‘సాక్షుల భద్రత’కు సుప్రీం ఆమోదం | Supreme Court Approves Witness Protection Scheme | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 6 2018 11:12 AM | Last Updated on Thu, Dec 6 2018 11:12 AM

Supreme Court Approves Witness Protection Scheme - Sakshi

న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో సాక్ష్యం చెప్పే వారి భద్రత కోసం కేంద్రం రూపొందించిన ‘విట్‌నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీం’ ముసాయిదాకు సుప్రీంకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో దీనిని చట్టం చేసేంత వరకు అన్ని రాష్ట్రాలు ఈ ముసాయిదాను అమలు చేయాలని ఆదేశించింది. రేప్‌ కేసులో అరెస్టయిన వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుస దాడులకు గురవడంతోపాటు అదృశ్యమవుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు.

ఈ వ్యాజ్యంపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ)లను సంప్రదించిన అనంతరం ఈ ముసాయిదాకు కేంద్రం తుదిరూపం దాల్చింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement