witness
-
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
‘ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని చూశా’
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీలో అతనిపై కాల్పులు జరిపిన వ్యక్తిని తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. ఈవెంట్ గ్రౌండ్‌కు సమీపంలో ఉన్న భవనం పై నుంచి అతను డొనాల్డ్‌పై కాల్పులు జరిపాడని తెలిపారు. అతను భవనంపైకి రైఫిల్‌తో చేరుకున్నాడని ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ మీడియాకు తెలిపారు.తాను భవనంపై అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి గురించి పోలీసులకు, సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా ట్రంప్ తన ఎన్నికల ర్యాలీలో వేదికపైకి వచ్చిన కొద్దిసేపటికే ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైనట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపైకి వచ్చి, ట్రంప్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ట్రంప్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని సమాచారం.ఈ ఘటన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తన కుడి చెవి పై భాగానికి బుల్లెట్ తాకిందని తెలిపారు. తుపాకీ పేలిన శబ్దం వినిపించిన వెంటనే ఒక బుల్లెట్ తన చెవి చర్మం గుండా వెళ్లిందన్నారు. దీంతో ఏదో తప్పు జరిగిందని అనిపించిందని ట్రంప్ పేర్కొన్నారు. WATCH: Shooter at Trump rally opened fire from the roof of a nearby building pic.twitter.com/AgMbtLqKEe— BNO News (@BNONews) July 14, 2024 -
‘వాళ్లు మనుషులు కాదు.. హింసే పైశాచిక ఆనందం’
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ దళాలను అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేస్తోంది. అక్టోబర్ 7న మొదటి సారి హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడంతో దానికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. అయితే యుద్ధం కారణంగా ఎందరో అమాయకులు బలయ్యారు. అనాగరికమైన హమాస్ దళాల కిరాతకమైన ప్రవర్తనను ఒక వారి దాడుల నుంచి బయటపడిన ఓ వ్యక్తి తాను ప్రత్యక్షంగా చూసిన హమాస్ ఆగడాలను ఓ మీడియా సంస్థకు తెలియజేశారు. హమాస్ దాడుల నుంచి బయటపడిని రాజ్ కోహెన్.. తాను ప్రత్యక్షంగా చూసిన హమాస్‌కు సంబంధంచిన దారుణమైన ఘటనను వెల్లడించారు. ఒక మహిళను ఐదుగురు హమాస్ సాయుధులు పట్టుకొని.. ఆమెను చుట్టుముట్టారు. తర్వాత ఆమె బట్టలు విప్పి పైశాచిక ఆనందం పొందారు. అక్కడితో ఆగకుండా ఆమెపై ఒకరు అత్యాచారం చేసి మరీ కత్తితో దారుణంగా హత్య చేశారు. పశు ప్రవృత్తిగల ఆ వ్యక్తి మళ్లీ ఆ మహిళపై అత్యాచారం చేశాడని రాజ్ కోహెన్ ఒకింత బాధతో తెలిపారు. వాళ్లు ఎప్పుడూ పెద్దగా నవ్వుతూ ఉంటారని అన్నారు. ఇలా పైశాచికంగా ప్రవర్తించడం వారికి ఓ ఆనందమని అన్నారు. ఇదే పైశాచిక ఆనందం కోసం.. చాలా మందిని వారు పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. బాధింపబడిన మహిళ మరో మహిళతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే.. ఆమె స్నేహితురాలను సైతం హమాస్ దళాలు చంపేశాయని రాజ్ తెలిపారు. హమాస్ దళాలు తనపై కాల్పుల జరుగుతున్న సమయంలో పరుగెత్తుకుంటూ వారికంట కనబడకుండా ఓ పొదలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ చేతిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా.. ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో 22000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. చదవండి: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్ -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
కోర్టు బోనులో నిలబడనున్న బ్రిటన్ రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
లండన్: బ్రిటన్ రాజు చార్లెజ్-III రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా లండన్ హైకోర్టులో బోనులో(విట్నెస్ బాక్స్) నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 1890 నుంచి గత 130 సంవత్సరాల్లో కోర్టులో సాక్ష్యం చెప్పిన తొలి బ్రిటన్ రాజకుటుంబీకుడిగా హ్యారీనే కావడం విశేషం. కాగా ప్రిన్స్ హ్యారీతోపాటు సినిమా, క్రీడా రంగానికి చెందిన దాదాపు 100 మందికిపైగా ప్రముఖులు బ్రిటిష్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్‌పై లండన్ కోర్టులో దావా వేశారు.జర్నలిస్టులు, వారు నియమించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు భారీ స్థాయిలో ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, మోసపూరితంగా వ్యక్తిగత వివరాలను పొందడంతోపాటు ఇతర అక్రమ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. 1991 నుంచి 2011 వరకు సదరు పత్రిక విస్తృతంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మే 10న విచారణ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు తన నిర్ధిష్ట కేసు విచారణలో భాగంగా హ్యారీ సాక్ష్యం ఇవ్వనున్నారు. అయితే 1870లో విడాకుల కేసులో ఎడ్వర్డ్ VII కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. అనంతరం 20 ఏళ్లకు కార్డ్ గేమ్‌పై కేసు విచారణలో మరోసారి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ రెండు ఆయన రాజు కావడానికి ముందే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పడం ఇదే తొలిసారి. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు
నేపాల్ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్, ప్రజ్వల్ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు. కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్ క్రాష్ అయినంత సౌండ్ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు. మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..) -
నేరుగా ఓటీటీలోకి ‘విట్నెస్’
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి. సెల్వ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘విట్నెస్’. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గాను చేశారు దీపక్. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేరుగా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘పారిశుద్ధ్య కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. పార్తీపన్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ మరణిస్తాడు. అప్పుడు అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం ఎలా పోరాడింది? అనే నేపథ్యంలో మూవీ ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఇథియోపియాలో ఘర్షణలు.. 200 మందికిపైగా మృతి
