాకింగ్ వీడియో: బస్సు ఫుట్‌బోర్డు నుంచి పట్టుతప్పి..
వైరల్: రన్నింగ్ బస్సు నుంచి పట్టుతప్పి రోడ్డున పడ్డ ఓ పిలగాడి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. కొందరు విద్యార్థులు, ఇతరులు ప్రమాదకర పరిస్థితుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అయితే.. అంతమందితో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి హఠాత్తుగా పట్టుతప్పి కిందపడిపోయాడు ఆ స్టూడెంట్. కాస్తుంటే బస్సు వెనుక చక్రం కిందకు వెళ్లిపోయేవాడే. వెనుక కూడా ఏం వాహనాలు రాకపోవడంతో.. అదృష్టవశాత్తూ పిలగాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ఘటనను బస్సును బైక్‌పై ఫాలో అవుతూ వస్తున్న యువకులు వీడియో తీసినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ అనే వ్యక్తి తమిళనాడులో కాంచిపురం జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు మొదటగా ట్వీట్ చేశాడు.ఆ తర్వాత పలువురు తమ తమ అభిప్రాయాలతో ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తుండడం విశేషం. Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs — Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022 చాలాచోట్ల విద్యాసంస్థల రూట్లలో తక్కువ బస్సులు నడిపిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు. అయితే.. అత్యుత్సాహంతో కొందరు యువకులు హెచ్చరికలను పట్టించుకోకుండా ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేయడం కూడా తరచూ చూస్తుంటాం. ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం మాత్రమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది కూడా!. ఇదీ చదవండి: వద్దురా సోదరా.. ఒకే బైక్‌పై ఏడుగురు -
రెండు బస్సుల మధ్యలో ఇరుక్కొని..
పాములపాడు(కర్నూలు): బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రెండు బస్సుల మధ్యగా వెళ్లబోయి, ఇరుక్కొని నలిగి చనిపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో జరిగింది. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35) బైక్‌పై వెళ్తూ రుద్రవరం వద్ద ఎదురు పడిన రెండు బస్సుల మధ్య గుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బస్సులు కదలటంతో ఇరుక్కుపోయి నలిగి అక్కడికక్కడే చనిపోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నడుస్తున్న బస్సులోంచి దూకి ఆత్మహత్య
గూడూరు: వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకి ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(35) బెంగళూరు కేఆర్‌పురంలో టీ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గత కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. ఒంగోలులోని పోలేరమ్మ గుడిలో తాయెత్తు కట్టుకుంటే మద్యం మానేయవచ్చనే కుటుంబసభ్యుల సలహా మేరకు స్నేహితుడు మునిరాజాతో కలసి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న బస్సు నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారిపై పంటలేరు బ్రిడ్జి వద్ద ఉండగా అకస్మాత్తుగా తన సీట్లోంచి లేచి, బస్సు డోరు తీసుకుని బయటకు దూకేశాడు. తలకు తీవ్రగాయాలు కావటంతో సుబ్బారెడ్డి అక్కడికక్కడే మరణించాడు. గూడూరు పోలీసులు మునిరాజాను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. -
రన్నింగ్ బస్సులెక్కే అవసరముండదిక!