ఫైనాన్స్‌ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య  | Man Suicide Due To Finance Harassment In Rangareddy District | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య 

Published Wed, Oct 26 2022 2:08 AM | Last Updated on Wed, Oct 26 2022 2:08 AM

Man Suicide Due To Finance Harassment In Rangareddy District - Sakshi

అశోక్‌ (ఫైల్‌)  

మొయినాబాద్‌: ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మొయినాబాద్‌ మండలం అమ్డాపూర్‌వాసి మద్యపాగ అశోక్‌ (25) కొంతకాలం కిందట ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు.

ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ ప్రతినిధులు వేధించసాగారు. మనస్తాపం చెందిన అశోక్‌.. దీపావళి రోజున రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు ఇంట్లో చూసేసరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement