finance company
-
భూముల తాకట్టుకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి మూలధనం, ఇతర అవసరాల కోసం రూ.10వేల కోట్ల రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఇకపై వేగం పుంజుకోనున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ తీసుకునే రూ.10వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం (ర్యాటిఫై) తెలిపింది. రుణ మార్కెట్ నుంచి రూ.10వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డుపడుతుండటంతో ప్రభు త్వం కొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది.అప్పుల కోసం ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లు, సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రూ.10వేల కోట్ల రుణం కోసం రూ.20వేల కోట్ల విలువ చేసే భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా రా ష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామని ఫైనాన్స్ సంస్థలు మెలిక పెట్టాయి. ప్రభుత్వం గ్యా రంటీ ఇస్తే భూములు తాకట్టు పెట్టి తీసుకునే రుణా లకు కూడా ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎఫ్ఆర్బీ ఎం పరిధికి లోబడే పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి తీసుకుంటున్న రుణాలకు గ్యారంటీ ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.400 ఎకరాల తాకట్టు..హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కోకాపేట, రాయదుర్గంలోని రూ.20వేల కోట్ల విలువ చేసే సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేకపోవడంతో మర్చంట్ బ్యాంకర్లకు రుణ సేకరణ బాధ్యత అప్పగించారు. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఎంపిక చేసింది. తాజాగా గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా మర్చంట్ బ్యాంకర్లు రుణ సేకరణ చేయాల్సి ఉంటుంది. -
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్‌కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది. -
రూ.200 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్‌సీబీ) మేనేజర్ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్‌కు అప్పగించారు. సోమవారం సీసీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్‌లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్ స్థాయిలో పని చేస్తున్నారు. 15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి.. దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్సీబీలో డిపాజిట్ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్‌లోని టీఎస్‌సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్ సంస్థ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్ సంస్థపై పడింది.బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్‌లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. -
డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా
సహారా అంటే సహాయం, సహారా అంటే సముద్రం. సహారా అంటే ఓ ఎడారి. కానీ మన దేశంలో సహారా అంటే ఓ కంపెనీ. ఆ సంస్థని స్థాపించింది సుబ్రతా రాయ్. ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే స్థాయి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన సుబ్రతా రాయ్ కార్పొరేట్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అపర కుబేరుడిగా అవతరించిన రాయ్.. చివరికి అందరూ ఉన్న అనాధలా తలకొరివి పెట్టించుకోలేని దుస్థితికి ఎలా దిగజారారు. సహారాలో పనిచేస్తూ జీతం తీసుకునే ఉద్యోగులు, సహారా నుంచి కమీషన్ తీసుకునే కమీషన్ ఏంజెంట్లు, సహారా కస్టమర్లు సైతం దేవుడు, సహారా శ్రీగా పిలిచే సుబ్రతా రాయ్ 1948 బీహార్‌లోని అరారియాలో బెంగాలీ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఛబీ, సుధీర్ చంద్ర రాయ్‌లు తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని ఢాకా, బిక్రంపూర్‌లో సంపన్న భాగ్యకుల్ జమీందార్ భూస్వామి కుటుంబానికి చెందినవారు. మిర్చి బజ్జీలు అమ్ముతూ అయితే, షుగర్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే తండ్రి సుధీర్ చంద్ర రాయ్ మరణంతో కుటుంబ పోషణ భారం సుబ్రతారాయ్ మీద పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం ‘జయ ప్రొడక్ట్’ పేరుతో మిర్చి బజ్జీలు, పునుగులు, ఇతర తినుబండరాలను భార్య సప్నారాయ్ తయారు చేస్తే.. డొక్కు లాంబ్రెట్టా స్కూటర్ మీద ఇంటింటికి తిరుగుతూ అమ్మేవారు. ఇలా తినుబండారాలే కాకుండా భార్య సప్నారాయ్తో మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. కానీ ఆ రెండు బిజినెస్‌లు ఫెయిల్ అయ్యాయి. రెండు బిజినెస్‌లు ఫెయిల్ ప్రతి రోజు చెమట చిందిస్తేనే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే పరిస్థితి మరింత దిగజారడంతో.. ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు సుబ్రతా రాయ్. అప్పుడే తన మాటే మంత్రంలా పనిచేసేలా రాయ్ మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ఈసారి గురి కుదిరింది. బిజినెస్ నిలబడింది. 30 ఏళ్ల పాటు అప్రతిహితంగా సాగింది. చివరికి సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జైలు జీవితం ఎలా ఉంటుందో నేర్పింది. ఇంతకీ ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఇప్పుడంటే ఎటు చూసినా బ్యాంకులే దర్శనమిస్తున్నాయి. కానీ 1970లలో బ్యాంకులు ఉండేవి కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ గురించి, సేవింగ్స్ గురించి పెద్దగా తెలిసేదికాదు. ఇక్కడే సుబ్రతరాయ్ మాస్టర్ మైండ్‌కి ఓ బిజినెస్ ఐడియా తట్టింది. అదేంటంటే? స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ స్కూటర్ మీద తినుబండరాలు అమ్మే సుబ్రతా రాయ్ స్థానికంగా ఉండే టీ స్టాల్ నిర్వాహకులు, రిక్షా నడపుతూ జీవనం కొనసాగించేవారు, తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు నిర్వహించే నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మీరు ఏ పని చేస్తున్నా. వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంతుంటే అంత బ్యాంక్‌లకు వెళ్లే అవసరం లేకుండా నా దగ్గర దాచండి. దాచిన మొత్తానికి కొంత కాలం తర్వాత అధిక మొత్తం వడ్డీ ఇస్తానని ఆశ చూపించారు. ఇలా ఒక రూపాయి నుంచి పదులు, వందలు ఇలా కొద్ది మొత్తాన్ని దాచుకోవచ్చని చెప్పడంతో వారికి ఇదొక మంచి అవకాశంగా భావించారు. ఈ ప్రచారంతో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాల్లోని ప్రజలు సహారాలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. సహారాతో కనెక్టైనా ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా కట్టి పడేయడం రాయ్‌కి కొట్టిన పింది. కస్టమర్లను, ఏజెంట్లను, ఉద్యోగులను సహారాపరివార్ అంటూ తన మాటే మంత్రంలా పనిచేసేలా కట్టిపడేస్తుండేవారు. పైగా పేదలకు పెళ్లిళ్లు చేసి వారు ఆర్ధికంగా నిలబడేలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. సహారా పరివార్ పేరుతో దేశం మొత్తం ప్రచారం చేసేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యమైనట్లే? సహారా సంస్థమీద, సుబ్రతా రాయ్ మీద నమ్మకాన్ని పెంచేందుకు క్రికెట్లోకి అడుగుపెట్టారు. క్రికెట్‌ను మతంలా భావించే ఇండియన్ క్రికెట్ టీంకు స్పాన్సర్ చేశారు. దీంతో సహారా మీద ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. డిపాజిట్లు సైతం భారీగా పెరిగాయి. హాస్పిటల్ ఖర్చులు, చదువులు, పెళ్లిళ్లలకు సహారాలో డిపాజిట్ చేసిన డబ్బులు, వాటి నుంచి వచ్చే వడ్డీ ఉపయోగపడడంతో చాలా మంది సుబ్రతా రాయ్‌ని దేవుడిలా భావించారు. సంస్థ ఉద్యోగులు, కమిషన్ ఏంజెట్ల కష్టానికి ప్రతిఫలంగా వేతనాలు ఇవ్వడంతో సుబ్రతారాయ్‌ని సహారా శ్రీగా పిలిచేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యం అనేలా ఫిలయ్యేవారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలా 1978లో రూ.2వేల రూపాయల పెట్టుబడి, ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సహారా 1.13 మిలియన్ల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. 