thugs
-
దొంగలొస్తే.. దొరకబుచ్చుకుని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు.. మాస్్క, హెల్మెట్ పెట్టుకుని.. బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో పనిచేసిన వ్యక్తే.. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
మున్నూరు రవిపై దాడి చేసిన దుండగులు
-
మైత్రి మూవీస్ చేతికి కోనసీమ థగ్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. కాగా ‘థగ్స్’ తెలుగు వెర్షన్ ‘కోనసీమ థగ్స్’ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ పంపిణీ చేయనుంది. -
మహంకాళి వస్తోందయ్యా...
ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా గోపాల్ డైరెక్షన్లో రూపొం దినపాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో స్టూడియోస్‌తో కలిసి శిబు నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో విడుదలకానుంది. శామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా...’ అంటూ సాగే ఈపాటని విడుదల చేశారు. వనమాలి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని కాలభైరవపాడారు. -
దుమ్మురేపుతున్న ఇంటెన్స్ రా యాక్షన్ కోనసీమ థగ్స్ ట్రైలర్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈమధ్యే విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తిసురేష్‌లో గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
ఆకట్టుకుంటున్న'థగ్స్' క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘థగ్స్'. పులి, ఇంకొకడు, సామి 2 తో పాటు పలు హిందీ చిత్రాలను నిర్మించిన షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ అంతోనీ ఎడిటర్ గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్ గా థగ్స్ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ను చెన్నై లో ఆర్య, భగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళా మాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో భారీ వేడుకలో విడుదల చేశారు. అందరూ థగ్స్ భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్యారక్టర్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్ గా విడుదల అయిన ఈ వీడియో లో సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. 'మాస్టర్ మైండ్' సేతు గా హృదు, 'రోగ్' దురై గా సింహ, 'బ్రూట్' ఆరాకియా దాస్ గా ఆర్ కె సురేష్, 'క్రుకెడ్' మరుదు గా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. వీడియో ఆద్యంతం శామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి వీడియో బైట్ లో హీరో హృదు కి, దర్శకురాలు బృంద కి తన బెస్ట్ విషెస్ చెబుతూ థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నవంబర్ లో థియోటర్స్ లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
‘ఆమె కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్’
ప్రముఖ నృత్య దర్శకురాలుగా రాణిస్తున్న బృంద మాస్టర్ ఇటీవలే మెగాఫోన్ పట్టి హే సినామికా అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, నటి ఇలా, అతిథి రావ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంతో బృందా మాస్టర్ దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈమె కుమరి మావట్టత్తిన్ దగ్స్ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆమె తొలి చిత్రానికి పూర్తిగా భిన్నమైన కథ, కథనాలతో ఉండటం విశేషం. కమర్షియల్ అంశాలతో కూడిన పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్రాన్ని బృందా మాస్టర్ తెరకెక్కించారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హ్రిదు హారన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందే బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాగా నటి అన స్వరాజన్, సింహ, ఆర్కే సురేష్, మునీశ్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సేమ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్‌తో పాటు నటి కుష్భు, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌతమ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి కుష్బు మాట్లాడుతూ బృంద తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆమె చూడ్డానికి కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్‌గా ఉంటారని పేర్కొన్నారు. అలాంటి ఆమె యాక్షన్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని చేయడంలో ఆశ్చర్య పడాల్సిన పని లేదన్నారు. ఈ చిత్రాన్ని తాను చశానని కచ్చితంగా ఇది సంచలన విజయం సాధిస్తుందని అన్నారు. త్వరలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి నవంబర్ నెలలో చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ
సాక్షి ముంబై: పుణే జిల్లాలో ఓ ఏటీఎంను కొందరు దుండగులు పేల్చేశారు. అందులోని సుమారు రూ.28 లక్షలు చోరీ చేశారు. స్థానికంగా తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన వివరాలిలాఉన్నాయి.. పుణే జిల్లా చాకణ్ మహాలుంగే భాంబోలి ప్రధాన కుడలిలో హిటాచి కంపెనీ ఏటీఎం ఉంది. ప్రధాన పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ ఏటీఎంను బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కొందరు దుండగులు పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వసం చేశారు. అందులోని సుమారు 28 లక్షల రూపాయలు దొంగిలించి పరారయ్యారు. ఈ తరహాలో ఏటీఎం చోరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు కోసం వినియోగించిన పదార్థాలను నక్సలైటులు ఎక్కువగా వినియోగిస్తుంటారని ప్రాథమికం గా భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. -
28 రోజుల తర్వాత.. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి
సంతబొమ్మాళి: పొట్టకూటి కోసం లిబియా దేశానికి వెళ్లి అదృశ్యమైపోయిన శ్రీకాకుళం యువకులు ఎట్టకేలకు 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి బయటపడ్డారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో వారు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియాకు వెళ్లారు. కొంతకాలం పాటు అక్కడి ఓ కంపెనీలో పనిచేశారు. గత నెలలో తిరిగి ఇండియా వచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. 14వ తేదీన తమ కంపెనీ ఏర్పాటు చేసిన వాహనంలో త్రిపాలి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. మార్గం మధ్యలో కొందరు దుండగులు వీరి వాహనాన్ని ఆపి కిడ్నాప్ చేశారు. మూడు రోజుల తర్వాత దుండగులు వీరిని మరో గ్యాంగ్‌కు అప్పగించారు. ఆ గ్యాంగ్ సభ్యులు తాము కిడ్నాప్ చేసిన వారిని విడిచిపెట్టాలంటే 20 వేల డాలర్లు చెల్లించాలని కంపెనీ ప్రతినిధుల్ని డిమాండ్ చేశారు. అయితే వారు తర్జనభర్జనల్లో మునిగిపోయారు. ఈ సమాచారం తెలిసిన బాధితుల కుటుంబసభ్యులు డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి సీదిరి అప్పలరాజు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇండియన్ ఎంబసీని సంప్రదించి త్వరగా బాధితులను కిడ్నాపర్ల నుంచి విడిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ ఆ సొమ్మును చెల్లించడంతో సీతానగరం యువకులతో పాటు యూపీకి చెందిన ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో ఉన్న వారంతా త్వరలో స్వదేశానికి రానున్నారు. శ్రీకాకుళం యువకుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సత్వరం స్పందించి తమ పిల్లల గురించి వాకబు చేసి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
పగలు ప్లాన్.. రాత్రి దోపిడీ
సాక్షి, నిజామాబాద్: మళ్లీ దుండగుల అలజడి పెరిగింది. వరుసగా చోరీలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏదో ఒక చో ట చోరీలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో దుండగులు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే పదిలోపు చోరీలు జరిగాయంటే పరిస్థి తి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నా రు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకా శం ఉండడంతో అవగాహన, ప్రచారం కల్పించాల్సిన పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండ డంతో చోరీల నియంత్రణ ఇబ్బందిగా మారింది. ప్రణాళికతోనే చోరీలు... నాలుగు రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఓ పైనాన్స్‌లో దుండగులు పడి లాకర్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ పుటేజీలను సైతం తీసుకెళ్లారు. షెట్టర్ పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ ప్రధాన రహదారిపైనే ఈ చోరీ జరిగింది. మరో మూడు రోజుల్లోనే ఇదే ప్రధాన రహదారిపై ఉన్న ఓ గ్లాస్ ఎంపోరియం షెట్టర్ పగులగొట్టి చోరీ చేశారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్టలో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. 6వ పోలీసుస్టేషన్ పరిధిలో మరో చోరీ జరిగింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలోనే ఈ చోరీలు అవుతున్నాయి. మహారాష్ట్ర ముఠాకు చెందిన దుండగులు ఈ అలజడి సృష్టిస్తున్నట్లు పోలీసులు విచారిస్తున్నారు. గతంలో అపార్ట్మెంట్లతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మూటలు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గత వారం రోజుల కింద బాల్కొండ, ముప్కాల్ కేంద్రాల్లో షెట్టర్ పగులగొట్టి చోరీలు జరుగగా ఇటీవలే అరెస్టు చేశారు. అయినా చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆర్మూర్‌లో మహారాష్ట్రకు చెందిన దుండగుల ముఠా వరుసగా రెండు రోజులపాటు దోపిడీ చేసింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఇరిగేషన్ కార్యాలయంలో ఒక కారును అపహరించారు. మహారాష్ట్రకు చెందిన ఈ దుండగులు జిల్లాలో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెక్కి నిర్వహిస్తున్నారు. రాత్రివేళ అనుకూలమైన ప్రాంతాల్లో దోపిడీలు చేసేస్తున్నారు. నవీపేట, బోధన్ ప్రాంతాల్లో ఇటీవల చోరీలు పెరిగాయి. జిల్లా కేంద్రంలో చోరీ చేసి పారిపోతూ నవీపేట, బోధన్ ప్రాంతాల్లో అందిన కాడికి దోచుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఫైనాన్స్ దుండగులు .. వారం రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఫైనాన్స్‌లో చోరీ చేసిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన సాగర్సింగ్ను పోలీసులు విచారించగా ఇతడి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించగా అక్కడ ఈ ముఠాకు సంబం«ధించి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వారికోసం అక్కడి పోలీసులు వేట సాగిస్తున్నారు. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో పగటిపూట జరిగిన గత మూడేళ్లలో పరిశీలిస్తే 2015లో 27, 2016లో 33, 2017లో 34, 2018లో 42 నమోదయ్యాయి. రాత్రిపూట జరిగిన చోరీలను పరిశీలిస్తే 2015లో 221, 2016–218, 2017–192, 2018లో 206 చోరీలు జరిగాయి. ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో పెట్రోలింగ్ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోతున్నారు. త్వరలోనే పట్టుకుంటాం.. ఇటీవల జిల్లా కేంద్రంలో చోరీలకు పాల్పడిన ముఠాలను గుర్తిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. కఠిన చర్యలు తప్పవు. చోరీల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. మహారాష్ట్రకు చెందిన ముఠాలు జిల్లా కేంద్రానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ. -
ఒంటిపై ఉన్న బంగారం కోసం హత్యలు..
సాక్షి, నెల్లూరు : మహిళల ఒంటిపై ఉన్న బంగారం కోసం దుండగులు దారుణానికి పాల్పడుతున్నారు. జిల్లాలోని రెండు వేరు వేరు చోట్ల ఓకే తరహాలో ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. సోమవారం కుసుమూరులో దుండగులు గుంజి రమణమ్మ(45)అనే మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో శేషమ్మ(45) అనే మహిళను ఆత్మకూరు సమీపంలోని ఆనంతరాయని వద్ద కత్తులతో పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం మహిళలపై దారుణాలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
ప్రేమజంటను చితకబాదిన దుండగుల ముఠా
-
మహిళని హత్యచేసి తగలబెట్టిన దుండగులు
-
ప్రేమ జంటపై దుండగులు దాడి
-
గుప్త నిధుల కోసం శివాలయం ధ్వంసం
కర్నూలు, బూడిదపాడు(గూడూరు): మండలం పరిధిలోని పాత బూడిదపాడులో ఉన్న పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం గురువారం రాత్రి దుండగలు విఫలయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. కొంతమంది దుండగులు పాత బూడిదపాడులోని శివాలయం గర్భగుడి తలుపులు తొలగించి లోపల శివలింగాన్ని, పాశాన్ని గడ్డపారలతో పెకిలించారు. అనంతరం తవ్వకాలకు వీలుపడకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం పూజారి తిమ్మరాజు ఆలయానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి నిధులు చోరీకి గురికాలేదని వివరించారు. -
హత్య చేసి, చెట్టుకు వేలాడదీశారు..
సాక్షి, ప్రకాశం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాలివి.. జిల్లాలోని పొన్నలురు చెరువులో దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అడ్రస్ అడిగే నెపంతో చైన్‌స్నాచింగ్
బనశంకరి: అడ్రస్ అడిగే నెపంతో దుండగులు ఓ మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... మరియప్పనపాళ్య నివాసి హంసవేణి శుక్రవారం ఉదయం తన ఇంటిలోని చెత్తను బీబీఎంపీకి చెందిన వాహనంలో వేసి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ చీటీ చూపి చిరునామా అడుగుతూ ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు చైన్ లాక్కెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
డ్రైవర్‌ను కొట్టి.. రూ. 4 కోట్ల సిగరేట్లు దోపిడీ
హైదరాబాద్: నగర శివారులో బారీ దోపిడీ జరిగింది. రూ. 4 కోట్ల విలువైన సిగరెట్లతో వెళ్తున్న కంటైనర్‌ను కొందరు దుండగులు అడ్డుకున్నారు. డ్రైవర్‌ను చితకబాది తమతో పాటు తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను నింపుకొని పరారయ్యారు. వివరాలీవి.. ముషీరాబాద్ నుంచి తిరుపతికి సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను పెద్ద అంబర్పేట్ వద్దకు రాగానే దుండగులు రెండు సుమోలతో అడ్డగించారు. మల్కాపూర్ శివారులో డ్రైవర్‌ను కిందకు దించి ఓ సుమోలో ఎక్కించుకొని వెళ్లి అడవిలో వదిలేసి వచ్చారు. అనంతరం తమతో తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను లోడ్ చేసుకుని పరారయ్యారు. ఈ దోపిడీలో సుమారు 20 మంది దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ చొట్టుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. -
కనిపించని నాలుగో సింహం
♦ రాజధానిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం ♦ దుండగులు, ఉగ్రవాదులను అడ్డుకునే నైపుణ్యం కరువు ♦ కొరవడిన ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ దర్జాగా రావొచ్చు... ఆయుధాలతో విధ్వంసం సృష్టించొచ్చు... కావాల్సినంత దోచుకోవచ్చు... ఎంచక్కా నగరం నుంచి జారుకోవచ్చు... పోలీసులు అడ్డుకోలేరు... సమాచారం ఇచ్చినా పట్టకోలేరు. కళ్లముందే పారిపోతున్నా కట్డడి చేయనూలేరు. ఇదీ అమరావతిలో ఖాకీల దుస్థితి. బెజవాడలో బంగారు ఆభరణాల కార్ఖానాపై దాడి ఉదంతం భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధానిలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా భారీ దోపిడీ జరిగితే వెంటనే స్పందించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా లేదు. ఇందుకు మంగళవారం రాత్రి విజయవాడ గోపాలరెడ్డి రోడ్డులో జరిగిన భారీ దోపిడీ నిదర్శనమనే వాదన వినిపిస్తోంది. పోలీసులు కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసుల నమోదుకు మాత్రమే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా కనీసం నాకాబందీ కూడా నిర్వహించడంలేదు. దీంతో నేరస్తులు నిర్భయంగా తమ పని పూర్తి చేసుకుని సులభంగా నగరం దాటి వెళ్లిపోతున్నారు. నలువైపుల నుంచి నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మార్గాలు ఉండటం, ఎక్కడా పెద్దగా నిఘా లేకపోవడం నేరస్తులకు కలిసివస్తోంది. మన పోలీసుల వైఫల్యం ఇలా... ♦ మంగళవారం రాత్రి 9.50గంటలు : అంతర్రాష్ట దొంగల ముఠా విజయవాడలో నగల కార్ఖానాపై దోపిడీ చేసి అక్కడి నుంచి జారుకుంది. ♦ రాత్రి 10గంటలు : ఓ వ్యక్తి నేరుగా పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం చేరింది. ఆయన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారు. కానీ, నగర సరిహద్దులను వెంటనే దిగ్బంధించలేకపోయారు. ♦ రాత్రి 10.10గంటలు : దోపిడీ ముఠా ఎంచక్కా వారధి దాటింది. అక్కడికి కొద్దిదూరంలోనే డీజీపీ కార్యాలయం, మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కేంద్రంలో పోలీసు బలగాలు ఉన్నాయి. వారూ దోపిడీ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ♦ రాత్రి 10.24 గంటలు : దోపిడీ ముఠా జాతీయ రహదారి మీద ఉన్న కాజా టోల్‌గేట్‌ను దాటింది. అక్కడ కూడా ఆ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించనే లేదు. ♦ రాత్రి 10.40 గంటలు : దోపిడీ ముఠా గుంటూరు నగరంలోని కింగ్ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఎస్ఐ, నలుగురైదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. కానీ దోపిడీ దొంగలు తమ వాహనాన్ని ఆపకుండా అతి వేగంగా దూసుకుపోయారు. పోలీసులు అడ్డుకోలేకపోయారు. ♦ రాత్రి 10.50గంటలు : గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఒక ఎస్ఐ, ఐదారుగురు పోలీసులు మాత్రమే కాపు కాశారు. ముఠా జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్లు గుర్తించి అర్బన్ ఎస్పీకి సమాచారం అందించారు. ♦ రాత్రి 11.10 గంటలు : చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్దకు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో చేరుకున్నారు. జాతీ య రహదారిని దిగ్బంధించి వాహనాలను తనిఖీ చేయసాగారు. ఇలా తప్పించుకున్నారు.. చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్ద ఎక్కడ రోడ్డు బ్లాక్ చేశారో పోలీసులు అంతా అక్కడే ఉండిపోయారు. దీంతో వాహనాలు తనిఖీ చేస్తున్నారని అక్కడికి అర కిలోమీటరు దూరం నుంచే దొంగలు గుర్తించారు. తమ వాహనాన్ని అక్కడే వదిలేసి బంగారం, నగదు తీసుకుని పొలాల్లోకి పరుగుపెట్టారు. అదే పోలీసు అధికారులు కేవలం రోడ్డు బ్లాక్ చేసిన చోట మాత్రమే కాకుండా ఒక కిలో మీటరు ముందు వరకు కూడా సాయుధులైన పోలీసులను మోహరించి ఉంటే దొంగలకు ఆ అవకాశం ఉండేది కాదు. నిద్దరోతున్న భద్రతా వ్యవస్థ రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ–గుంటూరులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రాత్రివేళల్లో గస్తీ అన్నదే లేకుండాపోయింది. అందుకు తగిన వాహనాలు కావాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను పూర్తిగా ఏర్పాటు చేయలేదు. నాకా బందీ సక్రమంగా చేయడం లేదు. నిఘా వ్యవస్థ లేకుండాపోయింది. ఇదీ పోలీసుల పరిస్థితి... రాజధాని అవసరాలకు 4వేల మంది పోలీసులు అవసరమని నిర్ధారించారు. ప్రస్తుతం 1,800మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా కేటాయించిన 800మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు, వీఐపీల భద్రతకే పరిమితమయ్యారు. ఏదైనా దాడి, విపత్తులు సంభవిస్తే రంగంలోకి దిగే మెరుపు బలగాలు లేనే లేవు. ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ ఎక్కడ ? ఏదైనా దోపిడీ, దాడి జరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ని అమలు చేయాలి. అందుకు ముందుగానే ప్రత్యేక బలగాలను నియమించాలి. దాడి సమాచారం తెలిసిన వెంటనే నగరాన్ని శాస్త్రీయ పద్ధతులతో దిగ్బంధించాలి. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే సాయుధులైన పోలీసులు అడ్డుకోవాలి. అవసరమైతే కాల్పులకు కూడా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగులు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. -
బైక్‌పై వెళుతున్నారా.. అయితే జాగ్రత్త !
అన్నానగర్: భార్య, భర్తలు ఇద్దరు ఓ బైక్‌లో వెళుతున్నారు. అంతలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు దుండగలు ఆ దంపంతులపై దాడి చేసి 28 సవర్ల నగలను చోరి చేసుకొని పరారయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభువ్వ ఆస్పత్రి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నైలోని పాత వన్నారపేటకు చెందిన వ్యక్తి కణ్ణిరధమ్, తర భార్య విజయరాణితో కలిసి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పుదుచ్చేరికి బయలుదేరారు. బైక్‌లో చెన్నై ఎగ్మూర్‌కు వచ్చి, అక్కడి నుంచి రైల్లో పుదుచ్చేరికి వెళ్లటానికి సిద్ధమయ్యారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. విజయరాణిపై దాడి చేసి నెట్టడంతో భార్యభర్తలు కింద పడ్డారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని విజయరాణి మెడలో ఉన్న 28 సవర్ల నగలను బైక్‌లో వచ్చిన దుండగులు దోచుకున్నారు. వెంటనే వారు కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దుండగుల వెంటనే బైక్‌లో పరారయ్యారు. గాయపడిన విజయరాణి, భర్త ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతలో కలకలం రేపింది. -
బస్సును తగల పెట్టిన దుండగులు
-
‘ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది’
హన్మకొండ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దళిత యువకుని మర్మాంగాలు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ దుండగులను, వారికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పుట్టమధును వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితరత్న బొమ్మల కట్టయ్య, మంద కుమార్‌మాదిగ లు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని వారు ఆరోపించారు. దళిత యువకున్ని దారుణంగా హత్య చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని వారు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హత్యలో పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్త్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నేత చుంచు రాజేందర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
చంపేసి.. కాల్చేశారు
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య పరిగి: ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపేశారు. అతడి వివరాలు తెలియకుండా మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించి కాల్చే శారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధి లోని మల్లెమోనిగూడ శివారులో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లెమోనిగూడ శివారు ప్రాంత రైతులకు ఓ పొలంలో తగలబడిన మృతదేహం కనిపించింది. సమాచారం అందు కున్న పరిగి ఎస్ఐ నగేశ్, ఐడీ పార్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ డీజిల్ డబ్బా, మద్యం సీసా, సిగరెట్ పెట్టె, దాదాపు 200 రూపాయలు లభ్యమయ్యాయి. పోలీసు జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. హతుడికి బాగా తెలిసిన వ్యక్తులే అతడిని ఇక్కడికి తీసుకొని వచ్చి మద్యం తాగించి పథకం ప్రకారం చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. -
దొంగ పెళ్లికి బడా దొంగలు.. పోలీసులు షాక్!
థానే: అతడొక చైన్ స్నాచర్.. అయితేనేం కళ్లు చెదిరేలా పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే కన్నుకుట్టేలా టాప్ గజదొంగలంతా అతడి వివాహానికి హాజరయ్యారు. ఈ తంతు మొత్తాన్ని పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయలేకపోయారు. తాము వెతుకుతున్న దొంగలు, పాత కేసులు ఉన్న దొంగలు, పలు నేరాలు చేసినవారు స్పష్టంగా దొరికి తప్పించుకున్నవాళ్లు ఈ పెళ్లికి హాజరవుతున్నారని తెలిసి వారిని పరిశీలించిన పోలీసులు చివరకు ఎలాంటి చర్యకు దిగకుండానే చూస్తూ ఉండిపోయారు. మొత్తం 1000 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకాగా అరెస్టులువంటి చర్యలకు దిగితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని వారంతా వెనుకడుగు తౌఫిక్ అనే వ్యక్తి ఆంబ్విలి ప్రాంతంలో పేరు మోసిన దొంగ, చైన్‌స్నాచర్. అతడికి సోహ్రా అనే యువతికి ఆదివారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన వారు మాములు వాళ్లు కాదు.. అంతా భారత్‌లోని టాప్ చైన్ స్నాచర్లు, సీజన్ వారిగా దొంగతనాలకు పాల్పడే వారు, మాస్టర్ దొంగలు. దాదాపు 20 మంది పోలీసులు ఈ వివాహంపై నిఘా వ్యవహరించారు. తౌఫిక్‌పై దాదాపు 25 కేసులు ఉన్నాయంట. అతడు తన అత్త కూతురు సోహ్రా(15)ను వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా చేతికి దొరక్కుండా తిరుగుతున్న తౌఫిక్‌ను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై తాజాగా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, కర్ణాటక, ముంబయి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే వారంతా ఈ వివాహానికి హాజరయ్యారు. -
దారిదోపిడీ ముఠా అరెస్ట్
► పట్టుబడ్డ తొమ్మి మంది ► అందరూ24 ఏళ్లలోపువారే ► మూడు వాహనాలు..ఏడు సెల్ఫొన్లు స్వాధీనం కరీంనగర్ క్రైం : కరీంనగర్ శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా దారిదోపిడీలకు పాల్పడుతున్న 9 మంది ముఠాను అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని కాపువాడకు చెందిన మిర్యాకార్ సారుు(20) స్థానిక మటన్‌షాపులో పని చేస్తాడు. అదే కాలనీకి చెందిన కోహెడ వేణు(20), కురెల్లి సారుుచంద్(21), హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన గుత్తం సారుురాం(19), గుమ్మడి రాజేశ్(24), హెచ్‌బీ కాలనీకి చెందిన దేవ కార్తీక్(24), శాషామహల్కు చెందిన మధిర హరీష్(20), మారుతినగర్‌కు చెందిన మామిడిపల్లి భువనేశ్వర్(19), అదే కాలనీకి చెందిన మరో బాలుడు(17) జల్సాలకు అలవాటుపడ్డారు. వీరిలో వేణు, సారుుచంద్, భువనేశ్వర్ డిగ్రీ చదువుతుండగా మిగతా వారు వివిధ పనులు చేస్తున్నారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి దారిదోపిడీలు ప్రారంభించారు. ఇలా వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేసేవారు డబ్బులు అరుుపోగానే మళ్లీ దారిదోపిడీలు చేసేవారు. క్లూ దొరకకుండా చోరీలు ఎలాంటి క్లూ లేకుండా రాత్రిపూట సీసీ కెమోరాలు లేనిచో ఈ ముఠా దారిదోపిడీలు చేసేది. దీంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తనిఖీలు చేసినప్పుడు వీరు తాము విద్యార్థులమని చెప్పుకుంటూ తప్పించుకునేవారు. ఈ ఏడాది మే 21న హరీష్, చంద్, మిర్యాకార్ సారుు, భువనేశ్వర్, మైనర్ బాలుడు కలిసి కరీంనగర్ బైపాస్ రోడ్డులోని రామచంద్రపూర్ పెట్రోల్ బంక్ వద్ద ప్రయాణిస్తున లారీ, ట్రాక్టర్లను నిలిపి అందులోని డ్రైవర్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.12,500 వేలు లాక్కుని పారిపోయారు. ఈ ఏడాది జూన్ 20న మిర్యాకార్ సారుు, వేణు, గుత్తం సారుురాం, దేవ కార్తీక్, గుమ్మడి రాజేశ్ కలిసి బైపాస్‌రోడ్డులో నిలిపి ఉంచిన లారీల అద్దాలు పగలకొట్టి డ్రైవర్లపై దాడిచేసి వారి నుంచి సెల్ఫొన్, రూ.17,500 ఎత్తుకెళ్లారు. ఈ ఏడాది జూలై 7, 16వ తేదీల్లో హరీష్, మిర్యాకార్ సారుు, భువనేశ్వర్, బాలుడు కలిసి సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో ఉన కొండ సత్యలక్ష్మి గార్డెన్ వద్ద రోడ్డుపై వస్తున్న ఐజర్ వాహనంపై రాళ్లు, కర్రలతో దాడిచేసి డ్రైవర్‌ను కొట్టి అతని వద్ద ఉన్న రూ.11 వేలు దోచుకున్నారు. ఆగస్టు 7న, నవంబర్ 2వ తేదీ ఇదే తరహలో దారిదోపిడీలకు పాల్పడ్డారు. అరుుతే వీరు రాత్రి పూట నేరాలు చేస్తుండడం ఎలాంటి అనవాళ్లు లభించకపోవడంతో పలువురి కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కొద్ది రోజుల క్రితం రాత్రిపూట నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో అనుమానితుడిని పట్టుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో దారిదోపిడీలకు చెందిన క్లూ లభించింది. దీంతో తొమ్మిది మంది కదిలిలకపై నిఘా పెట్టారు. మంగళవారం ఉదయం త్రిటౌన్ సీఐ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న తొమ్మిది మందిని పట్టుకుని విచారణ చేయగా ఏడు దారిదోపిడీ నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి నుంచి దోపిడీలకు వినియోగించిన మూడు బైకులు, ఏడు సెల్ఫొన్లు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.. యువతపై వారి కుటుంబసభ్యుల పర్యవేక్షణ ఉండాలని సీపీ సూచించారు. నగరంలో గతకొంతకాలంగా దారిదోపిడీలు చేసి పట్టుబడ్డ 9 మందిన కుటుంబ సభ్యులను విచారించగా వారి పర్యవేక్షణ ఉండడం లేదని తెలిసిందని తెలిపారు. ఇటీవల దారిదోపిడీ కేసుల్లో పట్టుబడ్డ 13 మందిలో ఇద్దరు ఇంజినీరింగ్, ఐదు గురు డిగ్రీ విద్యార్థులుండడం బాధాకరమని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న చోరీల నిగ్గు తెల్చడానికి ఏసీపీ రామారావు అధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తోం దని సీపీ తెలిపారు. ఓ వ్యక్తి, ఓ మహిళ, చిన్న పిల్లలతో అనుమానం రాకుండా సంచరిస్తున్నారని అనుమాని తుల కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే బ్లూకోట్స్ రంగంలోకి దిగాయని 24 గంటలు గస్తీ కొనసాగుతోందని పేర్కొన్నారు. దారిదోపిడీ ముఠాను పట్టుకున్న త్రీటౌన్, టుటౌన్ ఇన్స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, సీసీఎస్ ఎస్సైలు సాగర్, ఎల్లాగౌడ్, భాస్కర్, కానిస్టేబుళ్లను సీపీ సత్కరించారు. -
వెంటాడి.. కత్తులతో పొడిచి
హయత్‌నగర్: జనం చూస్తుడగానే దుండుగులు ఓ వ్యక్తిని వెంటాడి మరీ నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. స్థానికులు తేరుకొనేలోపే దుండగులు బైక్‌లపై పారిపోయారు. సోమవారం సాయంత్రం హయత్‌నగర్ ఠాణా పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం అంతంపేట గ్రామానికి చెందిన మద్ది వెంకటేశ్ అలియాస్ వెంకటయ్య (40) ఐదేళ్లుగా హయత్‌నగర్ మండలం మునుగనూరు గ్రామంలో ఉంటూ సొంతంగా డీసీఎం వ్యాన్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య యాదమ్మ, పిల్లలు మౌనిక, దీపిక, ఈశ్వర్ ఉన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ బైక్ (ఏపీ29బీఎఫ్ 6818)పై వెళ్తుండగా మునుగనూరులోని బ్యాంక్‌కాలనీ బస్టాప్‌లో డిస్కవరీ బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు వెంకటేశ్‌ను అడ్డగించారు. గొడవకు దిగడంతో వెంకటేశ్ బైక్ వదిలి పరుగుతీశాడు. అతడిని వారు వెంబడించారు. జనం అంతా చూస్తుండగానే దుండగుల్లో ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అప్పటికే బైక్ స్టార్ట్ చేసి ఉన్న మూడో దుండగుడితో కలిసి పారిపోయారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు, ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాలే కారణం? వెంకటేశ్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. వెంకటేశ్‌కు అన్నదమ్ములతో ఆస్తి తగాదాలున్నట్టు సమాచారం. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. వారి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. -
వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చిన దోషులను శిక్షించాలి
వేములపల్లి : వరంగల్ జిల్లా పరకాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్యని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ పేద ప్రజలు, రైతులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కషిచేశాడని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆయన వెంట వేములపల్లి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు పెద్దమామ్ సైదులు, పిల్లుట్ల బ్రహ్మం, నాయకులు మొండి సైదిరెడ్డి, బొబ్బిలి శ్రీను, పోరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిర్పూర్లో వ్యక్తి దారుణహత్య
గొడ్డలితో నరికి చంపిన దుండగులు రక్తపు మడుగులో మృతదేహం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్పూర్లో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన మాధాపూర్ శ్యాం(45) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి ఇంట్లో గొడ్డలితో నరికి హతమార్చారు. సోమవారం ఉదయం పక్కింట్లో ఉండే బంధువులు వచ్చి చూడగా రక్తపు మడుగులో శ్యాం మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు విషయం తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసు డాగ్ స్క్వాడ్ బృందం తెప్పించి గ్రామంలో పరిశీలన చేశారు. మృతుడు శ్యాంకు భార్య స్వర్ణ, ఇద్దరు పిల్లలు ఉండగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా ఆమె భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని ఆర్మూర్‌కు వెళ్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి శ్యాం ఇంట్లోనే ఉండేవాడు. పొద్దంతా తిరిగి రాత్రికి స్నేహితులతో కలిసి వచ్చి ఇంట్లోనే ఉండేవాడని స్థానికులు తెలిపారు. కొత్తకొత్త స్నేహితులు ఇళ్లకు వచ్చే వారని వివరించారు. విషయాన్ని భార్యకు తెలపడంతో ఆమె పిల్లలను తీసుకొని సిర్పూర్‌కు వచ్చింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు దీపిక ఇంటర్మీడియట్ చదువుతోంది. గతంలో మృతుడు పలు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడని, రూరల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. తమ్ముడు చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
‘పేట’లో పట్టపగలే చోరీ
ఇంటి తాళాలు పగులగొట్టి 14 తులాల బంగారు ఆభరణాల అపహరణ సూర్యాపేట : దుండగులు పట్టపగలే తెగబడ్డారు. సూర్యాపేటలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 14 తులాల బం గారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన ఎండీ మోహినొద్దీన్ అలంకార్ రోడ్డులో వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మసీద్‌లో ప్రార్థన చేసేందుకు వెళ్లాలని భార్యను వస్త్ర దుకాణానికి రావాలని కోరాడు. దీంతో ఆమె ఇంటికి తాళాలు వేసుకుని దు కాణం వద్దకు చేరుకుంది. ప్రార్థన ముగి ంచుకుని మోహినొద్దీన్ దుకాణానికి చేరుకోగానే భార్య ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయిం ది. అసలు ఏం జరిగిందో కూడా తెలి యకముందే ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. గుర్తుతెలియని దొంగలు ఇంటి వెనుక నుంచి వచ్చి లోనికి చొరబడ్డారు. తా ళాన్ని రంపంతో కోసి బీరువాలోని 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
హనుమాన్ జంక్షన్లో భారీ చోరీ
* రూ. 16 లక్షల సొత్తు అపహరణ * హనుమాన్‌జంక్షన్ రూరల్ తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు చాకచాక్యంగా చొరబడి రూ. 16 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన సంఘటన గురువారం హనుమాన్ జంక్షన్లో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. స్థానిక గుడివాడ రోడ్డులో నివాసం ఉంటున్న కామినేని ఉషా వసుంధరాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులూ విదేశాల్లో స్ధిరపడటంతో ఇక్కడ నివసిస్తోంది. గురువారం ఉదయం బంధువుల ఇంట్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వసుంధరాదేవి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన మహిళ ఇంట్లో సామన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. కిటీకీలు ధ్వంసమై, బీరువాలు పగులగొట్టినట్లు గుర్తించి తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లి చూసి ఇంట్లో భద్రపర్చిన 40 కాసుల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఎస్.ఐ బి.తులసీధర్, ఏఎస్ఐలు బాలాజీ, వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వచ్చి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు చోరీకి ఉపయోగించిన పలుగులు ఇంట్లోనే వదిలిపెట్టి ఉడాయించటంతో వాటిపై వేలిముద్రలు ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పక్కా ప్రణాళికతో చోరీ... ఇంటి ప్రధాన ద్వారానికి ప్రక్కనే ఉన్న కిటికీ తలుపులను తొలగించి దుండగులు లోపలికి వెళ్లినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. తొలగించిన కిటికీ ఇనుప చువ్వను బయట ఉంచితే .. ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించిన దుండగులు దాన్ని ఇంటి పక్కన సందులో భద్రపరిచారు. పోలీసులు కేసును ఛేదించాల్సిఉంది. -
సిగరెట్ కావాలని వచ్చి గొలుసు చోరీ
కిరాణా దుకాణం యజమానురాలి నుంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు ఇబ్రహీంపట్నం: సిగరేట్ కావాలంటూ బైక్‌పై కిరాణా దుకాణానికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుపోయారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సాహెబ్‌గూడకు చెందిన వట్నాల పుష్పలత(35) స్థానికంగా ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం ఇంటిగంట సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆమె దుకాణం వద్దకు వచ్చారు. సిగరెట్ కావాలని అడిగారు. దీంతో పుష్పలత సిగరెట్ ఇచ్చేంతలోపు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో, తాజాగా సోమవారం సాహెబ్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
డబ్బులు అడిగాడని హత్య
ఏకలవ్యకాలనీలో పడేసిన దుండగులు మృతుడు ఇప్పకుంట వాసి మహబూబ్‌నగర్ క్రైం : ఇచ్చిన డబ్బులు మళ్లీ అడుగుతున్నాడని పథకం ప్రకారం ఓ వ్యక్తిని దుండగులు వేరేచోట హత్య చేసి మరో ప్రదేశంలో పడేశారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏకలవ్యకాలనీ సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈయనను బల్మూర్ మండలం ఇప్పకుంటకు చెందిన గోపాల్‌రెడ్డి (40) గా గుర్తించారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటూ ఓ చిన్న కేబుల్ కంపెనీ నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. వీరిలో ఒకరు గుప్తనిధులు తవ్వడంలో సిద్ధహస్తుడు. ఒకచోట వజ్రాలు ఉన్నాయని వాటిని బయటకు తీసిన తర్వాత ఇస్తామని గోపాల్‌రెడ్డిని నమ్మించి రూ.ఐదు లక్షలతోపాటు బుల్లెట్ వాహనం తీసుకున్నారు. చాలా రోజులు కావడంతో డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఎలాగైనా తుదముట్టించాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీ ఉదయం డబ్బులు ఇస్తామని అతడిని కారులో హైదరాబాద్ నుంచి అచ్చంపేట వైపు తీసుకెళ్లారు. అనంతరం శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గంలో హత్య చేసి మృతదే హాన్ని తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని ఏకలవ్యకాలనీ రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
దుండగుల దుశ్చర్యతో కలకలం
► నీటి ట్యాంకర్లో విషగుళికలు కలిపిన వైనం ► లట్టుపల్లిలో 20మందికి అస్వస్థత ► విచారణ చేపట్టిన ఎస్ఐ బిజినేపల్లి : నీటి ట్యాంకర్లో దుండగు లు విషగుళికలు కలపడం కలకలం రేపింది. ఈ సంఘటనతో 20మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం బిజినేపల్లి మండలం లట్టుపల్లిలోని మూడు, నాలుగు వార్డుల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అంతకుముందే అందులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుళికలమందు కలపగా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఆ నీటిని తాగిన సునీత, గీత, రాంచరణ్, ప్రవళిక, సోఫియాన్, మహిన్, చిన్న య్య, సూర్యతేజ, జరీనాబేగం, ఊశన్న, అబ్దుల్అజీద్తోపాటు మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరు వాంతులు చేసుకోవడంతోపాటు కడుపునొప్పితో బాధపడుతుండటంతో వెంటనే 108వాహనంలో బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని (పీహెచ్సీ) కి తీసుకెళ్లి వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ ఎద్దుల రాములు బాధితులను పరామర్శించి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి ట్యాంకర్‌ను నిలిపి ఉంచిన చోట వేముల జెన్నయ్య ఇంటి వద్ద పశుగ్రాసంపైనా విషగుళికలు చల్లడంతో అవి తిన్న రెండు కోళ్లు మృతి చెందాయి. కాగా ఈఓపీఆర్డీ పండరీనాథ్, సెక్రటరీ జయరాం గ్రామంలో తిరిగి విషం కలిసిన నీటిని పారబోయించారు. ఈ విషయమై పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వీరబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
21 మంది విగ్రహాల దొంగలు అరెస్టు
మూడు వాహనాలు స్వాధీనం సూత్రధారి సస్పెన్షన్‌లో ఉన్న ఓ కానిస్టేబుల్ తిరుపతి క్రైం : ఈ నెల 21వ తేదీన ఏర్పేడు మండలం కోబాకలోని చెరువు కట్ట వద్ద ఉన్న పురాతన వినాయక విగ్రహాన్ని చోరీచేసేందుకు ప్రయత్నించిన ముఠా ను ఏర్పేడు సీఐ సాయినాథ్ అరెస్టు చేశారని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి తెలి పారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం మేరకు ఏర్పేడు సమీపంలోని ముసలి పేడు అటవీ ప్రాంతంలోని బత్తెనయ్య ఎస్టీకాలనీ వద్ద ముగ్గురు వ్య క్తులు అనుమానాస్పదంగా తిరుగుతుం డగా అదుపులోకి తీసుకున్నామని తెలిపా రు. విచారణలో వారు వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించిన దుండగులని తేలిందన్నారు. వారిచ్చిన సమాచారంతో మిగిలిని 18 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విగ్రహంలో వజ్రాలు ఉన్నాయని.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం హరి జనవాడకు చెందిన కంటేటి రవి హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఒకటవ బెటాలియన్‌లో కానిస్టేబుల్ (పీసీనెం.669)గా పనిచేసేవాడు. తన తాత, తండ్రుల ద్వా రా గుప్తనిధుల గురించి సమాచారం తెలుసుకున్నాడు. అలాగే విగ్రహాలను చోరీ చేసేందుకు మంత్రతంత్రాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెం దిన నరసారావు, మంగపట్ల వెంకటేశ్వరరావు, పలుపులాజరు కలిసి రవి వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని సా యం చేయాలని కోరారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రవి వారితో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కోబాకలోని చెరువుకట్ట వద్ద కుడివైపు తొండం కలిగి ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ఉంద న్నాడు. దాని వెనుక తామరపుప్వు ఆకారంలో మూతలాగా ఉంటుందని, అందు లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయని తెలిపాడు. దాన్ని తెస్తే విక్రయించి వచ్చిన మొత్తాన్ని పంచుకుందామని ప్రోత్సహించాడు. మొదటి సారి విఫలం విగ్రహాన్ని చోరీ చేయడానికి నరసింహా రావు, వెంకటేశ్వరరావు, మరికొంతమంది ముఠా సభ్యులతో కలిసి కోబాకలోని వినాయక విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రణాళి క సిద్ధం చేసుకున్నారు. జనవరి 30న గునపాలతో పెళ్లగించి చోరీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తాడు తెగి శబ్దం రావడంతో వెలుగులోకి.. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో అర్దరాత్రి టిప్పర్, టవేరా, క్వాలిస్‌కారు, మోటార్ సైకిల్‌పై 22 మంది వచ్చారు. వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రయత్నించారు. విగ్రహానికి తాడు కట్టి టిప్పర్‌తో లాగేందుకు ప్రయత్నించారు. ఆ తాడు తెగి పెద్దగా శబ్దం రావడంతో గ్రామస్తులు మేల్కొని గుడి వద్దకు వచ్చారు. ముఠాలోని వారు ఇనుపరాడ్లు, పైపులతో గ్రామస్తులను బెదిరించి వాహనంలో పరారయ్యారు. కోబాకకు చెందిన భరత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఏర్పేడు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని రేణిగుంట రూరల్ సీఐ సాయిరాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. దుండగులను శనివా రం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం, టిప్పర్, టవేరా, నాలుగు సెల్ఫోన్లు, ఇనుపపైపులు, రాడ్లను స్వాధీ నం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రవి పోలీసు కానిస్టేబుల్‌గా కొన్ని చోరీలు చేశాడని, పోలీసు అధికారులపై దాడిచేసి సస్పెం డ్ అయ్యాడన్నారు. రవి, మరొక నిందితుడు ఏడుకొండలును అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్బీ డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బం దిని ఎస్పీ అభినందించారు. -
వీఆర్వోపై కత్తులతో దాడి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. షాద్‌నగర్‌లోని రాఘవేంద్రకాలనీలో ఇంటిలో నిద్రిస్తున్న వీఆర్వో రవియాదవ్(35)పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. బాలా నగర్ మండలం రాజాపూర్ వీఆర్వోగా రవియాదవ్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కల కారణాలు తెలియాల్సి ఉంది. -
అరకులోయలో దుండగుల దుశ్చర్య
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పద్మాపురం ఉద్యానవనంలోని రెండు పగోడాల (షెల్టర్లు)కు శనివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఇవి పూర్తిగా కాలిపోయాయి. ఒకటి పర్యాటకులు విశ్రాంతి కోసం, మరొకటి అధికారుల సమావేశాలకు వినియోగిస్తుంటారు. ఈ ఘటనపై అరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేసి.. మృతదేహంపై రాళ్లు పేర్చి
తాండూరు రూరల్: దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి.. అనంతరం మృతదేహంపై బండరాళ్లు పేర్చారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన తాండూరు పట్టణంలోని సీతారాంపేట్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బం ట్వారం మండలం కల్కోడ గ్రామానికి చెందిన చాకలి శ్రీను(30) కొన్నేళ్ల క్రితం పాతతాండూరుకు చెందిన లక్ష్మిని పెళ్లి చేరుకొని అత్తగారివద్ద ఉంటున్నాడు. స్థానికంగా రోజు వారి కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా పట్టణంలోని సీతారాంపేట్‌లో ఉన్న శ్మశానవాటికలో ఓ యువకుడి(30) మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదే న్ని పరిశీలించారు. మృతుడిని చాకలి శ్రీనుగా గుర్తించారు. దుండగులు అతడిని చంపేసిన అనంతరం మృతదేహంపై బండరాళ్లు పేర్చారు. ముఖంపై రాళ్లతో మోదడంతో పూర్తి ఛిద్రమైపోయింది. వెంటనే పోలీసులు వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంల ను రప్పించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలం నుంచి సీతారాంపేట్‌లో పలు వీధుల మీదుగా క్లాసిక్గార్డెన్ సమీపంలో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్ వద్దకు వెళ్లి ఆగింది. మృతదేహం వద్ద క్లూస్ టీం సిబ్బంది వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో శ్రీను తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహానికి సమీపం లో ఓ ముళ్లచెట్లు వద్ద ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. దీంతో హతుడికి తెలిసిన వారే చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చేందుకు తీసుకొచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే మృతదేహంపై బండరాళ్ల పేర్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మొదటగా హతుడి వివరాలు తెలియరాలేదు. సీతారాంపేట్‌లో వ్యక్తి దారుణ హత్య విషయం తెలుసుకున్న పట్టణవాసులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయం దావానలంలా పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, హతుడికి కుమార్తె విజయ (3), కొడుకు లక్కీ(1) ఉన్నారు. కేసు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రామయ్య పేర్కొన్నారు. -
రెస్టారెంట్ యజమానిపై ఆగంతకుల విధ్వంసం
-
చిరునామా అడిగి..
మహిళ మెడలో బంగారు చైన్లు అపహరణ నెల్లూరు (క్రైమ్) : ఇంటి ముందు నిలబడి ఉన్న ఓ మహిళను లాయర్ ఇంటి చిరునామా అడుగుతూ ఆమె మెడలోని ఎనిమిది సవర్ల బంగారు చైన్లను గుర్తుతెలియని దుండగులు లాక్కెల్లారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం బీవీనగర్‌లోని సంఘమిత్ర స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. బీవీనగర్‌కు చెందిన కె. జోజిరెడ్డి భార్య జషింతమ్మ శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి నిలబడి ఉంది. ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై వచ్చారు. బైక్‌ను ఆన్‌లోనే ఉంచి ఇక్కడ లాయర్ రమేష్‌రెడ్డి ఇల్లు ఎక్కడ అంటూ ఆమెను అడిగారు. ఆమె తనకు తెలియదని చెబుతున్న తరుణంలో బైక్ వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు చైన్లు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె గొలుసులను గట్టిగా పట్టుకుంది. దుండగులు గట్టిగా లాగడంతో ఆమె చేతికి నల్లపూసల దండ ముక్క వచ్చింది. దీంతో దుండగులు బైక్ పై ఉడాయించారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధితురాలు పెద్దగా కేకలు వేసే సరికి చుట్టుపక్కల వారు గుమికూడి బైక్‌ను వెంబడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితురాలు ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ విజయకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ దారుణహత్య
- అత్యాచారం.. ఆపై హత్యచేసి నిప్పంటించిన దుండగులు - ముదిరెడ్డిపల్లి శివారులో ఘటన - పరిశీలించిన ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ బాలానగర్: ఓ గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైంది. అత్యాచారం చేసి హతమార్చి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన గురువారం ఉదయం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామశివారులో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. వ్యవసాయ పొలంలో ఓ మహిళ(30) దారుణహత్యకు గురై పూర్తిగా కాలిపోవడాన్ని స్థానికరైతులు గుర్తించారు. ముఖానికి చీరచుట్టి ఊపిరి సల్పకుండాచేసి దానిపై ముఖాన్ని గుర్తించకుండా ప్లాస్టర్ వేశారు. చనిపోయిన తరువాత మృతదేహంపై పెట్రోల్‌పోసి నిప్పంటించడంతో గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసర్పంచ్ నర్సింలు సమాచారం మేరకు ఎస్ఐ అశోక్‌కుమార్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో బస్ టికెట్లు హత్యాస్థలిలో పంజాగుట్ట నుంచి మెహదీపట్నం, మెహదీపట్నం నుంచి హైదర్‌గూడకు ప్రయాణించినట్లు ఆర్టీసీ బస్‌టికెట్లు లభించాయి. దీంతోపాటు టిఫిన్ బాక్స్, రూ.వంద అక్కడ పడి ఉన్నాయి. ఎక్కడి నుంచో మహిళను ఇక్కడికి తీసుకొచ్చి బలత్కరించారా?, లేక స్థానికసెజ్లో పనిచేసే కార్మికురాలై ఉంటుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ అశోక్‌కుమార్ డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి కొన్ని ఆనవాళ్లను సేకరించారు. ఏఎస్పి కల్మేశ్వర్ సంగెనవర్, షాద్‌నగర్ రూరల్ సీఐ గంగాధర్ కూడా సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. -
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య
బెంగళూరు(బనశంకరి): కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి వెళుతున్న డిగ్రీ విద్యార్థినిని దుండగులు, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన అనంతరం గొంతుకోసి హత్యచేసిన ఘటన శిరా తాలూకాలోని జవనహళ్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. శిరా తాలూకా పరిధిలోని జవనహళ్లి నివాసి రంగప్ప-రంగమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నమ్మ (20)బీఏ డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతుంది. గురువారం సాయంత్రం బడువనహళ్లిలోని నందగోకుల కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి క్లాస్ ముగించుకుని ఇంటికి బయల్దేరింది. జవనహళ్లికి చేరుకోవాలంటే బడువనహళ్లి నుంచి గుళిగేనహళ్లిగేట్కు బస్‌లో వచ్చి అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బస్‌లో దిగి ఇంటికి నడుచుకుని వెళుతున్న రత్నమ్మను దుండగులు అడ్డుకుని నిర్జన ప్రదేశంలోకి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గొంతుకోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. అయితే కుమార్తె సాయంత్రం 5 గంటలైనా ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు గుళిగేనహళ్లి గేట్ వద్దకు చేరుకుని విచారించగా ‘‘మీ కుమార్తె 4 గంటలకే నడుచుకుని వెళుతుండడం చూశాం’’ అని అక్కడ స్థానికులు తెలిపారు. దీంతో మరింత భయపడిన తల్లిదండ్రులు మళ్లీ జవనహళ్లికి చేరుకుని గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం గ్రామస్తులతో కలిసి జవనహళ్లికి వచ్చే కాలిబాటలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లి చూడగా కొంచెం దూరంలో పాదరక్షలు కనబడ్డాయి. మరికొంత దూరంలోకి వెళ్లి చూడగా ఆమె శవం కనిపించడంతో విద్యార్థిని తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ యువతిపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న శిరా నగర పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, శిరా గ్రామాంతర ఎస్ఐ రామకృష్ణయ్య తమ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్తీక్‌రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.లక్ష్మణ్‌కు సమాచారం అందించడంతో కార్తీక్‌రెడ్డి, ఆర్.లక్ష్మణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో తక్షణం అక్కడికి చేరుకుని దుండగుల ఆచూకీ తెలుసుకోవడంలో నిమగ్నం అయ్యారు. ఈ ఘటనతో జవనహళ్లి గ్రామస్తులు తీవ్ర కోపోద్రిక్తులై జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీబీ.జయచంద్ర సంఘటనా స్థలానికి రావాలంటూ పట్టుబట్టారు. శుక్రవారం ఉదయం యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే జిల్లా ఇన్చార్జ్మంత్రి టీబీ.జయచంద్ర సంఘటనా స్దలానికి చేరుకునే వరకు అంత్యక్రియలు నిర్వహించేదీ లేదంటూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూచున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం అదనపు ఎస్పీ.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసును తీవ్రంగా పరిగణించామని దుండగుల ఆచూకీ తెలిసిందని త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు. దుండుగుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు జిల్లా ఎస్పీ కార్తీక్‌రెడ్డి, అదనపు పోలీస్ ఎస్పీ ఆర్.లక్ష్మణ్ దుండగుల ఆచూకీకోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పోలీస్ బృందా ల్లో శిరా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, తావరకెరె ఎస్ఐ అంజన్‌కుమార్, శిరా గ్రామాంతర ఎస్ఐ రామకృష్ణయ్య, కళ్లంబెళ్ల ఎస్ఐ చంద్రశేఖర్, తుమకూరు గ్రామాంతర ఎస్ఐ. రవి, కోరా ఎస్ఐ. రవికుమార్ ఉన్నారు. ఇప్పటికే ఈ బృందాలు దుండుగుల ఆచూకీకోసం తీవ్రగాలింపుచర్యలు చేపట్టారు. -
హనుమంత లాడ కాల్చివేత
బెంగళూరు : వ్యక్తిగత కారణాలతో ఓ మాజీ జెట్పీటీసీ సభ్యుడ్ని పట్టపగలు తుపాకీతో కాల్చి చంపిన ఘటన బీదర్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... హనుమంతలాడ (58) బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో బీదర్‌లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఎటీఎంలో డబ్బులు తీసుకుని ఆటోలో మరోచోటికి బయలుదేరాడు. అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. రెండు బులెట్లు ఛాతిలోకి దూసుకెళ్లాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మరణించారు. ఈ విషయమై ఐజీ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ... వ్యక్తిగత కక్షలతోనే హనుమంత లాడ పై దాడి జరిగిందని తెలిపారు. దుండగులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, హనుమంతరాయపై హత్యాయత్నంతో పాటు వివిధ పోలీస్స్టేషన్లలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
భవానీమాత ఆలయంలో చోరీ
- పురాతన పంచలోహ విగ్రహం, ఉత్సవ ప్రతిమ అపహరణ - హుండీ పగులగొట్టి డబ్బులూ.. - డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాల సేకరణ - పరిశీలించిన ఏఎస్పీ చందనదీప్తి - పాత తాండూరులో ఘటన తాండూరు రూరల్: ఓ పురాతన అమ్మవారి పంచలోహ విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహం, అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని డబ్బును గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున తాండూరులో చోటుచేసుకుంది. పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం.. పాత తాండూరులో భవానీమాత ఆలయం ఉంది. దాదాపు 350 ఏళ్ల పురాతన పంచలోహ విగ్రహం, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో న్యాయవాది శ్రీనివాస్ అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. అప్పటికే ఆలయం ద్వారం తాళం విరిగిపోయి కనిపించింది. గుడిలో ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహం కనిపించలేదు. దీంతో న్యాయవాది ఆలయ కన్వీనర్ నారా మహిపాల్‌రెడ్డితో పాటు స్థానికులకు విషయం తెలిపాడు. పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు నాగార్జున, ప్రకాష్‌గౌడ్,రవి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భవానీమాత పంచలోహ విగ్రహం, ఉత్సహ విగ్రహం, ఇత్తడి ప్రమిదలు, హారతి పళ్లెం చోరీ అయిందని గుర్తించారు. దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులో డబ్బులు తీసుకొని దానిని ఆలయం బయట పడేసి వెళ్లిపోయారు. తాను గురువారం రాత్రి 8 గంటల వరకు ఆలయంలోనే ఉండి తాళం వేసి వెళ్లిపోయానని పూజారి కిరణ్ సీఐకి చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలను రప్పించారు. పోలీసు జాగిలం ఆలయం నుంచి స్థానికంగా ఉన్న మాణిక్‌నగర్‌లోని ఇళ్ల వద్దకు వెళ్లి ఆగింది. ఆలయం వద్ద పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. ఉద్రిక్తత చోటుచేసుకునే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం తాండూరు ఏఎస్పీ చందనదీప్తి సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అంతర్రాష్ట్ర దొంగలముఠా అయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో దుండగులను పట్టుకుంటామని, స్థానికులు కూడా సహకరించాలని ఆమె కోరారు. పోలీసులు ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చోరీ ఘటనపై పట్టణవాసులు నిరసన వ్యక్తం చేశారు. ఆలయ కన్వీనర్ నారా మహిపాల్‌రెడ్డి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నవ దంపతులపై దుండగుల దాడి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం-గొల్లప్రోలు వద్ద బుధవారం అర్థరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. సినిమాకు వెళ్లి వస్తున్న నవ దంపతులపై మద్యం సీసాలతో దాడిచేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వివరాలు.. గొల్లప్రోలు మండలానికి చెందిన తాతపూడి సురేష్, జయ దంపతులు బుధవారం కాకినాడ వెళ్లారు. ఈ క్రమంలో ఆరోజు మధ్యాహ్నం సినిమా చూసి సాయంత్రం బీచ్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో జయకు కడుపులో నొప్పి రావడంతో శోంటవారిపాకలు సమీపంలో విశ్రాంతి కోసం ఆగారు. ఆ సమయంలో వెనుక నుంచి బైక్‌పై మద్యం తాగుతూ వస్తున్న ఇద్దరు దుండగులు వీరిపై దాడి చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, శతమానాలు, ఉంగరాలు, వెండిపట్టీలు దోచుకున్నారు. ఈ దాడిలో జయను దుండగులు బీర్ సీసాతో కొట్టడంతో గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దారి కాచి దొంగతనం
సత్తెనపల్లి(గుంటూరు): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దారికాచి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ అడ్డరోడ్డు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. నందిగామ అడ్డరోడ్డు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి అటుగా వచ్చిన 10 వాహనాలను దోచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురు బాధితులు పోలీసులను సంప్రదించారు. కాగా, నిందితులు ఆ దారిలో వచ్చిన వారిని అడ్డగించి కత్తి, గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోచుకున్నారని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో చోరీ
నెల్లూరు(క్రైమ్): ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో దుండగులు చొరబడి రూ.7.15 లక్షలు అపహరించిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసిం ది. పోలీసుల కథనం మేరకు.. హిందూ జా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని నెల్లూరులోని ఆచారి వీధిలో ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. నెల్లూరుకే చెందిన ఎం.మహేష్ బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. శనివారం బ్యాంకు సమయం మించిపోవడంతో కంపెనీకి సంబంధించిన రూ.7.15 లక్షల నగదును కార్యాలయంలోని లాకరులోనే ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో కార్యాలయం తెరవలేదు. సోమవారం సెలవు అయినప్పటికీ మహేష్‌తో పాటు పలువురు సిబ్బంది వచ్చి సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం తాళం వేసుకుని వెళ్లారు. ఈ క్రమం లో గుర్తుతెలియని వ్యక్తులు లోనికి చొరబడి లాకర్ పగలగొట్టడంతో పాటు అందులోని నగదు అపహరించారు. వేలి ముద్రలు పడకుండా, డాగ్‌స్క్వాడ్‌కు సైతం ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో ఘటనా స్థలంలో మిరప్పొడి చలి ఉడాయించారు. మంగళవా రం ఉదయం 9.30 గం టలకు మహేష్ కార్యాలయం తలుపు తెరవగా లోపలంతా మిరప్పొడి చల్లివుండటంతో పాటు దక్షిణ భాగంలోని తలు పు తెరిచి కనిపించింది. లాకర్ సైతం పగలగొట్టి ఉండటం గుర్తించి వెంటనే ఒకటో నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘట నా స్థలాన్ని నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్, సీసీఎస్ డీఎస్పీ శ్రీధర్, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా, ఒకటోనగర ఎస్ఐ కె. రామకృష్ణ పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కంపెనీ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాలెన్నో.. చోరీ జరిగిన తీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మహేష్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు ఘటన జరిగిన తీరుకు పొంతన కుదరడం లేదు. దక్షిణం వైపు తలుపు తెరిచివుందని మహేష్ చెబుతుండగా ఆ వైపు నుంచి దుండగులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కార్యాలయం మూడో అంతస్తులో ఉండ టం, దక్షిణం వైపు కరెంట్ తీగలు ఉండటంతో అటువైపు నుంచి దొంగలు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. నేరుగా తలుపులు తెరిచే లోనికి ప్రవేశించి, తిరిగే వెళ్లే సమయంలో తాళాలు వేసుకుని వెళ్లి ఉంటారని పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపట్టారు. కార్యాలయానికి సంబంధించిన తాళాలు రెండు సెట్లు ఉండగా ఒక సెట్‌ను ఆఫీస్‌బాయి చంద్ర కొన్ని నెలల కిందట పోగొట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో చంద్రను సైతం విచారిస్తున్నారు. -
ఇద్దరు చిన్నారుల కిడ్నాప్
తూప్రాన్ : పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని దుండగులు టాటా సుమోలో అపహరించుకుపోయి వదిలేసిన సంఘటన శుక్రవారం తూప్రాన్‌లో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పుల్లే కిష్టయ్య, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె పూజిత (10), కుమారుడు ప్రసాద్ (6)లు శుక్రవారం ఉదయం పట్టణంలోని గీతా అక్షర పబ్లిక్‌స్కూల్‌కు ఇంటి నుంచి బయలు దేరారు. అయితే పాఠశాలకు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకుని పిల్లల నోరు మూసి బలవంతంగా సుమోలో ఎక్కించారు. అనంతరం పట్టణ శివారులోని అల్లాపూర్ చౌరస్తా వద్ద వదిలేసి పారిపోయారు. అటుగా వస్తున్న వారు చిన్నారులు ఏడుస్తున్న విషయాన్ని గమనించి వారిని వారి ఇంటికి చేర్చారు. అనంతర ం విషయాన్ని చిన్నారులు తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అపహరించిన వ్యక్తులు ఎవరై ఉంటారు..?, ఎందుకోసం అపహరించింటారన్న భయంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళ దారుణ హత్య
శంషాబాద్ రూరల్: గుర్తుతెలియని మహిళ(35) దారుణ హత్యకు గురైంది. దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోశెట్టిగూడ శివారులో ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రహదారి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది హతమార్చారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ రాయి రక్తపు మరకలతో పడి ఉంది. మృతురాలి ముఖం గాయాలతో, రక్తంతో నిండి ఉంది. రక్తం నలుపురంగులోకి మారడంతో దుండగులు దాదాపు రెండు రోజుల క్రితం చంపేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి ముఖం నుజ్జునుజ్జయి గుర్తుపట్టకుండా తయారైంది. హతురాలికి సంబంధించిన ఆధారాలు లభించలేవు. దుండగులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని, మృతురాలు స్థానికంగా ఇటుక బట్టీల్లో పని చేసే ఒడిశా కార్మికురాలు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో రక్తం మరకలతో నీలిరంగు చారల టవల్ పడి ఉంది. మృతురాలి ఒంటిపై ఎర్రరంగు చారల చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నాయి. హమీదుల్లానగర్ నుంచి తొండుపల్లి ఔటర్ జంక్షన్‌కు వచ్చే దారిలోని ఈ ప్రాంతంలో సర్వీసు దారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో ఇటువైపు వాహనాల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉంటుంది. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. జాగిలాలు ఘటనా స్థలం నుంచి సర్వీస్ రహదారి నుంచి పోశెట్టిగూడ వరకు వెళ్లి ఆగాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకీ తరలించారు. మృతురాలి బంధువులు 08413-222033 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొలిక్కిరాని కేసు
సాక్షి, గుంటూరు : రాజధాని ప్రాంతంలోని పంట పొలాల్లో దుండగులు కార్చిచ్చు పెట్టిన ఘటనపై విచారణ ఓ కొలిక్కి రాకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లోని ఆరు గ్రామాల్లో పంటపొలాల్లో వెదురు బొంగులు, పాకలు, డ్రిప్ పైపులు, నెట్లు వంటి సామగ్రిని దుండగులు దహనం చేసిన విషయం విధితమే. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీనజరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్డీ రామకృష్ణలు హుటాహుటిన సంఘటనా స్థలాలను పరిశీలించి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసినా ఉపయోగం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని సెల్ టవర్ల వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో వెళ్లిన కాల్‌లిస్ట్‌లను పరిశీలించారు. వీటి ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో పెనుమాక వాసులు.. నిందితుల సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షలు రివార్డు ఇస్తామని ఐజీ సునీల్‌కుమార్ ప్రకటించినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఓవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో బందోబస్తు ఏర్పాట్లు తలనొప్పిగా మారాయి. ఇది రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా అనే అనుమానంతో రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఫోన్లను సైతం టాప్ చేస్తున్నట్లు తెలిసింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన ఐజీ.. నిందితులెవరో తేలకపోవడంతో గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం తన కార్యాలయంలో ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలతో కేసు విషయమై సమావేశమయ్యారు. అనంతరం తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లి దర్యాప్తు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ముందుగానే పరిస్థితిని గమనించి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ఎస్పీలతో కలసి త్వరలో ఆయన గ్రామాలను సందర్శించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఐజీ మాట్లాడుతూ పంటల దహనం కేసుకు సంబంధించి తమ వద్ద కొంత సమాచారం ఉందని, దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని అన్నారు. -
హతుడెవరో.. హంతకులెవరో!
ఓ వ్యక్తిని హత్యచేసి తగులబెట్టేసిన కేసుకు సంబంధించి హతుడెవరో ఇంతవరకూ తెలియకపోవడంతో హంతకులెవరో కూడా తెలిసే అవకాశం కనిపించడంలేదు. ఎచ్చెర్ల పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసు మిస్టరీ వీడాలంటే ముందుగా హతుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు జిల్లా దాటి దర్యాప్తు ముమ్మరం చేసినా ఫలితం శూన్యం. ⇒పోలీసులకు సవాల్‌గా హత్యకేసు ⇒మృతదేహాన్ని తగులబెట్టడంతో ఆచూకీ తెలియని వైనం ⇒ముమ్మరంగా అన్వేషిస్తున్న బృందాలు ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చినరావుపల్లి ఫైరింగ్ రేంజ్ సమీంలోని జీడిమామిడితోటలో గత నెల 26న, హత్యచేసిన ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గోనె సంచితో తెచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. మృతదేహం తల మాత్రం సగమే కాలడంతో పోలీసులు కొంత ఆనవాలు పట్టి, ఆ మరుసటి రోజు రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని చూసిన పోలీసులు హత్యజరిగిన తీరును అంచనావేసి ఐపీఐ 302, 201 సెక్షన్ల కింద (హత్యానేరం కేసు తారుమారుయత్నం) కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవనాయుడు, జేఆర్ పురం సీఐ కె.అశోక్‌కుమార్ స్పందించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలీసులను అప్రమత్తం చేశారు. విజనగరం, విశాఖ జిల్లాలతోపాటు ఒడిశాలోని బరంపురం, పర్లాకిమిడి, గజపతి వంటి ప్రాంతాల్లో సైతం దర్యాప్తు బృందాలు అన్వేషించాయి. రైల్వే స్టేషన్లలో సైతం మృతుని నమూనా చిత్రాన్ని అతికించారు. దర్యాప్తు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా ఆచూకీ మాత్రం చిక్కడంలేదు. ముందుగా మృతుని ఆచూకీ లభ్యమైతే తప్పనిసరిగా నిందితులను పట్టుకోగలమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నెట్‌వర్క్‌ల నుంచి సెల్ ఫోన్ సంభాషణలు జరిపిన కాల్ లిస్టులు సైతం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమవ్వడం విశేషం. ఏ చిన్న క్లూ అయినా దొరక్కపోదా అన్న ఆశతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిందితులు తెలివిగా వ్యవహరించడం పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. హత్య అనంతరం ఆచూకీ తెలిసే అవకాశం లేకుండా మృతదేహాన్ని తగులబెట్టడం ఒక ఎత్తయితే.. సుదూర ప్రాంతం నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగులబెట్టేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే మృతదేహాన్ని తగులబెట్టడానికి ఈ ప్రదేశాన్నే ఎంచుకున్నారంటే ఇది ఈ ప్రాంతవాసుల హస్తమేదైనా ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని దర్యాప్తు అధికారి, జె.ఆర్.పురం సీఐ అశోక్ కుమార్ చెప్పుకొస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే నిందితుల వివరాలు తెలిసే అవకాశముంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
జ్యూయలరీ షాపులో భారీ చోరీ
అచ్చంపేట :అచ్చంపేట నడిబొడ్డు, 24 గంటలూ ఇసుక లారీల రాకపోకలతో రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి విగ్రహ సెంటర్‌లోగల గంగాభవానీ జ్యూయలరీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కొందరు దుండగులు షాపు పైకప్పునకు కన్నం వేసి మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు దోచుకుపోయారు. జ్యూయలరీ షాపులో సీసీ కెమెరాలు కూడా లేవు. పోలీసు అధికారులు సంఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మండలంలో సంచలనం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రోజూలాగే షాపును నిర్వహించి అనంతరం తాళాలు వేసి యజమాని మణికంఠ ఇంటికి వెళ్లారు. యధావిధిగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన ఆయన షాపు షట్టర్ తాళాలు తీసి లోపలికి వెళ్లాడు. షో కేసుల్లో బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు రూరల్ సీసీఎస్ అదనపు ఎస్పీ శోభామంజరి, సత్తెనపల్లి డీఎస్పీ ఎన్ఆర్ వెంకటేశ్వరనాయక్, క్రైం డీఎస్పీ శ్రీనివాసరావు, సత్తెనపల్లి టౌన్ సీఐ శోభన్‌బాబు, సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. షాపు వెనుకభాగాన సీలింగ్‌కు, పైకప్పుకు మధ్య ఉన్న గోడకు నాలుగు పలకలుగా కన్నం వేసి దుండగులో షాపులోకి వచ్చినట్లు గుర్తించారు. అక్కడ రెండు మద్యం సీసాలు పడివుండడంతోపాటు అన్నం తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. గోడ పగులగొట్టేందుకు ఉపయోగించిన పెద్దసైజు ఉలి కూడా లభ్యమైంది. గోడను కట్ చేసేందుకు ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్‌కు ఉపయోగించే విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి కట్టర్ సహాయంతో గోడను కట్‌చేసి, ఉలితో గోడకు ఉన్న ఇటుకలను ఒక్కొక్కటి జాగ్రత్తగా తొలగించి మనిషి పట్టేవిధంగా నాలుగు పలకలుగా రంధ్రం చేసి, జాగ్రత్తగా కిందకు దిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షో కేసుల్లోని మూడు కిలోల బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లోని రూ.8 లక్షల నగదు అపహరించారు. వారు వెండి వస్తువుల జోలికి వెళ్లలేదు. ఆభరణాల్లో బ్రాస్లెట్స్, నెక్లెస్‌లు, ఉంగరాలు, వంద గ్రాముల బరువుగల మూడు బంగారు బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం రూ.70లక్షల నుంచి 80 లక్షల వరకు విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నారని బాధితుడు మణికంఠ తెలిపారు. తన తండ్రి పత్తి వ్యాపారానికి సంబంధించి రూ.8 లక్షల నగదును షాపులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని కోణాల్లో పరిశోధన చేశారు. సాయంత్రం వచ్చిన డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలం నుంచి సత్తెనపల్లి రోడ్డులోని సాయిబాబా గుడివరకు వెళ్లి ఆగిపోయింది. షాపు యజమానుల విచారణ.. షాపు యజమాని బొగ్గవరపు పుల్లారావు, ఆయన కుమారుడు మణికంఠలను విచారిం చారు. క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన పుల్లారావు రెండేళ్ల క్రితం అచ్చంపేటలో జ్యూయలరీ షాపు నెలకొల్పాడు. తాను పత్తి వ్యాపారం చేసుకుంటూ జ్యూయలరీ షాపును కుమారుడు మణికంఠకు అప్పగించారు. ఆరు నెలలుగా మణికంఠ జ్యూయలరీ షాపు పూర్తి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. వారం రోజుల క్రితం షాపు పైకప్పు పాక్షికంగా దెబ్బతినడంతో మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలో షాపులో చోరీ జరగడంతో తాపీ మేస్త్రీలు, విద్యుత్ వర్కర్లపైనా, ఇతరత్రా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యూయలరీ వ్యాపారం కూడా ఒడిదుడుకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చోరీ కేసును ఛేదిస్తామని ఏఎస్పీ శోభామంజరి పేర్కొన్నారు. -
దారికాచి.. కత్తులతో బెదిరించి
షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులో శుక్రవారం అర్ధరాత్రి దారిదోపిడీ దొంగలు హల్చల్ చేశారు. మూడు లారీలను ఆపి కత్తులు, గొడ్డళ్లు చూపిస్తూ లారీ డ్రైవర్ల వద్ద అందిన కాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డుపై మూడు అడుగుల ఎత్తున గడ్డి కనిపించింది. అదే సమయంలో షాద్‌నగర్ నుంచి పరిగి వైపు వెళ్తున్న మూడు లారీలు వాటిని దాటలేక ఆగిపోయాయి. అక్కడే చెట్ల పొదల్లో దాగి ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లారీ డ్రైవర్లకు కత్తులు, గొడ్డలి చూపిస్తూ బెదిరించారు. వాహనాల లైట్లు ఆర్పించిన అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులివ్వాలని హెచ్చరించారు. ప్రాణభయంతో వారివద్ద ఉన్న సుమారు రూ.16వేల నగదును దొంగల చేతిలో పెట్టగా క్షణాల్లో వాటిని తీసుకొని పొదల్లోకి వెళ్లి పారిపోయారు. సంఘటననుంచి తేరుకున్న లారీ డ్రైవర్లు తమ సెల్‌ఫోన్ ద్వారా 100 నంబరుకు డయల్ చేసి పోలీసులకు విషయం తెలియచేశారు. సంఘటన స్థలానికి కొందుర్గు ఎస్ఐ సత్యనారాయణ చేరుకొని పరిశీలించారు. ఎస్ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి వచ్చే వరకు రోడ్డుపై ఉన్న గడ్డిని తొలగించకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఆర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం ఆయన సిబ్బందితో ట్రాఫిక్ క్లియర్ చేయించి సమీపంలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో విచారించారు. లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దారిదోపిడీ ముఠా అరెస్టు
పెదనందిపాడు: దారిదోపిడీలకు పాల్పడడమేకాకుండా.. నకిలీ బంగారం అమ్మి, మహిళలను మోసంచేసే ఐదుగురు సభ్యుల ముఠాను పెదనందిపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ టి.శోభామంజరి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లా, భగత్‌కోటి గ్రామానికి చెందిన సోలంకి మకియా, పరమార్ శంభు, పరమార్ నందు, పరమార్ ధర్మ, సోలంకి మిధున్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నివాసం ఉంటూ.. బొమ్మలు అమ్ముకుంటూ, పాత గుడ్డలు కొంటూ ప్రజల మధ్య జీవనం చేస్తున్నట్లు నటిస్తారు. పగటి వేళల్లో ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహిస్తూ మహిళల వద్దకు వెళ్లి ‘ మా వద్ద బంగారం ఉంది, డబ్బు అవసరమై మీకు తక్కువ రేటుకు అమ్ముతాం’ అంటూ నమ్మబలుకుతారు. వారు చెక్ చేసుకోవాడానికి మంచి బంగారం ఇచ్చి, వారు కోనేప్పుడు మాత్రం నకిలీ బంగారు ఇస్తుంటారు. ఈ విధంగా తమ వద్ద ఉన్న 11 కేజీల నకిలీ బంగారాన్ని అమ్మే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈనేపథ్యంలో గత నెల 27న పెదనందిపాడు మండలం పాలపర్రు వచ్చినట్లు సమాచారం. నకిలీ బంగారం అమ్మే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మరో అడ్డదారి పట్టారు. ఈ నేపథ్యంలో గత నెల 29న ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన గుంజి నాగేశ్వరరావు, గుంజి నాగరాజులు జామాయిల్, సరివి తోటలు కొనుగోలు చేసేందుకు రూ.5 లక్షల నగదు వెంట తీసుకుని ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట వచ్చారు. అక్కడ తోటల గురించి విచారించి చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు మీదుగా ద్విచక్రవాహనంపై బాపట్ల వెళుతున్నారు. మార్గంమధ్యలో పాలపర్రు గ్రామం దాటిన తర్వాత ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుతగలడంతో వారు ద్విచక్ర వాహనం ఆపగా.. అక్కడే దాక్కొని ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వాహనాన్ని చుట్టుముట్టారు. కత్తులతో ద్విచక్ర వాహనంపై ఉన్నవారిని బెదిరించి వారి వద్ద ఉన్న రూ.5లక్షల నగదును లాక్కొని పొలాల్లో గుంటూ పరుగులు తీశారు. హఠాత్పరిణామానికి బిత్తరపోయిన బాధితులు తేరుకుని సాయంత్రం పెదనందిపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై దర్యాప్తు చేస్తున్న పొన్నూరు రూరల్ సీఐ ఎం.వీరయ్య, ఎస్ఐ లోకేశ్వరరావు, పోలీసు సిబ్బందికి బుధవారం పాలపర్రు పొలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల గురించి కొంతమంది సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకోవడంతో వారిని చూసి అనుమానాస్పద వ్యక్తులు పరారయ్యారు. వారిని వెంబడించి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. విచారణలో వారు అసలు బంగారం చూపించి నకిలీ బంగారం అమ్మి మోసంతో డబ్బు సంపాదిస్తుంటారని వెల్లడైంది. దారిదోపిడీలు కూడా చేస్తుంటారని, ఒంటరిగా వెళ్లే వారిపై దౌర్జన్యం చేసి నగదు, బంగారు ఆభరణాలు అపహరిస్తుంటారని తేలింది. ఐదుగురు నిందితులను బాపట్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా కేసును పరిష్కరించడంలో ప్రతిభ కనబర్చిన సీఐ ఎం.వీరయ్యను, ఎస్ఐ ఎల్.లోకేశ్వరరావు, ఏఎస్ఐ, కానిస్టేబుళ్లను అభినందించారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
చ్రందధన (తలకొండపల్లి) : గుప్తనిధుల కోసం దుండగులు ఓ ఆలయంలోని విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే... తలకొండపల్లి మండలం చంద్రధన శివారులోని క్యారమ్ బావి వద్ద పురాతన కాళికాదేవి ఆలయం ఉంది. అందులో గుప్తనిధుల ఉంటాయని భావించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాని పైకప్పును కూలగొట్టి లోపల ఉన్న విగ్రహాన్ని పెకిలించి బయటకు పడేసి కింద భాగంలో గజంలోతు తవ్వారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం అక్కడికి పూజలు చేయడానికి వచ్చిన గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి శిక్షించాలని సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రాములు డిమాండ్ చేశారు. -
ముఖం గుర్తుపట్టడానికి 90 సెకన్లు చాలు: సుప్రీం
న్యూఢిల్లీ: దాడి జరిగిన చాలా ఏళ్ల తర్వాతైనా దానికి పాల్పడిన దుండగులను గుర్తుపట్టడానికి సాక్షికి 90 సెకన్లు చాలు అని సుప్రీం కోర్టు శుక్రవారం ఓ కేసు తీర్పులో పేర్కొంది. 1999లో పంజాబ్‌లో జరిగిన ఒక వ్యాపారి హత్య, అతని మిత్రులపై దాడి కేసులో జీవిత ఖైదు పడిన ఇద్దరు దోషుల వాదనను తోసిపుచ్చింది. నాటి ఘటన కేవలం నిమిషంన్నరలోపే ముగిసింది కనుక ప్రాసిక్యూషన్ సాక్షుల ముఖాలు తమకు తెలియవన్న నిందితుల వాదనను తిరస్కరించింది. -
వికలాంగుడి దారుణహత్య
- కలకలం రేపిన ఘటన - పరిశీలించిన డీఎస్పీ అడ్డాకుల : తన గుడిసె ఎదుట మంచంపై నిద్రిస్తున్న ఓ వికలాంగుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం... అడ్డాకులకు చెందిన గొల్ల ఈర్ల నాగన్న (39) పుట్టుకతో వికలాంగుడు. పదిహేనేళ్ల క్రితం వనపర్తికి చెందిన లక్ష్మితో వివాహం కాగా రెండేళ్లలోపే వదిలేశాడు. అనంతరం కొత్తకోటకు చెందిన కొండమ్మను పెళ్లి చేసుకున్నా ఆమెనూ విడిచి పెట్టాడు. ఈయనకు కొంత పొలం ఉండగా సుమారు పన్నెండేళ్ల నుంచి ఒంటరిగా జూనియర్ కాలేజీ పక్కన గుడిసె వేసుకుని సారా విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్న అతడిని గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో పాశవికంగా హత్య చేసి పారిపోయారు. బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు ఇది గమనించి వెంటనే వీఆర్ఓ బాలస్వామితో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని వనపర్తి డీఎస్పీ కంచి శ్రీనివాసరావు, కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్, అడ్డాకుల ఏఎస్ఐ మహ్మద్ ఇక్బాల్‌అహ్మద్ పరిశీలించారు. అక్కడ రెండు బీరు సీసాలు, క్వార్టర్ బాటిల్ ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. గుడిసె నుంచి హైవే వైపు కొద్దిదూరం వెళ్లి అది తిరిగొచ్చింది. అలాగే క్లూస్‌టీం ఏఎస్ఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో కలిసి వేలిముద్రలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, ఈ హత్యకు వివాహేతర సంబంధాలు లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులమంటూ అర్ధరాత్రి హల్చల్
- మహిళా సర్పంచ్‌ను రివాల్వర్‌తో బెదిరించిన దుండగులు - ద్విచక్రవాహనం, సెల్ ఫోన్‌తో పరారీ - అధికార పార్టీ నాయకులపైనే అనుమానం! చాగలమర్రి: పోలీసులమని చెప్పి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి హల్చల్ చేశారు. ముత్యాలపాడు గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వప్న ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా రివాల్వర్ చూపించి బెదిరించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనపై సర్పంచ్ స్వప్న బుధవారం చాగలమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. స్వప్న కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల మంటు వచ్చి లేపారు. మీ మరిది బాబావలి ఎక్కడా అంటూ ఆమెను అడగడంతో.. మీరు ఎవరు, ఈ సమయంలో ఎందుకు వచ్చారని సర్పంచ్ ప్రశ్నించారు. మేము పోలీసులమని, బాబావలిని సీఐ తీసుకురమ్మన్నాడని చెప్పారు. అతను ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మళ్లి ఈడ్చుకెళ్తామని బెదించారు. ఇంట్లో ఉన్న సామాన్లను చెల్లాచెదురు చేసి సెల్‌ఫోన్, బయట నిలిపిన ద్విచక్ర వాహానాన్ని తీసుకొని వెళ్లారు. ఈ మేరకు సర్పంచ్ స్వప్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్సర్‌బాష, జగదీశ్వరరెడ్డి, పుల్లయ్య, ముల్లా ఖాదర్‌బాష, స్వామిరెడ్డి ఎస్ఐ హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త మస్తాన్‌వలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1వ ఎంపీటీసీ స్థానానికి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో మరుసటి రోజు నుంచి టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులలో ఇరికించడమే కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు బనాయిస్తు మూడు నెలలుగా తన భర్తను జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మస్తాన్ వలి జైల్లో ఉండే కూడా ఎంపీటీసీగా గెలుపొందారని చెప్పారు. తన అనుచర ఎంపీటీసీలతో అధికార పార్టీలోకి రావాలని తన భర్తపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఇందులో భాగంగానే అర్ధరాత్రి మా ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణం పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భూమా నాగిరెడ్డి నాయకత్వాన్ని వదలి వెళ్లే ప్రసక్తే లేదని స్వప్న స్పష్టం చేశారు. -
కళ్లలో యాసిడ్ పోసి.. వేళ్లు నరికి...
పాట్నా: చిన్న వివాదంతో బీహార్‌లో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ గొడవను అడ్డుపెట్టుకుని వికాస్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిపై ఆరుగురు దుండగులు సమస్టిపుర జిల్లాలో గురువారం దాడికి పాల్పడ్డారు. కళ్లలోకి యాసిడ్ చిమ్మడంతోపాటు చేతి వేళ్లను నరికేశారు. గ్రామంలో జరిగిన ఘర్షణలే దీనికి కారణమై ఉంటాయని పోలీసులు వెల్లడించారు.