
ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో చోరీ
నెల్లూరు(క్రైమ్): ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో దుండగులు చొరబడి రూ.7.15 లక్షలు అపహరించిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసిం ది. పోలీసుల కథనం మేరకు.. హిందూ జా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని నెల్లూరులోని ఆచారి వీధిలో ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. నెల్లూరుకే చెందిన ఎం.మహేష్ బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. శనివారం బ్యాంకు సమయం మించిపోవడంతో కంపెనీకి సంబంధించిన రూ.7.15 లక్షల నగదును కార్యాలయంలోని లాకరులోనే ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో కార్యాలయం తెరవలేదు.
సోమవారం సెలవు అయినప్పటికీ మహేష్‌తో పాటు పలువురు సిబ్బంది వచ్చి సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం తాళం వేసుకుని వెళ్లారు. ఈ క్రమం లో గుర్తుతెలియని వ్యక్తులు లోనికి చొరబడి లాకర్ పగలగొట్టడంతో పాటు అందులోని నగదు అపహరించారు. వేలి ముద్రలు పడకుండా, డాగ్‌స్క్వాడ్‌కు సైతం ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో ఘటనా స్థలంలో మిరప్పొడి చలి ఉడాయించారు.
మంగళవా రం ఉదయం 9.30 గం టలకు మహేష్ కార్యాలయం తలుపు తెరవగా లోపలంతా మిరప్పొడి చల్లివుండటంతో పాటు దక్షిణ భాగంలోని తలు పు తెరిచి కనిపించింది. లాకర్ సైతం పగలగొట్టి ఉండటం గుర్తించి వెంటనే ఒకటో నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘట నా స్థలాన్ని నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్, సీసీఎస్ డీఎస్పీ శ్రీధర్, ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ బాజీజాన్‌సైదా, ఒకటోనగర ఎస్‌ఐ కె. రామకృష్ణ పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కంపెనీ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.
అనుమానాలెన్నో..
చోరీ జరిగిన తీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మహేష్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు ఘటన జరిగిన తీరుకు పొంతన కుదరడం లేదు. దక్షిణం వైపు తలుపు తెరిచివుందని మహేష్ చెబుతుండగా ఆ వైపు నుంచి దుండగులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కార్యాలయం మూడో అంతస్తులో ఉండ టం, దక్షిణం వైపు కరెంట్ తీగలు ఉండటంతో అటువైపు నుంచి దొంగలు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
నేరుగా తలుపులు తెరిచే లోనికి ప్రవేశించి, తిరిగే వెళ్లే సమయంలో తాళాలు వేసుకుని వెళ్లి ఉంటారని పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపట్టారు. కార్యాలయానికి సంబంధించిన తాళాలు రెండు సెట్లు ఉండగా ఒక సెట్‌ను ఆఫీస్‌బాయి చంద్ర కొన్ని నెలల కిందట పోగొట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో చంద్రను సైతం విచారిస్తున్నారు.