1997కి సహారా సంస్థ 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఎయిర్ సహారా, న్యూయార్క్‌లో లగ్జరీ హోటల్స్ కొనుగోలు, భారత్‌లో యాంబీ వ్యాలీ పేరుతో రిసార్ట్... ఇలా వాట్ నాట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌ను నిర్మించారు. క్రికెట్, ఏవియేషన్ రంగంలో సైతం అడుగు పెట్టారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. రూ.550కోట్లతో ఇద్దరు కుమారుల పెళ్లి సుబ్రాతా రాయ్‌కి సుశాంతో, సీమంతో రాయ్ ఇద్దరు కుమారులు. 2004 ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో వాళ్లిద్దరి పెళ్లిని రూ. 550 కోట్లతో నాలుగు రోజుల పాటు నిర్వహించారు. ముఖ్య అతిధుల కోసం ప్రైవేట్ జెట్లను ఏర్పాటు చేశాడు సుబ్రతారాయ్. కొద్ది మందిని కొంత కాలమే మోసం చేయొచ్చు. ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కొడుకుల పెళ్లితో సుబ్రతా రాయ్ జీవనశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరుపేదల సొమ్మును దోచుకునేలా ఇలా నిరుపేదలు దాచుకున్న మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అప్పటి వరకు ప్రజలు డిపాజిట్ చేసిన అసలు, వడ్డీని సహారా ఇచ్చేది. రోజులు గడిచే కొద్ది ఆ మొత్తాన్ని ఇవ్వకుండా సహారా గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వారిని మోటివేట్ చేసేవారు. అంతేకాదు అప్పటి వరకు ఏజెంట్లు ఇంటికి వెళ్లి డిపాజిట్లను వసూలు చేసేవారు. కానీ ఇకపై ఏజెంట్లకు ఇంటింటికి తిరగరని మీరే వచ్చి డిపాజిట్ చేయాలని హుకుం జారీ చేశారు. అలా డిపాజిట్ చేసేందుకు వీలు లేక కట్టని వారిని స్కీమ్‌ల నుంచి వారి పేర్లను తొలగించేవారు. తొలగించిన వారి డిపాజిట్లను తిరిగి ఇచ్చేది కాదు సహారా గ్రూప్. సహారా మోసం వెలుగులోకి వచ్చింది అప్పుడే అయితే సుదీర్ఘ విరామం తర్వాత 2009లో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సహారా ఇండియా గ్రూప్ తన రియల్టీ విభాగం సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్ (ఎస్పీసీఎల్) ఐపీవోకి వెళుతున్నట్లు సుబ్రతారాయ్ ప్రకటించారు. ఆ ప్రకటన సహారాని ఊహించని మలుపు తిప్పింది. ఐపీవోకి వెళ్లాలంటే కంపెనీల వివరాలు లాభాలు, నష్టాలు, వివాదాలన్నింటిని వివరిస్తూ ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ను సెబీకి దాఖలు చేయాలి. ఇక్కడే సహారా గ్రూప్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా రూ.24,000 కోట్ల కుంబకోణానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది. సుబ్రతా రాయ్‌ని ఇరికించిన రోషన్‌లాల్ ఆ తర్వాత కొద్ది రోజులకు డిసెంబర్ 25, 2009న, జనవరి 4, 2010న సెబీకి రెండు ఫిర్యాదులు అందాయి. సహారాకు చెందిన ఈ రెండు (పైన పేర్కొన్న) సంస్థలు కొన్ని బాండ్ల జారీలో చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగించాయని ఆరోపించాయి. ఆ ఫిర్యాదు చేసింది మరోవరో కాదు. ఒకరు పెట్టుబడిదారులు సభ్యులు చేస్తే, జనవరి 4, 2010న ఆడిటర్ రోషన్‌లాల్ చేశారు. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. రోషన్ లాల్ ఫిర్యాదు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా సెబీకి చేరింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా, సెబీ.. సహారా గ్రూప్ నుండి వివరణలు కోరడం ప్రారంభించింది. సంచలనం సెబీ ప్రశ్నల పరంపరపై రాయ్ స్పందిస్తూ ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,669 బాక్సుల్లో 3 కోట్ల మంది మదుపర్ల ధరఖాస్తులు, రెండు కోట్ల రిడెంప్షన్ వోచర్లను సెబీకి పంపారు. దీంతో సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబై శివార్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కుల్లో వచ్చిన ఆధారాల్ని సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించి మరీ ఈ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలను స్కాన్ చేసి, ఒక సర్వర్‌లో దాచింది. నన్ను ఉరితీసుకోవచ్చు పలు దఫాలుగా సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అంతేకాదు తన 32 వ్యాపారం రంగంలో ఎన్నడూ న్యాయ నిబంధనలకు వ్యవహరించలేదని, అలా చేస్తే నన్ను ఉరి తీయొచ్చని సుబ్రతారాయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు నుంచి బయట పడేలా లలిత్ మోడీ సాయం ఇలా 2010 నుంచి ప్రారంభమైన సుబ్రతారాయ్ కేసు 2014 మార్చి 4 వరకు కొనసాగింది. మార్చి 4 పోలీసు కస్టడీలో ఉన్న సుబ్రతారాయ్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉండి కేసు నుంచి బయటపడేందుకు ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాడు రాయ్. ఇందు కోసం జైలులో వైఫైని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక తన ఆస్తుల్ని అమ్మి కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, కార్పొరేట్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీని కోరాడు. ఇలా 2014 నుంచి 2016 వరకు తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. చివరికి 2014 మార్చి 4 బెయిల్‌పై విడుదలయ్యారు. కడసారి చూపుకు నోచుకోని తాజాగా, సుబ్రతారాయ్ అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించగా.. గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసులు కారణంగా ఇద్దరు కుమారులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన రాయ్‌ని కడసారి చూపుకు ఆయన ఇద్దరు కుమారులు సుశాంతో, శ్రీమంతోలు నోచుకోలేదు. చివరికి అందరూ ఉన్న అనాధలా లండన్‌లో చదువుకుంటున్న సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
ఫైనాన్స్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
మొయినాబాద్: ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌వాసి మద్యపాగ అశోక్ (25) కొంతకాలం కిందట ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ ప్రతినిధులు వేధించసాగారు. మనస్తాపం చెందిన అశోక్.. దీపావళి రోజున రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు ఇంట్లో చూసేసరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
Hyderabad: మహిళకు ఫైనాన్స్ సంస్థ వేధింపులు.. సుసైడ్ నోట్ రాసి..
సాక్షి, హైదరాబాద్: ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజబొల్లారం తండాకు చెందిన సునీత(35) గత కొంత కాలంగా కూతురుతో కలిసి మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్లో నివాసం ఉంటూ అలియాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద బైక్‌జోన్ నిర్వహిస్తుంది. వ్యాపార నిర్వహణకు ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకుంది. అయితే కొన్ని నెలలుగా ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపానికి లోనైంది. శుక్రవారం ఉదయం కుమార్తెను పాఠశాలకు పంపిన తర్వాత తన ఆత్మహత్యకు ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ వారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రాత్రి నలుగురు యువకులు మాస్కులు ధరించి.. ఇంట్లోకి వెళ్లి..
తిరువొత్తియూరు(చెన్నై): తిరుపూర్‌లో ఫైనాన్స్ సంస్థ యజమానిని కట్టివేసి రూ.50 లక్షలు నగలు, నగదు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుపూర్ పుస్పా రౌండ్ టానా రాయపండ్రా వీధికి చెందిన సంగమేశ్వరన్ (63) ఫైనాన్స్ సంస్థ నడుపుతున్నాడు. అతని భార్య రాజేశ్వరి (57). ఆదివారం రాత్రి 25 ఏళ్ల వయసున్న నలుగురు యువకులు మాస్కులు ధరించి సంగమేశ్వరన్ ఇంటిలోకి చొరబడ్డారు. కత్తులు చూపించి నోటిలో గుడ్డలు కుక్కి వారిని తాడుతో కట్టి వేశారు. తర్వాత ఇంట్లో ఉన్న నగలు నగదును మూటగట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేయగా బీరువాలో ఉన్న 40 సవర్ల నగలు, రూ.30 లక్షల నగదు చోరీ చేసినట్టు తేలింది. వీటి విలువ రూ. 50 లక్షలు చేస్తుందని సంగమేశ్వరన్ తెలిపారు. -
దేశంలో తగ్గని స్టార్టప్ కంపెనీల జోరు..!
దేశంలో స్టార్టప్ కంపెనీల జోరు అస్సలు తగ్గడం లేదు. తాజాగా ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే స్టార్టప్ కంపెనీ మార్చి 23న ఏ సిరీస్ ఫండ్ రైసింగ్'లో భాగంగా 200 మిలియన్ డాలర్లను సేకరించినట్లు తెలిపింది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ 1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ మొదటి రౌండ్'లో ఇంత మొత్తంలో ఫండ్ సేకరించడం ఇదే మొదటిసారి. కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో యునికార్న్ కంపెనీగా ఆక్సిజో ఫైనాన్షియల్ అవతరించింది. టైగర్ గ్లోబల్, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్, మ్యాట్రిక్స్ పార్టనర్స్, క్రియేషన్ ఇన్వెస్ట్ మెంట్స్ సంయుక్తంగా నాయకత్వం వహించాయి. సంవత్సరం కిందటే.. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్, ఇతరుల నుంచి మద్దతు పొందిన తర్వాత కల్రా భర్త ఆశిష్ మొహపాత్రా ఆఫ్‌బిజినెస్ కంపెనీ కూడా అదే విలువను చేరుకుంది. తయారీ & సబ్-కాంట్రాక్టింగ్ వంటి రంగాలలో ఎస్ఎమ్ఈల కోసం కొత్త మెటీరియల్ కొనుగోలు చేయడానికి సరిపోయే వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్'ను ఈ కంపెనీ అందిస్తుంది. ప్రారంభం నుంచి ఈ కంపెనీ మంచి లాభాల్లో కొనసాగుతుంది. "ఆఫ్ బిజినెస్, ఆక్సిజో రెండూ కూడా 50+ ఆర్థిక సంస్థలలో విశ్వాసాన్ని పెంపొందిస్తూ బలమైన రుణ ప్రొఫైల్ కలిగి ఉన్నాయి" అని ఆఫ్‌బిజినెస్ గ్రూప్ సీఈఓ ఆశిష్ మహాపాత్ర చెప్పారు. ఆదర్శంగా నిలుస్తున్న జంట కల్రా(38), మోహపాత్ర(41) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్వ విద్యార్థులు. మెకిన్సే & కోలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరూ కలుసుకున్నారు. వీరి రెండు స్టార్టప్‌లు కూడా లాభదాయకంగా ఉన్నట్లు వ్యాపారవర్గాల నుంచి వినిపిస్తోంది. కల్రా.. ఆక్సిజో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగా, మోహపాత్రా.. ఆఫ్బిజినెస్లో సీఈఓ. మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ & క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారత్ స్టార్టప్ పరిశ్రమలో అతిపెద్ద సిరీస్ ఏ రౌండ్లలో ఒకటైన ఆక్సిజోలో పెట్టుబడి పెట్టాయి. ఆక్సిజో అనేది ఆక్సిజన్ + ఓజోన్ పదాల మిశ్రమం. 2016 ప్రారంభంలో మరో ముగ్గురితో కలిసి ప్రారంభించిన ఈ జంట మొదటి స్టార్టప్ ఆఫ్‌బిజినెస్. ఆ తర్వాత కల్రా, మోహపాత్ర, మరో ముగ్గురు కలిసి 2017లో ఆక్సిజోను స్థాపించారు. (చదవండి: హోండా సరికొత్త రికార్డులు.. ఏకంగా 30 లక్షలకుపైగా..) -
టీడీపీ నేతపై కేసు: ఏసీలు కొన్నాడు.. రుణం తీర్చనన్నాడు!
సాక్షి, చిత్తూరు: ఓ ఫైనాన్స్ సంస్థ రుణంతో ఏసీలు కొని, బకాయిలు కట్టనందుకు టీడీపీ మండల అధికార ప్రతినిధి హేమాద్రినాయుడుపై కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. రామభద్రాపురం గ్రామానికి చెందిన హేమాద్రినాయుడు అతని భార్య హరిణి పేరున బజాజ్‌ఫైనాన్స్‌లో 2020 జనవరి 8వ తేదీన రెండు ఏసీలు కొన్నారు. రెండు ఏసీలకు గాను రూ.1,04 లక్షలు కట్టాల్సి ఉంది. ఇందులో రూ.34,660 డౌన్ పేమెంట్ కింద బజాజ్‌ఫైనాన్స్‌కు కట్టారు. మిగిలిన మొత్తం బజాజ్ ఫైనాన్స్ సంస్థ రుణంతో, చిత్తూరులోని రిలైన్స్ మార్ట్‌లో రెండు ఏసీలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను ప్రతినెలా రూ.8,700 ఈఎంఐ కట్టాల్సి ఉంది. సెప్టెంబర్ నెలకు ఈఎంఐ కట్టలేదు. ఇందుకుగాను చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ సురేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆదివారం రామభద్రాపురంలోని హేమాద్రినాయుడు ఇంటికి కలెక్షన్ ఏజెంట్ పద్మనాభన్‌తో పాటు వచ్చారు. దీంతో ఆగ్రహించిన హేమాద్రినాయుడు తన ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం..రా అంటూ అతన్ని దుర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకొన్నారు. ‘గుడిపాల మండలం తెలుగుదేశం నాయకుడ్ని నేను, ఫోన్ చేస్తే 200 మంది ఇప్పుడే వస్తారు, నీ కథ తెలుస్తా.’ అంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ సర్పంచ్‌గా హేమాద్రినాయుడు భార్య హరిణి ప్రస్తుతం పనిచేస్తున్నారు. -
కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు
Ranveer Singh and Deepika Padukone's Film 83 in Legal Trouble: టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ ముంబై కోర్టును ఆశ్రయించారు. చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ 83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కాదా దీనికి విశేష స్పందన వచ్చింది. చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి 1983 నాటి ప్రపంచ కప్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రంలో రణ్వీర్ సింగ్.. కపిల్ దేవ్ పాత్ర పోషిస్తుండగా ఆయన భార్య రూమీ భాటియాగా దీపికా కనిపించబోతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. -
హర్రర్ సినిమాలు చూసే దమ్ముందా?.. రూ.లక్ష సొంతం!!
Horror Movies Challange: నయనతార నటించిన మయూరి(మాయా) సినిమా గుర్తుందా?. తాను తీసిన హర్రర్ సినిమాను ఒంటరిగా, భయపడకుండా చూస్తే.. నగదు బహుమతి ఇస్తానంటూ అందులో డైరెక్టర్ క్యారెక్టర్ ఓ ప్రకటన ఇస్తుంది. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు హార్ట్-పల్స్బీట్ను పరిశీలిస్తుంటారు కూడా. దాదాపు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో అలాంటి ప్రకటననే జారీ చేసింది ఓ కంపెనీ. కాకపోతే అది మనదేశంలో కాదులేండి. హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉంటారో.. దానిని చూడడానికి అంతే కష్టపడేవాళ్లు అంతేమంది ఉంటారు. కానీ, అమెరికాలో ఓ కంపెనీ.. హర్రర్ సినిమాల్ని చూసేవాళ్లకు లక్ష దాకా ప్రైజ్ మనీ ఇస్తుందట. అమెరికాలోని ఫైనాన్స్‌బజ్ అనే ఫైనాన్స్ కంపెనీ ఈ నొటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలలో వాళ్లు ఎంపిక చేసిన పదమూడు హాలీవుడ్ హర్రర్ సినిమాల్ని పదిరోజుల్లో చూసేయాలి. అదీ రేప్పేయకుండా.. భయంతో వణికిపోకుండా!. చాలెంజ్‌లో గెలిస్తే 1,300 డాలర్లకిపైగా(దాదాపు లక్ష దాకా) ప్రైజ్‌మనీ ఇస్తారు. అయితే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే కండిషన్ పెట్టారు. త్వరలో హాలీవుడ్లో కొన్ని హర్రర్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తరుణంలో హైబడ్జెట్.. లోబడ్జెట్ హర్రర్ సినిమాల్లో ఏవి ఎక్కువగా భయపెడతాయి అనేది తెలుసుకునేందుకు ఫైనాన్స్‌బజ్ ఈ ప్రయత్నాన్ని చేస్తోంది. లిస్ట్‌లో ‘సా, ఎమిటీవిల్లే హర్రర్, ఏ క్వైట్ ప్లేస్, ఏ క్వైట్ ప్లేస్-2, క్యాండీమ్యాన్, ఇన్సైడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సిన్స్టర్, గెట్ అవుట్, ది పర్గే, హలోవీన్(2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్లె’ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్ 26 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఇక ఒంటరిగా ఈ సినిమాలు చూస్తున్నంత సేపు ఫిట్‌బిట్ సాయంతో హార్ట్, పల్స్ రేట్‌ను మానిటర్ చేయబోతున్నారు. ఏమైనా తేడాలు అనిపిస్తే.. ఆ వ్యక్తిని సినిమా చూడడం ఆపేయమని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక ఈ ఫిట్‌బిట్‌ను ఫైనాన్స్‌బజ్ కంపెనీ వాళ్లే అందిస్తారు. అంతేకాదు సినిమాలు చూడడానికి 50 డాలర్ల రెంటల్ డబ్బును కూడా చెల్లిస్తున్నారు. ఇంతకీ ఈ ఉద్యోగానికి పెట్టిన పేరేంటో తెలుసా.. ‘హర్రర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’. చదవండి: మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్లు -
పెట్రోల్ ధరలతో అల్లాడుతున్నారా? ఈ ఆఫర్ మీకోసమే!
చెన్నె: పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.110కి లీటర్ పెట్రోల్ చేరువయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.115 నుంచి 118 వరకు చేరుకుంది. ధరలు ఇలా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించేస్తున్నారు. అత్యవసరం.. ముఖ్యమైన పనులకే వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే ఓ కంపెనీ బంపర్ ఆఫర్ అందించింది. లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఎందుకు? ఏమిటి? ఎక్కడో తెలుసుకోండి! చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉతిరామేరూర్‌లో శ్రీరామ్ వాహన ఫైనాన్స్ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రజలందరూ తమ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ సమర్పిస్తే చాలు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఎగబడ్డారు. కంపెనీ కార్యాలయానికి ఆధార్, పాన్ కార్డు పత్రాలతో బారులుతీరారు. అయితే పత్రాలు ఇచ్చిన వారందరికీ ఆ కంపెనీ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తమ కంపెనీలోనే వాహనాల ఫైనాన్స్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై పన్నును రూ.3 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చేందుకు ఎగబడ్డ ప్రజలు (ఫొటో: IndiaToday) -
ఎగిరిపోయిన ‘హెలికాప్టర్ బ్రదర్స్’... రూ.600 కోట్ల మోసం?
టీ.నగర్: కుంభకోణంలో ఫైనాన్స్ సంస్థ నడపి నగదు మోసానికి పాల్పడిన బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. తిరువారూరు జిల్లా మరైయూరుకు చెందిన సోదరులు గణేష్ (50), స్వామినాథన్ (47) తంజావూరు జిల్లా కుంభకోణంలో నివసిస్తున్నారు. అక్కడ విక్టరీ ఫైనాన్స్, కోరకైలో గిరీష్ డెయిరీ ఫామ్ నడుపుతున్నారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వీరు సొంతంగా హెలికాప్టర్ కలిగి ఉన్నారు. గణేష్ బీజేపీ వర్తక విభాగం పదవిలో ఉన్నారు. వీరి ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టింపు ఇస్తామని ప్రజల వద్ద నగదు వసూలు చేశారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించి కమీషన్లు అందజేశారు. ఇలాఉండగా కోట్లాది రూపాయల నగదు డిపాజిట్ చేసిన పలువురికి కరోనా వైరస్ కారణం చూపి నగదు సక్రమంగా చెల్లించలేదని ఫిర్యాదులు అందాయి. కుంభకోణానికి చెందిన జబరుల్లా–ఫిరోజ్‌భాను గణేష్, స్వామి నాథన్ రూ.15 కోట్ల వరకు మోసగించినట్లు తంజావూరు ఎస్పీ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. డీఐజీ ప్రవేష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సంస్థ ఉద్యోగులను విచారించారు. జీఎం శ్రీకాంత్‌ను అరెస్టు చేసి పోలీసులు బుధవారం ఉదయం గణేష్ ఇంట్లో తనిఖీలు జరిపారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. కుంభకోణంలో రూ.600 కోట్ల మేరకు మోసం జరిగినట్లు నగరంలో పోస్టర్లు వెలిశాయి. వీటిని అతికించిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతన్ని ఉత్తర జిల్లా వర్తక సంఘం అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్‌కుమార్ ప్రకటించారు. -
రాపిపే నుంచి మైక్రో ఏటీఎం
సాక్షి, హైదరాబాద్ : క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్‌కు చెందిన అనుబంధ కంపెనీ రాపిపే మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టింది. కస్టమర్లు రాపిపే సాథి కేంద్రాలకు వెళ్లి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకింగ్ సేవలూ పొందవచ్చు. చిన్న వర్తక కేంద్రాలను సాథి స్టోర్లుగా కంపెనీ మలుస్తోంది. దేశవ్యాప్తంగా 11 వేలపైచిలుకు ప్రాంతాల్లో 50,000లకుపైగా సాథి కేంద్రాలను రాపిపే నిర్వహిస్తోంది. సాథి కేంద్రాల నిర్వాహకులు బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి 19 శాతమే. ఈ నేపథ్యంలో గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు చేరేందుకు మైక్రో ఏటీఎంలు చక్కని పరిష్కారమని కంపెనీ తెలిపింది. -
లాకర్‌నే లాక్కెళ్లారు..
ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఏ వస్తువూ చెక్కుచెదరలేదు. షట్టర్ తాళం పగలగొట్టి లోనికొచ్చారు. రూ.36 లక్షల సొమ్మున్న 50 కేజీల ఐరన్ లాకర్ మోసుకెళ్లారు. సీసీ ఫుటేజి హార్డ్ డిస్్క ను సైతం తస్కరించి చల్లగా జారుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ చోరీ జరగగా.. సోమవారం ఉదయం ఉద్యోగులు విధులకు వచ్చే వరకు విషయమే తెలీదు. ఇంత పక్కాగా జరిగిందంటే ఇంటి దొంగల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పెదపాడు రోడ్ పరిధిలో గల పద్మపూజిత ఆటో ఫైనాన్స్ (నీలమణి దుర్గా ఆటో కన్సల్టెన్సీ) కంపెనీలో భారీ చోరీ జరగడంతో ఒక్కసారిగా యజమానులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. సోమ వారం ఉదయం 9 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చిన ప్యూన్ తాళాలు తీసి కార్యాలయం తుడిచి వాహనాలు బయట పెట్టే పనిలో ఉన్నాడు. విధులకు వచ్చిన ఉద్యోగి బసవ సత్యనారాయణరాజు ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్లి.. థంబ్ ఇంప్రెషన్‌తో బయోమెట్రిక్ హాజరు వేసుకుంటూ.. సీక్రెట్ లాకర్ రూమ్ తెరిచి ఉండటాన్ని గమనించారు. క్యాషియర్ హరిగోపాల్, అసిస్టెంట్ క్యాషియర్ తేజ సుబ్రమణ్యంలకు సమాచారం ఇచ్చారు. వీరు వచ్చి లాకర్లో ముందు రోజు ఉంచిన రూ.36 లక్షల సొమ్ము చోరీకి గురయ్యిందని గ్రహించి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కంపెనీ పార్టనర్స్ ఫణికుమార్, సత్యనారాయణలకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం ఎలా జరిగిందంటే.. ఆదివారం ఆఫ్ డే కావడంతో మధ్యాహ్నం రెండు గంటలకు పనిముగించుకొని ఉద్యోగులు వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షాప్ వెనుక భా గంలో ఉన్న షట్టర్ తాళాలు విరగ్గొట్టి లోనికి వచ్చారు. అక్కడ నుంచి ఆఫీస్ క్యాబిన్ రూమ్‌లోకి వెళ్లి సీక్రెట్ లాకర్ రూమ్‌లో ఉన్న ఐరన్ లాకర్‌ను పట్టుకుపోయారు. దీంతోపాటు సీక్రెట్ కెమెరాల్లో రికార్డయ్యే హార్డ్ డిస్క్‌లను సై తం తస్కరించారు. షట్టర్‌ను దించేసి, ఆ పక్కనే బాత్రూంలో ఉన్న సర్ఫ్ పౌడర్‌ను నీటిలో కలిపి, తమ వేలిముద్రలు గుర్తించకుండా నురగను ఆ పరిసరాల్లో పోసి పరారయ్యారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రాక విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతోపాటు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీసు శునకం ఫైనాన్స్ కంపెనీ పక్క భవ నంపైకి వెళ్లి కార్యాలయం లోపలికి వచ్చి చుట్టూ తిరిగి కంపెనీ వెనుక గల ముళ్లపొద ల వద్దకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం వేలిముద్రల జాడలను సేకరించింది. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది సిబ్బంది వేలిముద్రలను సైతం పోలీసులు తీసుకున్నారు. వీరి పాత్రతోపాటు 25 మంది కలెక్షన్ ఏజెంట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారు. 50 కేజీల లాకర్‌ను మోసుకెళ్లారంటే.. నలుగురైదుగురు ఈ ఘటనలో పాలుపంచుకున్నారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. 26, 27 తేదీల్లో వచ్చిన నగదు లాకర్లో ఉందని హెడ్ క్యాషియర్ చెబుతున్నారు. ఇంటి దొంగల పనేనా? దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇది ఇంటిదొంగల పనే నా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా దుండగులు సునాయాసంగా లోనికి ప్రవేశించినట్టు అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల హస్తం ఉండి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎంట్రన్స్‌లో ఉన్న కెమెరాను పగలకొట్టి లోపలికి వచ్చారు. మరే కెమెరాను ముట్టుకోలేదు. ఏకంగా సీసీ ఫుటేజి రికార్డయ్యే హార్డ్ డి స్్కలను తస్కరించడంతో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దొంగతనమని అర్థమవుతోంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఆరా తీశారు. ఆయనతోపాటు వన్‌టౌన్ సీఐ అంబేద్కర్, రూరల్ ఎస్ఐ లక్ష్మణరావులు ఉన్నారు. -
ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లారని..
ఓర్వకల్లు: సకాలంలో కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పి.మద్దిలేటి (40) వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం బేతంచెర్ల పట్టణంలోని హీరో కంపెనీ షోరూంలో ఫైనాన్స్‌లో బైక్‌ను కొనుగోలు చేశాడు. ప్రతి నెలా రూ.3 వేల చొప్పున కంతులు చెల్లించాల్సివుంది. కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో వ్యవసాయ పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల కంతులు చెల్లించలేకపోయాడు. ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ వారం క్రితం కంతులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులు రూ.6 వేలు మద్దిలేటికి ఇచ్చారు. ఆ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. మూడు రోజుల క్రితం కంపెనీ ఏజెంట్ బైక్‌ను తీసుకెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మద్దిలేటి ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
అంతర్ జిల్లాల ట్రాక్టర్ల దొంగలకు సంకెళ్లు
ప్రకాశం, మార్కాపురం: ఫైనాన్స్ కంపెనీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులు, యజమానుల నుంచి వాటిని మళ్లీ కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీలకు సకాలంలో వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన కలగొట్ల శ్రీనివాసరెడ్డి, అర్ధవీడుకు చెందిన వై.మహేష్‌లు మార్కాపురంలోని మహీంద్రా షోరూమ్‌లో ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత ట్రాక్టర్‌ను గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన మొలక రమేష్‌కు విక్రయించారు. ట్రాక్టర్‌కు తాము చెల్లించాల్సిన ఫైనాన్స్‌ను రమేష్ చెల్లిస్తాడనే ఒప్పందంతో విక్రయించారు. ఫైనాన్స్ కంపెనీకి ప్రతి నెలా చెల్లించాల్సిన నగదు రమేష్ చెల్లించకపోవటంతో గత నెల 10న స్పందనలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు శ్రీనివాసరెడ్డి, మహేష్‌లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్రను ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 11న గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సుందరరావు, రమేష్‌లు అర్ధవీడు మండలం నాగులవరంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నిందితులు మూడు రకాలా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫైనాన్స్ కంపెనీల్లో ట్రాక్టర్లు కొన్న రైతులు, యజమానులను మొలక రమేష్ ద్వారా సంప్రదించి వారికి రూ.40 వేలు, రూ.50 వేలు ఇలా చిన్న మొత్తాల్లో డబ్బులు చెల్లిస్తారు. ఫైనాన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మిగిలిన బకాయిలు తామే చెల్లిస్తామని నమ్మకంగా చెబుతారు. ట్రాక్టర్ తెచ్చుకుని ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించకుండా ట్రాక్టర్‌ను అమ్ముకుని తప్పించుకుని తిరుగుతుంటారు. జిల్లాలోని అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లిలో రైతులు, యజమానుల నుంచి మొత్తం తొమ్మిది ట్రాక్టర్లను తీసుకెళ్లి మూడు ట్రాక్టర్లను అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బంధువులు, తెలిసిన వారిని ప్రొత్సహించి వారిలో ఒకరి ద్వారా ట్రాక్టర్ షోరూమ్ వారికి రూ.30 వేలు చెల్లించి అవసరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇతరులకు అమ్ముతున్నారు. ఈ విధంగా మూడు ట్రాక్టర్లను రైతుల పేర్లపై తీసుకుని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. పక్కా మోసం గుంటూరు జిల్లాలో ఫైనాన్స్ నుంచి ఏడు ట్రాక్టర్లు, కొటక్ మహింద్రా ఫైనాన్స్ నుంచి మూడు ట్రాక్టర్లు, మణప్పురం ఫైనాన్స్ నుంచి ఒక ట్రాక్టర్‌ను, ఇండస్ బ్యాంక్ నుంచి నాలుగు ట్రాక్టర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి నాలుగు ట్రాక్టర్లు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ నుంచి ఒక ట్రాక్టర్, ఇతర ఫైనాన్స్ కంపెనీల నుంచి 13 ట్రాక్టర్లు.. ఇల్లా మొత్తం 31 ట్రాక్టర్లు తీసుకున్నారు. మొలక రమేష్ తీసుకున్న రెండు ట్రాక్టర్లను కూడా వేరే వారికి విక్రయించారు. పిడుగురాళ్లలోని శ్రీలక్ష్మి ఫైనాన్స్ కంపెనీ నుంచి తన పేరు మీద ఒక ట్రాక్టర్, తనకు తెలిసిన వారి పేరు మీద మరో నాలుగు ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించి ఫైనాన్స్ చెల్లించకుండా తప్పించుకుని నిందితులు తిరుగుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రైవేటు ఫైనాన్స్‌ల నుంచి తీసుకున్న 20 ట్రాక్టర్లకు వాయిదాలు చెల్లించలేదు. మొత్తం మీద 67 ట్రాక్టర్లకు సంబంధించి ఇద్దరు నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుందర్రావు చేసిన మోసం గురించి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తున్నామన్నారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాయమాటలు నమ్మి అపరిచితులకు ట్రాక్టర్లను అప్పగించి మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ కేవీ రాఘవేంద్ర, అర్ధవీడు ఎస్ఐ సాంబశివరావులను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అభినందించారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం రూరల్ ఎస్ఐ కోటయ్య ఉన్నారు. -
రుణసంస్థలకు రాష్ట్రం తాకట్టు
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులమయం చేసి రాష్ట్రాన్ని రుణ సంస్థలకు తాకట్టు పెట్టారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి రుణ వ్యవధి ని ఏకంగా 40 ఏళ్లకు పెం చారని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మో సం చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు, నిధులు వచ్చాయని, ఆయన కుటుం బానికి పదవులు వచ్చాయే తప్ప నిరుద్యోగులకు కొలువులు రాలేదన్నారు. ఈసీతో కలిసి టీఆర్ఎస్ కుట్ర: ఎన్నికలు వస్తే చాలు.. ప్రతిపక్షాలు పోటీకి సంసిద్ధం కాకుండా కుట్ర చేయడం సీఎం కేసీఆర్‌కు మామూలైపోయిందని లక్ష్మణ్ విమర్శించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో కుట్ర చేశారని ఇప్పు డు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంథా అవలంబిస్తున్నారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి టీఆర్ఎస్ పన్నాగం పన్నుతోందని, అందుకే తుది ఓటరు జాబితా రూపొందించకుండా, రిజర్వేషన్లను ఖరారు చేయకుండానే షెడ్యూలు విడుదల చేశారన్నారు. కొన్ని వార్డుల్లో ఎస్సీ ఓటర్ల జాబితాను బీసీ లు, ఓసీలుగా మార్చివేయడంతో ఎస్సీలకు రిజ ర్వ్ కావాల్సిన వార్డులు ఇప్పుడు ఓసీలపరం కానున్నాయని చెప్పారు. ఇదంతా ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ కలిసి నడిపిన అతిపెద్ద కుట్ర అన్నారు. కాగా, శనివారం లక్ష్మణ్ సమక్షంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నేత భాస్కర్ నాయక్‌తో పాటు నాగార్జునసాగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. -
ఫైనాన్స్ కంపెనీ మోసం: 1600 మందికి పైగా డిపాజిటర్లు
సాక్షి, ఏలూరు: పాలకొల్లుకు చెందిన ఫైనాన్స్ కంపెనీ మోసంతో బాధితులు ఘొల్లుమంటున్నారు. పట్టణంలో నాలుగు నెలల క్రితం ఓ రియల్టర్, ఫైనాన్స్ వ్యాపారి సుమారు రూ.130 కోట్లకు బోర్డు తిప్పనున్నాడంటూ పెద్ద ఎత్తున అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాపారి వద్ద నగదు డిపాజిట్ చేసిన వ్యక్తులు సుమారు 1600పైనే ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎవరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఒకవేళ కేసు పెట్టడానికి ముందుకు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలూ వినిపించాయి. ఎట్టకేలకు పాలకొల్లు పట్టణానికి చెందిన మద్దుల వెంకట సుబ్బారావు అనే వ్యక్తి తనకు కోటి రూపాయల వరకూ ఇవ్వాలంటూ కలెక్టర్, ఎస్పీలను కలిసి స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కంపెనీ యజమాని అరెస్టుకు సిద్ధపడ్డారు. పాలకొల్లు పట్టణానికి చెందిన లలితా ఫైనాన్స్ కంపెనీ యజమాని తాళ్లూరి వెంకట సుబ్బారావుకు చెందిన ఆస్తులను అమ్మితే ప్రతి డిపాజిట్‌దారునికి రూపాయికి 65 పైసలు చొప్పున మాత్రమే సరిపోతుందని అతని ఆస్తుల విలువ తెలిసిన వ్యక్తులు అంచనాలు వేసుకుంటున్నారు. కానీ ఇంతలో అతని వద్ద ఓ సెటిల్మెంట్ బ్యాచ్ తయారైంది. సెటిల్మెంట్ బ్యాచ్ అడుగు పెట్టిన తరువాత 65 పైసలు చొప్పున ఇవ్వనవసరం లేదని 35 పైసలు చొప్పున ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో దాదాపుగా ఓ 100 మంది డిపాజిట్‌దారులకు పైన చెప్పిన ప్రకారం సరిపెట్టినట్లు పాలకొల్లులో చర్చ జరుగుతోంది. ఆ 35 పైసలు కూడా ఎలాగంటే లలితా ఫైనాన్స్ వ్యాపారి సుబ్బారావుకు ఒక వ్యక్తి కోటి రూపాయలు అప్పు ఇచ్చి ప్రతి నెలా వడ్డీ తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి వడ్డీ రూపంలో ఇప్పటివరకూ సుమారు రూ.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సెటిల్మెంట్లో ఆ వ్యక్తి 35 పైసలు చొప్పున రూ.35 లక్షలు వస్తుందని ఆశతో వెళ్లాడు. కానీ అక్కడ ఇచ్చిన అప్పు కోటి రూపాయల్లో తీసుకున్న వడ్డీ రూ.50 లక్షలు తగ్గించి మిగిలిన రూ.50 లక్షల్లో 35 పైసలు చొప్పున రూ.17.5లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. ఇలా సుమారు ఓ వంద మందికి సరిపెట్టినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఇదే కోణంలో భీమవరానికి చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు డిపాజిట్ చేసి రూ.కోటిపైనే వడ్డీ తీసుకువెళ్లినట్లు తెలిసింది. అతనికి ఇక ఏమీ ఇచ్చేదిలేదంటూ చేతులెత్తేశారు. ఆ డిపాజిట్‌దారుని కోసం భీమవరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగి సెటిల్మెంట్ బ్యాచ్‌ను ఆశ్రయించారు. అతనికి పైసాకూడా ఇచ్చేదిలేదంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆ మాజీ ఎమ్మెల్యే కనీసం ఆ 35 పైసలు చొప్పునైనా ఇవ్వాలంటూ అడిగినా తాము ఏమి చేయలేమంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. ఆ సెటిల్మెంట్ బ్యాచ్‌కు ఇన్నోవా కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తాళ్లూరి సుబ్బారావు ఇంటిలో పోలీసులు సోదా చేసి అధికారికంగా ఉన్న అకౌంట్ పుస్తకాల ప్రకారం జనాల నుంచి తీసుకున్న అప్పులు రూ.25 కోట్లు, బ్యాంక్ అప్పు రూ.3.30 కోట్లు ఉండగా రూ. 34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలింది. ఇవి కాక బయట పడని బాకీలు సుమారు రూ.100 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. బాధితులు బయటకు రాకపోవడానికి కారణం నల్లధనమేనా? పట్టణంలో కొందరు వ్యాపారులు, వైద్యులు ఈ ఫైనాన్స్ కంపెనీ యజమానికి అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. వీళ్లంతా తమకు డబ్బు ఇవ్వకపోయినా పరవాలేదు తమ పేర్లు మాత్రం దయచేసి బయటపెట్టవద్దని కోరినట్లు సమాచారం. మరి కొందరు తమ సొమ్ము తమకు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు తప్ప బహిరంగంగా అడగలేకపోతున్నారు. బహిరంగం చేస్తే ఆదాయపన్ను శాఖ అధికారులకు లెక్కలు చూపించాలని భయపడుతున్నారు. కొందరు బడా బాబులు తమ సొమ్ములు రికవరీ కోసమే సెటిల్మెంట్ బ్యాచ్‌ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా అప్పు ఇచ్చిన వ్యక్తులకు ఉన్న బాకీలు లెక్కిస్తే పూర్తి మొత్తంలో వడ్డీతో సహా ఇచ్చినా ఇంకా నగదు మిగులుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. చీటింగ్ కేసు నమోదు చేయని పోలీసులు ఆ రియల్టర్ తనను చీటింగ్ చేశాడంటూ పట్టణానికి చెందిన బోడపాటి జోగయ్య అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేయాలని నరసాపురం డీఎస్పీని కలవగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు జోగయ్య తెలిపారు. ఆగస్టు 28న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు గానీ, ఆ రియల్టర్‌ను పిలిచి విచారించినట్లు గానీ ఇంతవరకూ సమాచారం అందించలేదని తెలిసింది. ఓ సినీ నటి ఆగ్రహం? సినీ ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్న ఆ రియల్టర్ ఓ హాస్య నటి నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ సేకరించినట్లు సమాచారం. ఈ రియల్టర్ వద్ద ఆ నటి పెద్దమొత్తంలో డిపాజిట్ చేయడానికి ఓ హాస్య కథానాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిసింది. ఆ హాస్య కథానాయకుడి తాతగారు ఊరు యలమంచిలి మండలం కావడంతో ఆ పరిచయాలతో పెద్దమొత్తంలో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఒక రోజు ఆ రియల్టర్ ఇంటికి వచ్చిన ఆ నటి తీవ్రంగా దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. పాల‘ఘొల్లు’ -
అజయ్ పిరమళ్ చేయి వేస్తే...
ముంబై: అజయ్ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వాటాను రూ.653 కోట్ల లాభంతో రూ.2,305 కోట్లకు అమ్మేశారు. ఒక్కో షేర్‌ను ఎంత ధరకు అమ్మారన్న వివరాలు లభించనప్పటికీ, సగటు విక్రయ ధర రూ.1,000–1,015 రేంజ్లో ఉండొచ్చని సమాచారం. మొత్తం మీ ఈ డీల్‌లో ఆయనకు ఆరేళ్లలో 40 శాతం రాబడులు వచ్చినట్లయింది. అజయ్ పిరమళ్‌కు చెందిన పిరమళ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇతర శ్రీరామ్ గ్రూప్ కంపెనీల్లో కూడా వాటాలున్నాయి. శ్రీరామ్ సిటీ యూనియన్‌లో 10 శాతం, శ్రీరామ్ క్యాపిటల్‌లో 20 శాతం చొప్పున ఆయనకు వాటాలున్నాయి. ఈ వాటాల కోసం ఆయన ఐదేళ్ల క్రితం రూ.4,600 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు వాటా విలువ రూ.9,000 కోట్లకు చేరింది. టెలికం దిగ్గజం వొడాఫోన్‌లో కూడా ఆయన భారీగానే ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలతో బైటపడ్డారు. గత పదేళ్లలో ఆయన పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలో, కొనుగోళ్ల లావాదేవీలో జరిపారు. మెర్క్, ఎలిలిల్లీ, ఫైజర్, అబాట్, బయో–సింటెక్, బేయర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఇంటి దొంగల అరెస్ట్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఇంటి దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇటీవల నాయుడుతోట జంక్షన్ దరి కృష్ణానగర్‌లో ఉన్న నాగార్జున ఫైనాన్స్ కంపెనీలో రూ3.95లక్షలు అపహరించిన ఇద్దరిని నేరవిభాగ పోలీసులు అరెస్ట్ చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కంచరపాలెం నేర విభాగం స్టేషన్లో ఏడీసీపీ సురేష్‌బాబు గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నాగార్జున ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న పోలాకి శ్యామ్‌కుమార్, డ్రైవర్‌గా పని చేస్తున్న జోరేగుల ఫృద్వీరాజ్ కలిసి ఒక పథకం ప్రకారంగా క్యాష్ డర్క్‌లో ఉన్న రూ.3.95లక్షల నగదును గత నెల 27న రాత్రి అపహరించారు. తరువాత కార్యాలయం వెనుక భాగంలో తలుపులు తీసి వదిలేశారు. సీసీటీవీ పని చేయకుండా చేశారు. ఆ రాత్రి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి పెందుర్తి పోలీసులకు సమాచారమిచ్చారు. కార్యాలయం మేనేజర్ వల్లపు చిన్నరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన తీరును గమనించిన క్రైమ్ పోలీసులు క్యాషియర్ శ్యామ్‌కుమార్‌పై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తామే దొంగతనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి రూ.3.95లక్షల నగదు స్వాధీనం చేసున్నారు. ఈ కేసులో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ సంతోష్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్‌హజిలకు నగదు పురస్కారాలు అందించారు. సమావేశంలో ఏసీపీ ప్రభాకర్ బాబు, సీఐ నవీన్‌కుమార్ పాల్గొన్నారు. -
హే.. శ్రీరాం..!
అనంతపురం, కదిరి: కదిరిలో శ్రీరాం ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీ కార్యాలయానికి శుక్రవారం ఓ బాధితుడు తాళం వేశాడు. సిబ్బందిని లోనికి వెళ్లనీకుండా అక్కడే నిరసనకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పి తాళం తీయించారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎంజీ రోడ్లో కాపురముంటున్న బంగారు నగల వ్యాపారి శంకరాచారి తన అవసర నిమిత్తం ఇంటిని తాకట్టు పెట్టి మూడేళ్ల క్రితం రూ.45 లక్షలు శ్రీరాం ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా కంతులు చెల్లించుకుంటూ వచ్చాడు. చివర్లో రూ.4లక్షలు చెల్లించాల్సి ఉండగా కాస్త ఆలస్యమైనందుకు ఫైనాన్స్ కంపెనీ వారు దానికి అదనపు వడ్డీ వేశారు. సకాలంలో చెల్లించలేదని చివరకు ఆ ఇంటిని వేలం వేస్తున్నామంటూ పట్టణంలో దండోరా కూడా వేయించారు. అవమానభారంతో బాధితుడు రూ.కోటి విలువ చేసే ఇంటిని సగం ధరకే అమ్మేసి ఫైనాన్స్ కంపెనీలో అప్పులేదనిపించుకున్నాడు. పత్రాల కోసం పడిగాపులు అప్పు మొత్తం చెల్లించానని, ఇక తాను తాకట్టు పెట్టిన ఇంటి ఒరినల్ పత్రాలు ఇవ్వాలని బాధితుడు సదరు కంపెనీ మేనేజర్ ప్రసాద్‌ను అడిగారు. పత్రాలు చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి పంపామని, త్వరలోనే తెప్పించి ఇస్తామని చెప్పడంతో ఆయన కొద్ది రోజులు ఓపిక పట్టాడు. తర్వాత ప్రతి రోజూ సదరు కార్యాలయానికి వెళ్లడం, పత్రాలు ఇవ్వండయ్యా.. అని ప్రాధేయ పడటం ఇలా 8 నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. అయినా వారిలో చలనం రాలేదు. చేసేది లేక నాలుగు నెలల క్రితం పట్టణ పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన అన్యాయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల నుంచి ఆయనకు సరైన న్యాయం జరగలేదు. తాళంతో కొలిక్కి వచ్చిన సమస్య అప్పు చెల్లించి ఎనిమిది నెలలైనా తన పత్రాలు ఇవ్వలేదని, పోలీసులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదన్న బాధతో బాధితుడు శంకరాచారి శ్రీరాం ఫైనాన్స్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగాడు. ఉదయం పది గంటలకు సిబ్బంది తాళం తీయాలని చెబితే తన పత్రాలు ఇస్తేగానీ తాళం తీసేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. ఆయనకు మిత్రులు కొందరు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆయనకు నచ్చజెప్పి ఎలాగో తాళం తీయించి సిబ్బందిని లోనికి వెళ్లేలా చేశారు. తన సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని మేనేజర్ చాంబర్లో కూర్చున్నాడు. చివరకు పట్టణ ఎస్ఐ ఖాజాహుస్సేన్ అక్కడికి చేరుకుని బాధితుడితో పాటు శ్రీరాం ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 15 రోజుల్లో అతని ఒరిజినల్ ఇంటి పత్రాలు తెప్పించి ఇస్తామని శ్రీరాం ఫైనాన్స్ అధికారులు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కంతులు జాప్యంతోనే సమస్య శ్రీరాం ఫైనాన్స్‌లో రుణం తీసుకున్న శంకరాచారి సకాలంలో కంతులు చెల్లించలేదు. రూ.4లక్షలు పెండింగ్ పెట్టాడు. పెద్దమనుషుల ఒప్పందంతో చివరకు సెటిల్ చేశాడు. అయితే మిగిలిపోయిన రూ.4లక్షలు కంప్యూటర్లో అపరాధ రుసుంతో కలిపి రూ.12 లక్షలు చూపుతోంది. అది సెటిల్ చేయిస్తే గానీ ఇచ్చేది లేదని పై అధికారులు చెబుతున్నారు. అందుకే పత్రాలు ఇవ్వడంలో జాప్యమైంది. త్వరలోనే తెప్పించి ఇచ్చేస్తాం.– ప్రసాద్, శ్రీరాంఫైనాన్స్ మేనేజర్ -
భద్రత పెరుమాళ్లకెరుక..!
‘‘ చిత్తూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఒకే వ్యక్తి 90కు పైగా ఖాతాల్లో బంగారు ఆభరణాలు కుదువపెట్టడం ఈ మధ్యకాలంలో పత్రికల్లో చదివే ఉంటారు. చుట్టుపక్కల ఉన్నవారి ఆభరణాలన్నీ ప్రైవేటు సంస్థలో కుదువపెట్టి డబ్బులు కాజేయడం, అడిగిన వారిని రౌడీలతో బెదిరించడం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తే కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అరెస్టు చేశారు.’’ ‘‘ రెండు నెలల క్రితం 5.25 కిలోల బంగారు ఆభరణాలను బెంగళూరులోని ఓ దుకాణంలో డెలివరీ ఇవ్వడానికి విశాఖ నుంచి ఇద్దరు వ్యక్తులు బస్సులో బయలుదేరారు. అదే బస్సులోనే ప్రయాణికుల అవతారంలో ఉన్న వ్యక్తులు బంగారుపాళ్యం వద్ద రూ.1.62 కోట్ల విలువ చేసే ఆభరణాలు కొట్టేశారు. తరువాత దొంగలను, ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇంతటి విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టుకోకపోవడం దుకాణ యజమాని నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది.’’ చిత్తూరు అర్బన్ : బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థలు.. బంగారు ఆభరణాలు సరఫరా చేస్తే సంస్థలు.. వీటి లావాదేవీలు రూ.కోట్లలో జరుగుతుంటాయి. అయితే డబ్బులకు, సొమ్ములకు బాధ్యత వహించాల్సిన ఉద్యోగులే చాలాచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివిధ అవసరాలకు ప్రజలు కుదువ పెట్టిన నగలకు భద్రత కొరవడుతోంది. జిల్లాలోని పలు జాతీయ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలో గత రెండేళ్ల కాలంలో పలు ఉదంతాలు బయటపడ్డాయి. సాక్షాత్తు వీటిల్లో పనిచేసే సిబ్బంది తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, అప్పులు పెరగడంతో ఈ పనికి పాల్పడుతున్నారు. అంతర్గతంగా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని విచ్చలవిడిగా రుణాలు ఇస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని ఫైనాన్స్ కంపెనీలో వెలుగు చూసిన నకిలీ బంగారం ఉదంతమే ఇందుకు నిదర్శనం. రోల్డ్‌గోల్డ్ నగలను తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. నిబంధనలు తూచ్.. ♦ చాలా బ్యాంకు శాఖల్లో నగదులో కొంత మొత్తాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. తర్వాత ఎప్పుడో వారం, పది రోజులకు మళ్లీ తెచ్చి జమ చేస్తున్నారు. బ్యాంకు నగదును సొంత అవసరాలకు వినియోగించకూడదు. దీన్ని కొన్ని శాఖల్లో పట్టించుకోవడం లేదు. బ్యాంకు ప్రారంభ సమయంలో ఉన్న నగదు మూసే సమయానికి సరిపోవాలి. అయినా పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరిగితే ఇటువంటి చోటుచేసుకోవు. ♦ నగలను తాకట్టు పెట్టుకొని రుణం ఇచ్చే సమయంలోనూ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. 14 క్యారెట్ నగలను 22 క్యారెట్‌గా చూపిస్తూ రుణాలు ఇచ్చేస్తున్నారు. నగల స్వచ్ఛతను పరిశీలించే అప్రైజర్లను పొరుగుసేవల పద్ధతిలో పెట్టుకుంటున్నాయి. దీనివల్ల వారిలో బాధ్యత ఉండడం లేదు. అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలు తేలికగా మంజూరవుతున్నాయి. ♦ కొన్ని ప్రైవేటు బ్యాంకులైతే వ్యాపారుల పాలిట ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు తిరోదకాలు ఇస్తున్నాయి. చెక్కుల మంజూరులో ఈ వైఖరి ప్రదర్శిస్తున్నాయి. చెక్కు భౌతికంగా ఇవ్వకుండా కేవలం దాని నంబరును చెప్పినా సంబంధిత మేనేజరు ఆమోదిస్తున్నారు. ఆనక వాటిని తెప్పించుకుంటున్నారు. లాకర్ల నిర్వహణలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఇక్కడ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదు. తూతూ మంత్రంగా పెట్టి వదిలేస్తున్నారు. కీలకమైన ఈ విభాగం భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ♦ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను ఎప్పటికప్పుడు చూడడం లేదు. దీనివల్ల మొగ్గలోనే మోసాన్ని అరికట్టే అవకాశాన్ని కోల్పోతున్నారు. లాకర్ల వద్ద ఉంటున్న రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. సీసీ కెమెరాలు పెడితే ఖాతాదారులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. దొంగిలించిన బంగారాన్ని కూడా వీటిల్లో తాకట్టు పెడుతున్నారు. కనీసం విచారించడం లేదు. దీంతో ఇటీవల నగర పోలీసులు ప్రైవేటు సంస్థల కార్యకలాపాలపై దృష్టి సారించాయి. ఈ లోపాలను సవరించి పర్యవేక్షణ పెంచితేనే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. కనీస భద్రత చర్యలు పాటించాలి.. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ అనేది కనీస భద్రత చర్యల్లో భాగం. ఇక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ప్రతీ బ్యాంకులో పెట్టుకోమని చెబుతున్నాం. గతంలో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, బంగారు ఆభరణాల దుకాణాల నిర్వాహకులతో సెక్యూరిటీ ఆడిట్ సమావేశాలు పెట్టాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పాం. ప్రతి సంస్థ సొంతంగా కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే నేరం జరగకుండా ముందస్తుగా నివారించవచ్చు. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ, చిత్తూరు -
పరారైన ఫైనాన్స్ వ్యాపారి అరెస్టు
ఒంగోలు: డిపాజిటర్లు, భాగస్తులను మోసం చేసి పరారైన గణేష్ ఫైనాన్స్ అండ్ ఆటో ఫైనాన్స్ సంస్థ వర్కింగ్ పార్టనర్ కందిమళ్ల రామాంజనేయులును సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సుజాతనగర్‌లోని ఆయన నివాసం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునట్లు ఒంగోలు డీఎస్పీ తాళ్లూరి రాథేష్ మురళి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కందిమళ్ల రామాంజనేయులు, మరో 8 మంది కలిసి గణేష్ ఫైనాన్స్ అండ్ ఆటోఫైనాన్స్ను 1992లో ప్రారంభించారు. వర్కింగ్ పార్టనర్‌గా వ్యవహరించే రామాంజనేయులు భాగస్తులను మోసం చేసి రూ. 44 లక్షలు స్వాహా చేశాడని, అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసూ ఒంగోలు, చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను నమ్మించి భారీగా డిపాజిట్ల రూపంలో అధికవడ్డీ, లాభాల్లో వాటా కూడా ఇస్తానని నమ్మించి మోసం చేశాడన్నారు. ఇప్పటివరకు 250 మంది నుంచి మొత్తం రూ. 28 కోట్ల మేర మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ చెప్పారు. లుక్ అవుట్ నోటీసులు జారీ: స్థానిక సుజాతనగర్లో నివాసం ఉంటున్న కందిమళ్ల రామాంజనేయులు స్వగ్రామం మద్దిపాడు మండలం బసవన్నపాలెం. 2017లో చీటింగ్ చేసి అమెరికా పారిపోవడంతో అనేకమంది తమకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీ సత్య యేసుబాబు దృష్టికి తెచ్చారు. దీంతో తాలూకా పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కందిమళ్ల రామాంజనేయులు కోసం అన్ని ఎయిర్‌పోర్టులకు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలో వీసా రెన్యూవల్ కోసం హైదరాబాద్ చేరుకున్న నిందితుడు తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఒంగోలుకు చేరుకోగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈమేరకు తమకు 250 మంది నుంచి మోసపోయినట్లు ఫిర్యాదులు అందాయని దీనిపై మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రూ. 22 కోట్ల మేర ఆస్తులు గుర్తింపు: కందిమళ్ల రామాంజనేయులును అరెస్టు చేసిన అనంతరం 1992 తరువాత ఆయన సంపాదించిన ఆస్తులపై దృష్టిసారించామన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా రామాంజనేయులు, అతని కుటుంబసభ్యుల పేర్ల మీద ఉన్న స్థిరాస్తులను గుర్తించామన్నారు. ఒంగోలు సీతారామపురం, మార్కాపురం, వెంగముక్కలపాలెం, కొత్తమామిడిపాలెం, కర్నూల్ రోడ్డు, సమతానగర్, మంగమూరు డొంక, హైదరాబాద్ వంటి పలుచోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైందన్నారు. వీటిలో వ్యవసాయ భూములతోపాటు ఇళ్లస్థలాలు కూడా ఉన్నాయని వీటి విలువ ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ. 24 కోట్లు ఉంటుందన్నారు. ఇక ప్రైవేటు మార్కెట్ విలువ ఇంకా చాలా భారీగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా రామాంజనేయులు వద్ద రూ. 4,30,70,000లు, ఆయన భార్య శ్రీదేవి పేరున రూ. 16,62,00,000లు , కందిమళ్ల అలియాస్ పుట్టె జ్యోత్స్న (పెద్దకుమార్తె) పేరుమీద రూ. 1.40 లక్షలు, కందిమళ్ల అలియాస్ పచ్చవ ప్రవీణ (చిన్న కుమార్తె) పేరుమీద రూ. 1.50 లక్షలు, పుట్టా సుధాకర్‌బాబు (పెద్ద అల్లుడు) పేరుమీద రూ. 1,47,500లు ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. తాము గుర్తించిన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నామని, న్యాయస్థానంలో నిందితుడైన రామాంజనేయులు తన, తన కుటుంబ సభ్యుల పేర్లమీద 1992 తరువాత గుర్తించిన ఆస్తుల వివరాలను ఎలా కొనుగోలుచేసింది, అందుకు అవసరమైన మొత్తం ఏ రూపంలో ఆయనకు లభించిందనే వివరాలను కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం కోర్టులో వెలువడే తీర్పు ప్రకారం స్థిరాస్తులను వేలం వేసి బాధితులు అందరికీ న్యాయం చేసేందుకు అవకాశం కలుగుతుందని డీఎస్పీ రాథేష్ మురళి పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వారు కూడా తగు ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
ఐఎఫ్సీఐ రుణ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ఫైనాన్స్ సంస్థ- ఐఎఫ్సీఐ మూడు నెలల కాలానికి సంబంధించి రుణ రేటును సోమవారం 80 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుత 9.30% నుంచి 8.50%కి తగ్గినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచే తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందనీ వివరించింది. బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవల ఆర్బీఐ పావుశాతం (6.25%కి) తగ్గిం చింది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు, ఫైనా న్స్ సంస్థలు తమ రుణ రేట్లను తగ్గిస్తున్నాయి.