పాములపాడు(కర్నూలు): బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రెండు బస్సుల మధ్యగా వెళ్లబోయి, ఇరుక్కొని నలిగి చనిపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో జరిగింది. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35) బైక్‌పై వెళ్తూ రుద్రవరం వద్ద ఎదురు పడిన రెండు బస్సుల మధ్య గుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బస్సులు కదలటంతో ఇరుక్కుపోయి నలిగి అక్కడికక్కడే చనిపోయాడు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.