నైరోబీ: ఇథియోపియాలో శనివారం రెండు జాతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమ్రాహా తెగకు చెందిన 200 మందికిపైగా జనం మృతిచెందారు. ఒరోమియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. దేశంలో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. తాను 230 మృతదేహాలను లెక్కించా నని గింబీ కౌంటీకి చెందిన స్థానికుడు అబ్దుల్–సయీద్ తాహీర్ చెప్పారు. మృతదేహాలను అధికారులు సామూహికంగా ఖననం చేశారు. పునరావాస పథకం కింద 30 ఏళ్ల క్రితం ఇక్కడ స్థిరపడిన అమ్రాహా తెగపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్ డీల్ సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు
సాక్షి, అమరావతి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్ వివేకా అల్లుడు, కుమార్తె తనను వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణభయం కూడా ఉందని పోలీసులను, న్యాయస్థానాన్ని వేడుకున్న కల్లూరి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంటే ఎవరి మీద సందేహం కలగాలి? ఆయన అంతకుముందు ఫిర్యాదులో పేర్కొన్న వారిపైనే కదా? టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: ఈ పాపం బాబుది కాదా? రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దీన్ని సాధనంగా వాడుకునే కుట్రకు బరి తెగించాయి. గంగాధరరెడ్డి గురువారం అనంతపురం జిల్లా యాడికిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తనకు ప్రాణభయం పొంచి ఉందని, తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయని గతంలో గంగాధరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి కుట్రకు గంగాధరే అడ్డంకి.. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుట్రలను సమర్థంగా అడ్డుకుంది గంగాధర్‌రెడ్డి అని పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో చంద్రబాబు సర్కారు, అనంతరం సీబీఐ అధికారులు, వివేకా కుమార్తె, అల్లుడు ఎంత వేధించినా గంగాధరరెడ్డి ఒప్పుకోకపోవడంతో వారి ఎత్తుగడలు ఫలించలేదు. అతడు జీవించి ఉండటం వారికి ప్రతికూలంగా పరిణమించే అంశం అన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి అనుమానస్పద మృతి వెనుక వారి పాత్ర ఉండొచ్చన్న వాదనకు బలం చేకూరుతోంది. ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు టీడీపీ అధికారంలో ఉండగా 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. అందులో భాగంగానే నాడు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగింది. సిట్ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్ విచారణ పేరిట గంగాధర్‌రెడ్డిని వేధించారు. వివేకా హత్యకు వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు ఒప్పుకోవాలని గంగాధరరెడ్డిని వేధించారు. చిత్రహింసలకు గురి చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు. రాంసింగ్ వేధింపులు అనంతరం సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అదే కుట్ర కొనసాగడం గమనార్హం. సీబీఐ అధికారి రాంసింగ్ 2021 అక్టోబరు 3, 4వ తేదీల్లో గంగాధర్‌రెడ్డికి వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా యాడికిలో ఉన్న గంగాధర్‌రెడ్డి నివాసానికి వెళ్లి అదే రీతిలో ఒత్తిడి తెచ్చారు. విచారణ పేరిట 2021 అక్టోబరు 4న కడప తీసుకొచ్చారు. వివేకా ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు ఆయన నిద్రలేవడంతో హత్య చేసినట్లు అంగీకరించాలని శివశంకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారని, అలా చెబితే రూ.10 కోట్లు ఇస్తామన్నారని వాంగ్మూలం ఇవ్వాలని రాంసింగ్ ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులే ఓ వాంగ్మూలం రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలని, న్యాయస్థానంలో అదే విషయం చెప్పాలని వేధించారు. కానీ తనకు తెలియని విషయాలను తెలిసినట్లు చెప్పనని గంగాధర్‌రెడ్డి స్పష్టం చేశాడు. ఆ విషయంపై సీబీఐ అధికారులతో ఘర్షణకు పడ్డారు. తాము అనుకున్నట్లు గంగాధర్‌రెడ్డి సాక్ష్యం ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సైతం నివేదించడం గమనార్హం. వివేకా కుమార్తె, అల్లుడి బెదిరింపులు.. మరోవైపు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా గంగాధర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సమీప బంధువులైన నర్రెడ్డి జగదీశ్వరరెడ్డి, భువనాల బాబురెడ్డి యాడికి వెళ్లి గంగాధర్‌రెడ్డిని కలిశారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలే వైఎస్ వివేకాను హత్య చేయించినట్లు చెబితే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు కిడ్నీ చికిత్సకు వైద్య ఖర్చులు కూడా భరిస్తామన్నారు. రూ.15 వేలు అడ్వాన్సు కూడా ఇచ్చారు. వారి బెదిరింపులు భరించలేక గంగాధర్‌రెడ్డి 2021 నవంబరు 25న పులివెందుల రింగ్ రోడ్డు వద్ద వైఎస్ సునీతను కలిశారు. సీబీఐ అధికారులు సూచించినట్లుగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఆమె చెప్పారు. అయితే అందుకు గంగాధర్‌రెడ్డి తిరస్కరించాడు. పోలీసులకు ఫిర్యాదు... కోర్టులో కేసు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్‌రెడ్డి తిరస్కరించడంతో ఆయనకు బెదిరింపులు తీవ్రమయ్యాయి. నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, భువనాల బాబురెడ్డితోపాటు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి పలు బెదిరింపు కాల్స్ రావడంతో అనంతపురం పోలీసులకు 2021 నవంబరు 29న ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అప్పటికీ బెదిరింపు కాల్స్ ఆగకపోవడంతో తాడిపత్రి న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, భువనాల బాబురెడ్డిల నుంచి తనకు ప్రాణ హాని ఉందని... సీబీఐ అధికారులు వేధిస్తున్నారని... గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆ కేసు విచారణలో ఉండగానే గంగాధరరెడ్డి తీవ్ర అనారోగ్యం బారిన పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో వెల్లడిస్తూ గంగాధరరెడ్డి పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారో అనుమానాస్పద మృతి వెనుక కూడా వారి ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తమ కుట్రకు అడ్డంకి అనే తప్పించారా? వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు గంగాధర్‌రెడ్డి సహకరించకపోవడం ‘కొందరికి’ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్‌రెడ్డి సమ్మతించకపోవడంతో వారి కుట్ర ముందుకు సాగలేదు. దీంతో గంగాధర్‌రెడ్డిని అడ్డు తప్పించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపులకు లొంగకుండా, తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండా గంగాధరరెడ్డి నిలబడటం కచ్చితంగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు అనుకూల అంశం. కాబట్టి వారు గంగాధర్‌రెడ్డి క్షేమాన్ని కోరుకుంటారు. తమ కుట్రకు గంగాధరరెడ్డి సహకరించ లేదని భావిస్తున్న వారే అతడిని అడ్డు తొలగించా లని ప్రయత్నిస్తారు. దీన్నిబట్టి గంగాధర్‌రెడ్డి తనకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారు వివేకా కుమార్తె, ఆమె భర్తకు సమీప బంధువులు కావడం గమనార్హం. బాబు.. బెంబేలు శవ రాజకీయాలపై పేటెంట్ హక్కులున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. గంగాధర్‌రెడ్డి అనుమానస్పద మృతిపై ఆయన స్పందన మరిన్ని సందేహాలకు తావిస్తోంది. టీడీపీ సర్కారు హయాంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన గంగాధర్‌రెడ్డి మృతి చెందడంతో ఆందోళనకు గురైన చంద్రబాబు, లోకేశ్ దీనికి రాజకీయ రంగు పులిమేందుకు అవాస్తవ ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. గంగాధర్‌రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తు కోరితే తమ బండారం బట్టబయలవుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
IAF Helicopter Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’
భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ బుధవారం కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని మొదట చూసిన ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి కథనం ప్రకారం.. ఆ పరిసరాల్లో తాను ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి శబ్దం విన్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపాడు. అక్కడ చూడగా.. ఓ చాపర్ చెట్టును ఢీ కొట్టి, మంటలు చెలరేగాయని తెలిపాడు. అదే క్రమంలో హెలికాప్టర్ మరో చెట్టును ఢీ కొట్టడం కళ్లారా చూశానని తెలిపాడు. ఈ ఘటనలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడిపోవడం తాను చూశానని అతను చెప్పాడు. ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా, ప్రమాదం జరిగిన హెలీకాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. Krishnaswamy was the first eyewitness at the crash site. 'Heard a loud noise & that's when I saw the copter approaching. As it was descending, it caught on fire. It crashed into a big tree & was immediately engulfed in smoke. Then the entire chopper caught on fire.'@TheQuint pic.twitter.com/HMP4LEH396 — Smitha T K (@smitha_tk) December 8, 2021 చదవండి: TN Army Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 11 మంది మృతి -
ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం.. అత్యంత బలహీనమైన సాక్ష్యమే: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరం జరిగిన సమయంలోనే నిందితుడిని మొదటిసారి చూసి, ఆ తర్వాత కోర్టులో ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం అనేది అత్యంత బలహీనమైన సాక్ష్యాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోనూ నేరం జరిగిన తేదీకి, కోర్టులో విచారణ జరిగే సమయానికి మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మరింత బలహీనంగా మారుతుందంది. మద్యం అక్రమ రవాణా కేసులో కేరళ అబ్కారీ చట్టం కింద దోషులుగా నిర్ధారించిన నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చదవండి: (‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’) నలుగురు వ్యక్తులు 6,090 లీటర్ల మద్యాన్ని 174 ప్లాస్టిక్ క్యాన్లలో ఉంచి తప్పుడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో తరలిస్తున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 11 ఏళ్ల నాటి ఘటనలో మొదటిసారి ఆ వ్యక్తుల్ని చూసినందున వారిని గుర్తు పట్టలేకపోతున్నానని సాక్షి పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరిని మాత్రం ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గుర్తు పట్టగలిగారు. దీంతో సుప్రీంకోర్టు ఆ సాక్ష్యం చెల్లదని ప్రకటించింది. నలుగురు నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్గా తీసుకెళతారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్ అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్కు.. షాద్‌నగర్ ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్‌ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం
వాషింగ్టన్: అత్యాచార కేసులో చిలుక సాక్ష్యంగా మారనుంది. తన యజమానురాలి చివరి మాటలను నోటి వెంట పలుకుతూ ఆమె చావుకు కారణమైన వారిని కటకటాల వెనక్కు నెట్టనుంది. ఈ అరుదైన ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది. సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజబెత్ టోలెడొ అనే మహిళ ఇంటిపైభాగంలో ముగ్గురు వ్యక్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్దరు దుండగులు అద్దెకిచ్చిన మహిళపైనే కన్నేశారు. 2018 డిసెంబర్లో ఓ రోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా వారికి "ప్లీజ్, నన్ను వదిలేయండి" అంటూ అర్థిస్తున్న శబ్ధాలు వినిపించాయి. శబ్ధాల ఆధారంగా ఇంట్లోకి వెళ్లి చూడగా.. నగ్నంగా, విగతజీవిగా పడి ఉన్న మహిళ శవం పక్కన బోనులో ఉన్న చిలుక పలుకులు వినిపించాయి. (యాజమాని వద్దు! స్వేచ్ఛే ముద్దు) మహిళను హింసిస్తూ, అత్యాచారం చేసినప్పుడు ఆమె వేడుకున్న ఆర్తనాదాలను చిలుక గ్రహించి వాటినే ఉచ్ఛరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటన కన్నా ముందు నిందితులు ఇంట్లోకి చొరబడిన వెంటనే చిలుక "నన్ను ఎందుకు కొడుతున్నారు?" అంటూ యజమాని మాటలను తిరిగి పలికింది. ఈ మాటలను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో చిలుక పలుకులను సాక్ష్యంగా చేర్చారు. మరోవైపు పోస్టుమార్టంలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. త్వరలోనే కేసు విచారణకు రానుండగా చిలకను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు -
మంత్రి సమక్షంలో ప్రత్యక్షమైన కీలక సాక్షి
చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న అతడి పాలేరు తాతనబోయిన పున్నారావు బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. రైతు కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 18వ తేదీన కోటయ్యతోపాటు పున్నారావు కూడా పొలానికి తోడుగా వెళ్లాడు. కోటయ్య మరణించిన తర్వాత పున్నారావు కనిపించకుండా పోయాడు. పోలీసులు లేదా టీడీపీ నాయకులే అతడిని నిర్బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ పున్నారావు మంత్రి పుల్లారావు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అన్నారు. హెలీప్యాడ్‌కు సమీపంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భూమి కోటయ్య కౌలుకు సాగు చేస్తున్న విషయాన్ని దాటవేసి ఏమార్చే ప్రయత్నం చేశారు. అవాస్తవాలు చెప్పించే ప్రయత్నం... మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ నాయకులు పున్నారావును తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించారు. రైతు కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందాడని అతడితో చెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, పున్నారావు సమాధానాలు చెప్పలేక తడబడ్డాడు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. పోలీసులు నీ ఫోన్ తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. పున్నారావుకు సెల్‌ఫోన్ లేదని మంత్రి అనుచరులు చెప్పడంతో అవును నాకు ఫోన్ లేదని వంతపాడాడు. మరి కోటేశ్వరరావు మృతి చెందిన రోజు అతడి కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానన్నావుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఫోన్ ఉందని చెప్పాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తుండగానే టీడీపీ నాయకులు పున్నారావును బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
ఎట్టకేలకు సాక్షులకు రక్షణ
ఏ కేసులోనైనా సాక్షుల పాత్ర అత్యంత విలువైంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ సక్రమంగా సాగాలన్నా, అవి త్వరితగతిన పరిష్కారం కావాలన్నా సాక్షులే కీలకం. గత్యంతరం లేనప్పుడు మాత్రమే నేరం జరిగినప్పుడున్న పరిస్థితుల ఆధారంగా న్యాయస్థానాలు దోష నిర్ధారణ చేస్తాయి. చిత్రమేమంటే ఇంతటి ముఖ్య భూమిక పోషిస్తున్న సాక్షులకు మన దేశంలో కట్టుదిట్టమైన రక్షణ నిబంధనలు లేవు! ఈ స్థితి మారాలని, సాక్ష్యమిచ్చేవారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని న్యాయ కోవిదులు చాన్నాళ్లనుంచి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షుల పరిరక్షణకు సంబంధించిన ముసాయిదా పథకాన్ని కేంద ప్రభుత్వం రూపొందించటం, దాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆమోదించటం హర్షించదగిన విషయం. పార్లమెంటు ఒక చట్టం చేసేవరకూ వేచి ఉండకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ముసాయిదా పథకం అమలును ప్రారంభించాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా జీవించే హక్కు పరిధిని విస్తరించింది. న్యాయస్థానాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా సాక్ష్యమిచ్చే హక్కు కూడా ఈ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఇకపై బెదిరిం పులు, ఒత్తిళ్ల కారణంగా ఎవరైనా సాక్ష్యం చెప్పలేని స్థితి ఏర్పడితే అది రాజ్యాంగంలోని 21వ అధిక రణను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో సాక్షుల రక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. తమకుండే ప్రమా దాన్నిబట్టి విచారణ సమయంలో లేదా విచారణ పూర్తయిన కొన్నాళ్లవరకూ లేదా జీవితాంతం రక్షణ కల్పించాలని సాక్షులు కోరతారు. నేరాలకు పాల్పడేవారు తాము చేసే పనులకు సాక్ష్యా ల్లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తే తమకు శిక్ష పడే ప్రమాదం ఉంటుంది గనుక బెదిరింపులకు దిగుతారు. అవసరమైతే వారి ప్రాణాలు తీస్తారు. సాక్ష్యం చెప్పే వారు లేకపోవడం, వచ్చినా విచారణ దశలో వెనక్కు తగ్గడం లేదా బెదిరింపులకు భయపడి స్వరం మార్చడం వంటి కారణాల వల్ల మన న్యాయస్థానాల్లో కేసులు ఏళ్లతరబడి పెండింగ్ పడుతున్నాయి. ఆ తరహా కేసుల్లో నేరగాళ్లు శిక్ష పడకుండా తప్పించుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఆశారాం బాపుపై ఉన్న హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో 10 మంది సాక్షులపై దాడులు జరిగాయి. ముగ్గురు సాక్షుల ప్రాణాలు తీశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉనావ్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌సింగ్ సెంగార్‌పై ఉన్న అత్యాచారం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, అందులో సాక్ష్యమిచ్చిన బాధితురాలి బంధువు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కేసు నుంచి తప్పించు కోవడానికే అతన్ని హతమార్చారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 1న మహా రాష్ట్రలోని భీమా–కొరెగావ్‌లో తలెత్తిన ఘర్షణలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న 19 ఏళ్ల యువతి పూజా సాకేత్ మరో మూడునెలలకు బావిలో శవమై తేలింది. తమ కుటుంబానికి బెదిరింపులొస్తున్నా యని, కాపాడాలని అంతక్రితం ఆమె వినతిపత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది. సినీ నటుడు సల్మా న్‌ఖాన్ తాగి కారు నడిపి ఒకరి ప్రాణం తీసిన కేసులో అతని అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ సల్మా న్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన బెదిరింపుల పర్యవసానంగా మాన సికంగా కుంగిపోయి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అటుపై ఆ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యాడు. మొన్న అక్టోబర్‌లో కేరళ బిషప్‌పై వచ్చిన అత్యాచారం ఆరోపణల్లో సాక్షిగా ఉన్న క్రైస్తవ గురువు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. మన దేశంలో 1872నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం విచారణ ప్రక్రియలో సాక్షులకుండే రక్షణ గురించి మాట్లాడుతోంది. ఏదైనా కేసులో సాక్షిగా ఉండే వ్యక్తిని న్యాయస్థానంలో అనుచి తమైన లేదా ఆగ్రహం తెప్పించే ప్రశ్నలు వేయకూడదని అది నిర్దేశిస్తోంది. నిజానికి ఏ చట్టమూ సాక్షి పదానికి నిర్వచనం ఇవ్వడం లేదు. అందుకోసం మన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులపైనే ఆధారపడుతున్నాయి. 2006లో సాక్షుల రక్షణకు భారతీయ శిక్షాస్మృతిలో 195ఏ కింద కొత్త నిబంధన పొందుపరిచారు. ఈ సెక్షన్ కింద సాక్షుల్ని బెదిరించినా, వారి ఆస్తులు ధ్వంసం చేస్తామని హెచ్చరించినా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు సాక్ష్యంతో అమాయకులను ఇరికించి వారికి శిక్ష పడటానికి కారకులైనవారికి అదే రకమైన శిక్ష వేసేందుకు ఈ సెక్షన్ వీలు కల్పిస్తోంది. కానీ ఇది సమగ్రంగా లేదు. కనుకనే సుప్రీంకోర్టు ఇప్పుడీ ముసాయిదాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ముసాయిదా సాక్షులను మూడు రకాలుగా విభజించింది. దర్యాప్తు విచారణ సమయంలో లేదా ఆ తర్వాత సైతం ప్రాణాలకు ముప్పు ఉన్న సాక్షులు, వారి కుటుంబసభ్యులు మొదటి కేటగిరీలోకి వస్తారు. దర్యాప్తు/విచారణ సమయంలో ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నవారు రెండో కేటగిరీలోకి వస్తారు. దర్యాప్తు సమయంలో సాధారణమైన బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్నవారు మూడో కేటగిరీలోకి వస్తారు. సాక్షులు కోరితే వారి గుర్తింపు బయటపడకుండా న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, నిందితులూ, సాక్షులూ ఎదురుపడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం కూడా ముసాయిదాలో ఉన్నాయి. సాక్షు లను గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా ఛాయాచిత్రాల్లో వారి ముఖకవళికలు సవరించడం, ఆడియో ఫైల్స్‌ను వారి కంఠస్వరం పసిగట్టడానికి వీల్లేకుండా సాంకేతికంగా మార్చడం వంటివి కూడా ఇందులో చేర్చారు. ఇలాంటి రక్షణలు సహజంగానే సాక్షుల్లో ఉండే భయాన్ని పోగొడతాయి. కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడతాయి. ముసాయిదా సక్రమంగా అమలయ్యేలా చూసి, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలేమిటో గుర్తిస్తే మున్ముందు సమగ్రమైన చట్టం రూపకల్పనకు వీలవుతుంది. ఈ ముసాయిదాతో పని ముగిసిందని భావించకుండా సాధ్యమైనంత త్వరలో చట్టాన్ని రూపొందించటం కేంద్రం బాధ్యత. -
‘సాక్షుల భద్రత’కు సుప్రీం ఆమోదం
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో సాక్ష్యం చెప్పే వారి భద్రత కోసం కేంద్రం రూపొందించిన ‘విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం’ ముసాయిదాకు సుప్రీంకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో దీనిని చట్టం చేసేంత వరకు అన్ని రాష్ట్రాలు ఈ ముసాయిదాను అమలు చేయాలని ఆదేశించింది. రేప్ కేసులో అరెస్టయిన వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుస దాడులకు గురవడంతోపాటు అదృశ్యమవుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)లను సంప్రదించిన అనంతరం ఈ ముసాయిదాకు కేంద్రం తుదిరూపం దాల్చింది. -
నన్‌పై రేప్ కేసులో మలుపు
హోషియార్పూర్/కొట్టాయం: నన్‌పై రేప్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ బాధితురాలి మద్దతు దారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జలంధర్ బిషప్‌గా ఉన్న కేరళకు చెందిన ఫ్రాంకో ములక్కల్ తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నన్ ఒకరు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) హోషియార్పూర్ సమీపంలోని దసుయ చర్చి ఆవరణలోని తన గదిలో సోమవారం అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. ‘గదిలో వాంతులు చేసుకున్న ఆనవాళ్లున్నాయి. వాటిని ల్యాబ్‌కు పంపాం. ఫాదర్ కట్టుత్తరా శరీరంపై ఎటువంటి గాయాలు లేవు’అని డీఎస్పీ ఏఆర్ శర్మ తెలి పారు. ఫాదర్ కట్టుత్తరా పదిహేను రోజుల క్రితమే భోగ్‌పూ ర్ చర్చి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు చర్చి సిబ్బంది తెలిపారు. బిషప్కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన ఫాదర్ కట్టుత్తరా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతుండేవారని ఆయన బంధువులు తెలిపారని డీఎస్పీ వెల్లడించారు. కొట్టాయంలోని కురవిలంగడ్ కాన్వెం ట్లో బాధిత నన్‌తోపాటు ఉంటున్న మరో ఐదుగురు నన్‌లు తమ ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిషప్ ములక్కల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఫాదర్ కట్టుత్తరా మృతి వెనుక మిస్టరీ ఉందన్నారు. ముల క్కల్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేసిన వారికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
అంతా నిజమే చెప్పారు...
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబందిత, కుట్ర కేసుల విచారణలో ఇతర ఆధారాలతో పాటు సాక్షులకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అనేక కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సాక్షులు ఎదురు తిరిగిన (హోస్టైల్ కావడం) కారణంగా ఆ కేసులు వీగిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది న్యాయస్థానం కొట్టి వేసిన మక్కా మసీదులో బాంబు పేలుడు కేసే ఇందుకు తాజా ఉదాహరణ. అయితే జంట పేలుళ్ల కేసులో సాక్షులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. సోమవారం తీర్పు వెలువడిన 2007 నాటి జంట పేలుళ్ల కేసుల్లో 286 మంది సాక్షులు ఉండగా, అందులో ఏ ఒక్కరూ ఎదురు తిరగలేదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తామంతా ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూ చాటారు. నాడు చూసింది చూసినట్లు చెప్పడంలో ఏ మాత్రం వెనుకాడలేదు. ఫలితంగానే అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఇద్దరికి ఉరి, మరొకరికి జీవితఖైదు పడింది. నిందితుల్లో ఒకరైన ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌ను నిర్ధోషిగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని ప్రాసిక్యూషన్ నిర్ణయించింది. 2007 ఆగస్టు 25న జరిగిన జంట పేలుళ్లకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతాలపై ప్రాథమికంగా సైఫాబాద్, సుల్తాన్‌బజార్, మలక్‌పేట ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాద సంబందిత కేసులు కావడంతో వీటిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ జంట పేలుళ్ల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్‌కు తొలినాళ్లల్లో నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చారు. దీంతో సిట్ నుంచి ఈ మూడూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఆక్టోపస్ అధికారులు 2009 మే, జూన్ నెలలో మూడు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాది కాలానికే ఆక్టోపస్‌ను కేవలం కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీసు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. కేసు విచారణ మొత్తం వీరి పర్యవేక్షణలోనే సాగింది. గత కొన్ని నెలలుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసులను విచారించారు. అప్పట్లో లుంబినీపార్క్‌లో జరిగిన పేలుడులో మృతులు, క్షతగాత్రుల్లో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు. ఈ 11 ఏళ్లల్లో వారు చదువు పూర్తి చేసుకోవడంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి వివరాలన్నీ సేకరించిన దర్యాప్తు అధికారులు వాయిదాలకు తీసుకురావడం, వచ్చేలా వారిని ఒప్పించడం, బ్రీఫింగ్ ఇప్పించడం, సాక్ష్యం చెప్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు కేసుల్లో అత్యధికులు స్థానికులే సాక్షులుగా ఉన్నారు. ఆద్యంతం ఎక్కడా సాక్షుల వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారికి భరోసాను వారికి కల్పించి కోర్టు వరకు వచ్చేలా చేశారు. ఫలితంగానే ఈ నేరంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులకు ఉరి శిక్ష పడింది. సాక్ష్యం చెప్పిన 286 మందిలో ఓ ఉగ్రవాది బంధువు కూడా ఉండటం, ఆయన సైతం తన బంధువుతో పాటు ఇతర టెర్రరిస్టులకూ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం. మరోపక్క అభియోగాలు వీగిపోయిన ఇద్దరిలో సాదిఖ్‌పై ఇక్కడి కేసుల్లో సరైన సాక్షాలు లేవని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే ఫారూఖ్‌కు సంబంధించి మాత్రం నేరం నిరూపించగలమని, ఈ నేపథ్యంలోనే పై కోర్టులో తీర్పును సవాల్ చేస్తామని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో జీవితఖైదు పడిన తారీఖ్ అంజుమ్ హసన్ పాత్ర పరిమితమని ఆ శిక్ష సమంజసమే అని పేర్కొంటున్నారు. ఇదీ కేసుల్లో సాక్షుల సంఖ్య... కేసు సాక్షులు గోకుల్‌చాట్ పేలుడు 147 లుంబినీపార్క్ పేలుడు 93 దిల్షుక్నగర్ పేలని బాంబు 46 -
సాక్షులకు ఏదీ భరోసా!
సాక్షి,సిటీబ్యూరో: గతేడాది టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు... సోమవారం మక్కా మసీదులో పేలుడు కేసు... ఈ రెండూ వీగిపోవడానికి సాక్షులు ఎదురు తిరగడం కూడా ఓ ప్రధాన కారణం. నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించే సాక్షులకు భరోసా కల్పించడంలో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విఫలం అవుతున్నాయి. నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), నిందితులను పట్టుకోవడం (డిటెక్షన్), నిందితులను కోర్టులో దోషులుగా నిరూపించడం (కన్వెక్షన్)... ఈ మూడు పోలీసింగ్‌లో ప్రధాన అంశాలు. అయితే మొదటి రెండింటిలో పోలీసుల వైఫల్యం మాత్రమే ప్రధాన కారణం కాగా, మూడో అంశానికి సాక్షులు ప్రభావితం కావడం కూడా దోహదం చేస్తోంది. పోలీసులు ఎంత శ్రమించినా, ఆధారాలు సేకరించినా అనేక కేసుల్లో సాక్షులు ఎదురు తిరగడంతోనే శిక్షల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా నమోదైన కేసుల్లో 30 శాతం కూడా కోర్టుల్లో నిరూపితం కావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 2013లో భావించింది. అయితే ఇప్పటి వరకు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ‘ప్రత్యేక’ కేసుల్లో మాత్రమేఅదనపు చర్యలు... ప్రతి కేసునూ పోలీసులు ఒకే దృష్టిలో చూడాల్సి ఉంది. దర్యాప్తు, ఆధారాల సేకరణతో పాటు సాక్షుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం, భద్రతపై భరోసా కల్పించడం, న్యాయస్థానానికి ధైర్యంగా హాజరై సాక్ష్యం చెప్పేలా చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పోలీసు విభాగంలో సిబ్బంది కొరత నేపథ్యంలో అధికారులపై పని భారం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి గరిష్టంగా 60 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగలిగే దర్యాప్తు అధికారులు కనిష్టంగా 200 కేసులను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ కారణంగా వీటిలో సాక్షులు ఎవరన్నది గుర్తుపెట్టుకోవడం, తరచూ వారిని సంప్రదించడం సాధ్యం కావట్లేదు. కేవలం కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యం కలిగి ఉన్న వాటిలో మాత్రమే పోలీసు అధికారులు సాక్షుల కోణం పైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే సాక్షుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు ఉండాలన్న వాదన ఏళ్లుగా ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ‘నిద్రలేపిన’ జెస్సికా కేసు... సాక్షుల రక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఆలోచన కలగడానికి ప్రధాన కారణం జెస్సికాలాల్ కేసే. ప్రముఖ మోడల్స్‌లో ఒకరైన జెస్సికా 1999 ఏప్రిల్ 29న ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక మంది వీఐపీలతో ముడిపడిన దీని విచారణే కేంద్రం కళ్లు తెరిపించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై నేరం నిరూపించడం కోసం 101 మంది సాక్షులను ఎంపిక చేశారు. వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా... ఏకంగా 32 మంది ఎదురు తిరిగారు. దీనికి ప్రధాన కారణం నిందితుల తరఫున కొందరు రంగంలోకి దిగి సాక్షులను భయపెట్టడం ద్వారా ప్రభావితం చేసినట్లు గుర్తించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కేంద్ర హోం శాఖ కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో సాక్షులుగా ఉన్న వారికి రక్షణ కల్పించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది. అటకెక్కిన అంతర్జాతీయ అధ్యయనం.. సాక్షి రక్షణ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన కేంద్రం అందుకు అంతర్జాతీయంగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా దేశాల్లో అమలులో ఉన్న పద్దతులు, చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వీటన్నింటిలోంచి ఉత్తమ పద్దతులను క్రోడీకరించి, మన దేశంలో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణలోని తీసుకుంటూ ప్రత్యేక చట్టం రూపొందించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేతులు మారడంతో ప్రతిపాదనల స్థాయిలోనే ఈ చట్టం అటకెక్కింది. ఇది అమలులోకి వస్తే ప్రతి కేసులోనూ సాక్షుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉండేది. ఫలితంగా శిక్షల శాతం పెరిగి నేరాలు సైతం తగ్గుముఖం పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని మర్చిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఫలితంగా సాక్షులకు భరోసా లేక అనేక కేసులు వీగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ప్రేమ పెళ్లికి సాక్షి సంతకం పెట్టినందుకు..
హైదరాబాద్: స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తాం.. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వితం అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్నేహం కోసం ఏమి చేసినా తక్కువే అనిపిస్తుంది. అలాంటిది స్నేహం కోసం సాక్షి సంతకం పెట్టలేనా అని ఓ యువతి ముందడుగేసి, తన స్నేహితురాలి ప్రేమ పెళ్లికి సాక్షి సంతకం పెట్టింది. కానీ అదే ఆమె పాలిట శాపంగా మారింది. ‘మాకు ఇష్టం లేకుండా.. మా కూతురు పెళ్లి చేయిస్తావా అంటూ’.. వధువు బంధువులు ఓ యువతిపై దాడి చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ జంట ప్రేమ వివాహం చేసుకోవడానికి సహాయం చేసిందంటూ నూతన పెళ్లికూతురి బంధువులు ఓ యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి రోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో బాధితురాలు బుధవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
యూకే వెబ్సైట్ సంచలన ప్రకటన
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను వెల్లండించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు బోస్ తైవాన్ విమాన ప్రమాదంలోమరణించారని నిక్కచ్చిగా తేల్చి చెబుతోంది. తమ ప్రకటనకు మద్దతుగా నేతాజీ సన్నిహిత సహచరుడు, ఇద్దరు జపాన్ వైద్యులు, నర్స్ ఒక జర్నలిస్టు, ఇలా అయిదుగురి సాక్షులను అధికారికంగా ప్రకటించింది. దీంతో నేతాజీ డెత్ మిస్టరీపై మరింత చర్చకు తెరలేచింది. భారత జాతీయ సైన్యం యొక్క స్థాపకుడైన బోస్ 1945 ఆగస్టు 18 న మరణించాడని ధృవీకరిస్తోంది. విమానం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అదే రోజు అర్ధరాత్రి మరణించారంటోంది. దీంతో పాటు నేతాజీ చనిపోతూ భారత ప్రజలకు ఒక సందేశానిచ్చినట్టుగా పేర్కొంది. ఆనాటి విమాన ప్రమాదంనుంచి ప్రాణాలతో బైటపడిన బోస్ అంగరక్షకుడు , కల్నల్ హబాబుర్ రెహమాన్ 1 945 ఆగస్టు 24న ఒక ప్రకటన చేశారంటోంది. అది నేతాజీ చివరి మాటలతో కూడిన ప్రకటన అని పేర్కొంది. "తన మరణానికి ముందు ఆయన (బోస్) తన ముగింపు సమీపంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. తాను భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న క్రమంలో తన ప్రాణాలనుకూడా ధారపోస్తున్నాని చెప్పారు. భారతదేశ ప్రజలు తమ స్వాతంత్ర్యం పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు. లాంగ్ లివ్ ఆజాద్ హింద్ అంటూ కన్నుమూశారని కల్నల్ ప్రకటించాడంటోంది. 1945 సెప్టెంబర్‌లో ఫిన్నె , డేవిస్ ల ఆధ్వర్యంలో భారతదేశ రెండు ఇంటిలిజెన్స్ బృందాలు బ్యాంకాంక్ , సైగాన్, తాయ్ పే లలో పర్యటించి విచారించాయంటోంది. అనంతరం విమానం ప్రమాదంలో బోస్ మరణించినట్టుగా ఒక అంచనాకు వచ్చారని తెలిపింది. దీంతోపాటుగా నేతాజీకి చికిత్సచేసిన ఇద్దరు డాక్టర్లు, నర్సు అందించిన వివరాలను ఉటంకింస్తోంది. ఈ కేసులో పరిశోధనకు వెళ్లిన ముంబై జర్నలిస్టు హరీన్ షా కు బోస్‌కు చికిత్స అందించిన నర్స్ చెప్పిన వివరాలను ఈ వెబ్సైట్లో ప్రచురించారు. -
నిర్లక్ష్యంగా నడిపినా శిక్ష లేదా?
విశ్లేషణ: సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడకపోతే పోయింది. నిజం చెప్పిన బాడీగార్డు జైలుకు వెళ్లడం విషాదం. సల్మాన్ మీద ఎఫ్ఐఆర్ వేసినందుకు, ఇతర సాక్షుల వలే అమ్ముడుపోనందుకు రవీంద్ర పాటిల్ చివరివరకు నానా కష్టాలు పడ్డాడు. సెప్టెంబర్ 28, 2002, ముంబై నగరం బాంద్రా ప్రాంతం. అంతకుముందు హీరో సల్మాన్‌ఖాన్ ఒక హోటల్లో తాగుతుంటే బయట ఆయన బాడీగార్డు రవీంద్ర పాటిల్ ఎదురుచూస్తున్నాడు. తరువాత ఖాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని టొయోటా లాండ్ క్రూజర్ కారును ఫుట్‌పాత్ మీదకు దూసుకుపోయి అక్కడ పడుకున్న ఐదుగురి మీంచి తీసుకువెళ్లి పక్కనే ఉన్న లాండ్రీని ఢీకొన్నాడు. ఒకడు మరణించాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఆ సంఘటనకు దిగ్భ్రాంతి చెందిన హీరో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాడీగార్డు వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తెరదేవుడు, కష్టాల్లో ఉన్న వారిని కాపాడే హీరో సల్మాన్‌ఖాన్. తన ప్రాణాలకు తెగించి విధి నిర్వహిస్తూ ప్రాణాలు కాపాడే బాడీగార్డ్ కూడా. బాడీగార్డ్ హీరో నిజం చెబుతున్నాడా? అతని నిజమైన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ చెప్పిన సాక్ష్యం నిజమా? సినీ బాడీ గార్డు నిజంగా ప్రాణాలు తీసేంత నిర్లక్ష్యంగా తాగి కారును పేదల మీంచి తీసుకుపోయాడంటే నమ్మడం ఎలా? దయార్ధ్ర హృదయుడిగా సహజనటన ప్రదర్శించే ప్రతిభావంతుడు నిజంగా నిర్దయుడంటే నమ్మడం ఎంత కష్టం? అందుకే అతని బాడీగార్డు సాక్ష్యాన్ని హైకోర్టు నమ్మలేదు. నట బాడీగార్డును నమ్మింది. కింది కోర్టు నమ్మడం తప్పనీ తేల్చింది. కారులో ఉన్న మరో సాక్షి కమాల్ ఖాన్‌ను పిలిపించి నిజం చెప్పించలేక పోవడం ప్రాసిక్యూషన్ వారి తప్పు అని హైకోర్టు విమర్శించింది. కారులో ఉన్న పాటిల్ సాక్ష్యం నమ్మశక్యం కాదు. కమాల్ ఖాన్ సాక్ష్యం లేదు. మిగిలిన సాక్షులందరూ మాట మార్చారు. అశోక్ సింగ్ అనే కొత్త వ్యక్తి ఆఖరి దశలో వచ్చి కారు నడిపింది తానేనని వివరించాడు. దాన్నీ కోర్టు నమ్మలేదు. కారు తొక్కితే ఒకరి ప్రాణం పోయిన మాట, నలుగురు గాయపడిన మాట నిజం. కాని కారు ఎవరు నడిపారో కోర్టు ముందుకు రాలేదు. కారు నడిపేటప్పుడు సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని రవీంద్రపాటిల్ మొదట ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పుడు అందులో రాయలేదు. ఆ విషయం తరువాత చెప్పారు కనుక నమ్మం పొమ్మంది హైకోర్టు. కాని నియమాల ప్రకారం ఎఫ్ఐఆర్ కీలకమైన సంక్షిప్త నేర ప్రకటన. అందులో నేరం సూచనప్రా యంగా ప్రస్తావిస్తే సరిపోతుంది. తరువాత ప్రకటనలు సాక్ష్యాల ద్వారా వివరాలు రుజువు చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ ఆలస్యం లేకుండా దాఖలు చేసి అందులో ఉన్న అంశాలు తరువాత ఎవరూ ఖండించకుండా ఉంటే దాన్ని నేరం రుజువు చేయడానికి కీలకమైన ఆధారంగా భావించాలని నేర నిర్ధారణా ప్రక్రియ చట్టం నియమాలు వివరిస్తున్నాయి. కాని తాగి నడిపాడని తరువాత చేర్చ డం సరికాదని హైకోర్టు అంటున్నది. ఒకవేళ తాగాడని తేలకున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు శిక్ష వేయవచ్చు కదా? ఖాన్‌కు శిక్ష పడకపోతే పోయింది. నిజం చెప్పిన బాడీగార్డు జైలుకు వెళ్లడం విషాదం. సల్మాన్ మీద ఎఫ్ఐఆర్ వేసినందుకు, మాట మార్చాలని ఎందరు ఎంత గట్టిగా చెప్పినా మొండిగా విననందుకు, ఇతర సాక్షుల వలే అమ్ముడుపోనందుకు రవీంద్ర పాటిల్ నానా కష్టాలు పడ్డాడు. అతని పోలీసు సహచరులు, అధికారులే అతన్ని వేధించారు. ఉద్యోగం వదులుకునే స్థితి కల్పించారు. కుటుంబం కూడా వదిలేసింది. మిత్రులెవరూ వెంట లేరు. కోర్టుకు రాలేకపోయి నందుకు కోర్టు ధిక్కార నేరం కింద జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. చివరకు రవీంద్ర పాటిల్ క్షయ రోగంతో ఒంటరిగా మరణించడం భయానక విషాదాంతం. ఇంతచేసినా పాటిల్ సాక్ష్యాన్ని హైకోర్టు నమ్మడా నికి వీల్లేదని చెప్పింది. ఇతని సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని కింద కోర్టు శిక్ష వేసింది. సమ న్యాయపాలన వర్ధిల్లే మన వర్థమాన దేశాల్లో ఇవి వింతలు. న్యాయ చిత్ర విచిత్రాలు. సాక్ష్యాల సేకరణలో పరిశోధనలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు మండిపడింది. నమ్మకూడని సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష వేయడం తప్పని కోప్పడింది. సామాన్యులకు ఈ విషయాలు అర్థం కావు. ఒక కోర్టు సాక్ష్యాన్ని ఎందుకు నమ్ముతుందో తెలియదు. మరొక కోర్టు పూర్తిగా ఎందుకు కొట్టి పారేస్తుందో అంతకన్నా తెలియదు. ఒకవేళ సాక్ష్యం సరిపోకపోతే పరిశోధన కోసం కేసును పంపకపోవడం ఎందుకు? కింది కోర్టు నేర నిర్ధారణ సరిగ్గా జరపకపోతే కింది కోర్టుకు మళ్లీ విచారించమని పంపే వీలు ఉంది కదా? తాగిన సాక్ష్యం లేకపోతే, నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరానికైనా శిక్షపడ కూడదా? తాగి కారు నడిపే హక్కు వీఐపీలకు తెర తారలకు ప్రత్యేకంగా ఏమైనా ఉందా? వారి లెసైన్సుల నయినా రద్దు చేశారా? తాగి నడిపే వారిని అదుపు చేయలేని అధికా రులెవరో గుర్తించారా? బాధ్యత నిర్వర్తించలేని ఆ అధికారులపైన చర్యలు తీసుకునే ఆలోచన ఏదైనా ఉందా లేదా? తెరవేలుపైన సల్మాన్ ఖాన్ గారి నెత్తురు నమూ నాలను సేకరించి పోలీసు స్టేషన్లో రెండు రోజులు ఎందుకు పెట్టుకున్నారు? వెంటనే ప్రయోగశాలకు ఎందుకు పంపలేదు? మొత్తం రాష్ట్రానికి ఒకే ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటే నేరాలన్నీ ఏ విధంగా రుజువు అవుతాయి? అప్పుడు తాగి నడిపిన తారలు నిర్దోషు లుగా విడుదల కావడమే న్యాయమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
యుద్ధం జరుగుతోందనుకున్నాం
పారిస్ : పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడికి బలైన ప్రదేశాల్లో బాటాక్లాన్ కూడా ఒకటి. అక్కడో సంగీత కార్యక్రమం జరుగుతోంది. అక్కడంతా కోలాహలంగా ఉంది. చాలా ఉత్సాహంగా, మ్యూజిక్ బ్యాండ్‌తో హోరెత్తుతోంది. ఇంతలో అక్కడ ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనాలను బీబీసీ రిపోర్టు చేసింది. మ్యూజిక్ కన్సర్ట్ చాలా ఉత్సాహంగా ఉంది.. పెద్ద సౌండుతో సంగీతం వినిపిస్తోంది. ఇంతలో సడన్‌గా కాల్పులు వినిపించాయి. భీకరమైన అరుపులు. చుట్టూ చూశా.. ముసుగు ధరించిన ఉన్న ఒక నీడ లాంటి రూపం నావైపు చూస్తోంది. అంతోలోనే నా వైపు గురి పెట్టి కాల్పులు జరిపింది. తృటిలో నేను బతికిపోయాను. కానీ పక్కన వ్యక్తి చనిపోయాడు.. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. భీకరమైన కాల్పులు. దాదాపు అందరూ నేలపైన పడుకున్నారు. మరికొంతమంది ఇక్కడ యుద్ధం జరుగుతోందని అరుస్తూ నాలుగు వైపులా భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. మేం పక్కనే ఉన్న కెఫే లో దాక్కున్నాం. యుద్ధం జరుగుతోందని ఎవరో అరవగానే అందరూ నమ్మారు. ఎక్కడివాళ్లక్కడ నేలమీద పడుకుండిపోయాం.. భారీ ఎత్తున సైరన్ లు వినిపిస్తున్నాయి... భయంతో వణికిపోయాం. తర్వాత వెనక డోర్ నుంచి మమ్మల్ని తప్పించారంటూ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న వారు చివురుటాకుల్లా వణికిపోతూ బీబీసీ న్యూస్ తో తమ భయంకరమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. -
ఇద్దరికీ సాక్షి ఈ ‘కెమెరా’నే..
- బాడీ వార్న్ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు, ప్రజల మధ్య జరిగే సంభాషణలకు ‘బాడీ వార్న్ కెమెరా’నే సాక్షి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో కలసి బాడీ వార్న్ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బాడీ వార్న్ కెమెరాలను వినియోగంలోకి తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం ఈ నిఘా నిత్రాల ద్వారా తెలుస్తుందని, ఆ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు. ఈ-చలాన్ వచ్చాక ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందన్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు ప్రజలు వాదనలు తగ్గించుకుని మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు ఈ బాడీ వార్న్ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. బాడీ వార్న్ కెమెరాలను హైదరాబాద్‌లో వాడనుండటం చరిత్రలో ఓ మైలురాయి అని మహేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ పోలీసులు లేని సిగ్నళ్లు ఉండే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేంద్ర, సిట్ అండ్ క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ అంజనీ కుమార్, ఎస్బీ అదనపు సీపీ నాగిరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రంగనాథన్ పాల్గొన్నారు. -
'శేషాచలం' సాక్షులను విచారిస్తున్న సిట్