నవ దంపతులపై దుండగుల దాడి | thugs attacked on new couple | Sakshi
Sakshi News home page

నవ దంపతులపై దుండగుల దాడి

Published Thu, Feb 19 2015 9:35 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

thugs attacked on new couple

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం-గొల్లప్రోలు వద్ద బుధవారం అర్థరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. సినిమాకు వెళ్లి వస్తున్న నవ దంపతులపై మద్యం సీసాలతో దాడిచేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వివరాలు.. గొల్లప్రోలు మండలానికి చెందిన తాతపూడి సురేష్, జయ దంపతులు బుధవారం కాకినాడ వెళ్లారు. ఈ క్రమంలో ఆరోజు మధ్యాహ్నం సినిమా చూసి సాయంత్రం బీచ్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో జయకు కడుపులో నొప్పి రావడంతో శోంటవారిపాకలు సమీపంలో విశ్రాంతి కోసం ఆగారు.

ఆ సమయంలో వెనుక నుంచి బైక్‌పై మద్యం తాగుతూ వస్తున్న ఇద్దరు దుండగులు వీరిపై దాడి చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, శతమానాలు, ఉంగరాలు, వెండిపట్టీలు దోచుకున్నారు. ఈ దాడిలో జయను దుండగులు బీర్ సీసాతో కొట్టడంతో గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement