
చెన్నై: తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఇవాళ ఘోరం జరిగింది. కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం కాగా, మరో ఐదుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పాతిక మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా!
Comments
Please login to add a commentAdd a comment