థానే: అతడొక చైన్ స్నాచర్.. అయితేనేం కళ్లు చెదిరేలా పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే కన్నుకుట్టేలా టాప్ గజదొంగలంతా అతడి వివాహానికి హాజరయ్యారు. ఈ తంతు మొత్తాన్ని పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయలేకపోయారు. తాము వెతుకుతున్న దొంగలు, పాత కేసులు ఉన్న దొంగలు, పలు నేరాలు చేసినవారు స్పష్టంగా దొరికి తప్పించుకున్నవాళ్లు ఈ పెళ్లికి హాజరవుతున్నారని తెలిసి వారిని పరిశీలించిన పోలీసులు చివరకు ఎలాంటి చర్యకు దిగకుండానే చూస్తూ ఉండిపోయారు.
మొత్తం 1000 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకాగా అరెస్టులువంటి చర్యలకు దిగితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని వారంతా వెనుకడుగు తౌఫిక్ అనే వ్యక్తి ఆంబ్విలి ప్రాంతంలో పేరు మోసిన దొంగ, చైన్‌స్నాచర్. అతడికి సోహ్రా అనే యువతికి ఆదివారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన వారు మాములు వాళ్లు కాదు.. అంతా భారత్‌లోని టాప్ చైన్ స్నాచర్లు, సీజన్ వారిగా దొంగతనాలకు పాల్పడే వారు, మాస్టర్ దొంగలు. దాదాపు 20 మంది పోలీసులు ఈ వివాహంపై నిఘా వ్యవహరించారు.
తౌఫిక్‌పై దాదాపు 25 కేసులు ఉన్నాయంట. అతడు తన అత్త కూతురు సోహ్రా(15)ను వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా చేతికి దొరక్కుండా తిరుగుతున్న తౌఫిక్‌ను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై తాజాగా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, కర్ణాటక, ముంబయి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే వారంతా ఈ వివాహానికి హాజరయ్యారు.
దొంగ పెళ్లికి బడా దొంగలు.. పోలీసులు షాక్!
Published Tue, Jan 31 2017 4:10 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
Advertisement
Advertisement