సిగరెట్ కావాలని వచ్చి గొలుసు చోరీ | Cigarette wants Come chain of theft | Sakshi
Sakshi News home page

సిగరెట్ కావాలని వచ్చి గొలుసు చోరీ

Published Tue, Jun 21 2016 4:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Cigarette wants Come chain of theft

కిరాణా దుకాణం యజమానురాలి నుంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు
ఇబ్రహీంపట్నం: సిగరేట్ కావాలంటూ బైక్‌పై కిరాణా దుకాణానికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుపోయారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలోని సాహెబ్‌గూడకు చెందిన వట్నాల పుష్పలత(35) స్థానికంగా ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం ఇంటిగంట సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆమె దుకాణం వద్దకు వచ్చారు. సిగరెట్ కావాలని అడిగారు. దీంతో పుష్పలత సిగరెట్ ఇచ్చేంతలోపు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు.

ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో, తాజాగా సోమవారం సాహెబ్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement