Bihar: మళ్లీ పోలీసులపై దాడి | bihar-munger-violent-mob-again-attacked-the-policemen | Sakshi
Sakshi News home page

Bihar: మళ్లీ పోలీసులపై దాడి

Published Mon, Mar 17 2025 1:53 PM | Last Updated on Mon, Mar 17 2025 1:53 PM

bihar-munger-violent-mob-again-attacked-the-policemen

బీహార్‌: బీహార్‌లో పోలీసులపై దాడులు ఆగడం లేదు. ముంగేర్‌ జిల్లాలో ఏఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ హత్యోదంతం మరువకముందే డయల్‌ 112 విభాగంలో పనిచేస్తున్న మరో పోలీసు కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్‌ గాయపడ్డారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం హవేలీ ఖడంగ్‌ర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫసియాబాద్‌లో ఆదివారం రాత్రి దొంగతనం ఆరోపణతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని పంచాయతీ భవనంలో బంధించి, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ యువకులను తమతో పాటు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే గ్రామీణులు పోలీసులను అడ్డుకుంటూ, వాగ్వాదానికి దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బబ్లూ రజక్‌ అనే పోలీసు గాయపడ్డారు. పరిస్థితి కాస్త సద్దుమణిగాక పోలీసులు ఆ  ఇద్దరు యువకులను తమతోపాటు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్‌ టీజింగ్‌ స్క్వాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement