
సాక్షి, అన్నమయ్య జిల్లా: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులకు కూడా రక్షణ కొరవడింది. మదనపల్లి పట్టణం దేవతా నగర్‌లో ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. కొడవలితో నరికేందుకు యత్నించారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావుపై కొడవలితో దాడి చేసేందుకు యత్నించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు మొబైల్ ఫోన్,విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్ మొబైల్ ఫోన్‌లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో డ్రైవర్ గణేష్ గాయపడ్డారు. ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని అధికారులు కోరారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు, వీఆర్వో ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment