న్యూఢిల్లీ: దాడి జరిగిన చాలా ఏళ్ల తర్వాతైనా దానికి పాల్పడిన దుండగులను గుర్తుపట్టడానికి సాక్షికి 90 సెకన్లు చాలు అని సుప్రీం కోర్టు శుక్రవారం ఓ కేసు తీర్పులో పేర్కొంది. 1999లో పంజాబ్‌లో జరిగిన ఒక వ్యాపారి హత్య, అతని మిత్రులపై దాడి కేసులో జీవిత ఖైదు పడిన ఇద్దరు దోషుల వాదనను తోసిపుచ్చింది. నాటి ఘటన కేవలం నిమిషంన్నరలోపే ముగిసింది కనుక ప్రాసిక్యూషన్ సాక్షుల ముఖాలు తమకు తెలియవన్న నిందితుల వాదనను తిరస్కరించింది.