Hyderabad: మహిళకు ఫైనాన్స్‌ సంస్థ వేధింపులు.. సుసైడ్‌ నోట్‌ రాసి.. | Woman Commits Suicide Due To Finance Company Harassment At Medchal | Sakshi
Sakshi News home page

Hyderabad: ఫైనాన్స్‌ సంస్థ వేధింపులు.. సుసైడ్‌ నోట్‌ రాసి మహిళ ఆత్మహత్య

Published Sat, Aug 27 2022 3:20 PM | Last Updated on Sat, Aug 27 2022 5:23 PM

Woman Commits Suicide Due To Finance Company Harassment At Medchal - Sakshi

సునీత (ఫైల్‌)  

సాక్షి, హైదరాబాద్‌: ఫైనాన్స్‌ సంస్థ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజబొల్లారం తండాకు చెందిన సునీత(35) గత కొంత కాలంగా కూతురుతో కలిసి మేడ్చల్‌ పట్టణంలోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో నివాసం ఉంటూ  అలియాబాద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద  బైక్‌జోన్‌ నిర్వహిస్తుంది. వ్యాపార నిర్వహణకు ఇన్‌స్టా ఫండ్‌ ఫైనాన్స్‌ సంస్థలో రుణం తీసుకుంది.

అయితే కొన్ని నెలలుగా ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపానికి లోనైంది. శుక్రవారం ఉదయం కుమార్తెను పాఠశాలకు పంపిన తర్వాత తన ఆత్మహత్యకు ఇన్‌స్టా ఫండ్‌ ఫైనాన్స్‌ వారి వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: పింఛన్‌ కోసం వెళ్తే చనిపోయావన్నారు

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement