సాక్షి, తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేశారు.
తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం భన్సల్. మరోవైపు.. వరద నీటి భారీగా వచ్చి చేరుతుండటంతో స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద 7 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు అధికారులు. బాలిరెడ్డిపాలెం-గంగన్నపాలెం మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఏడు అడుగులకు చేరుకుంది. దీంతో, 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రోడ్లు, ఆనకట్టలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు.
జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062
సూళ్లూరుపేట ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020
తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040
శ్రీకాళహస్తి ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474
Comments
Please login to add a commentAdd a comment