IAF Helicopter Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’ | Gen Bipin Rawat Chopper Crash: Eye Witness At The Crash Site Tamilnadu | Sakshi
Sakshi News home page

Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’

Published Wed, Dec 8 2021 3:36 PM | Last Updated on Wed, Dec 8 2021 4:38 PM

Gen Bipin Rawat Chopper Crash: Eye Witness At The Crash Site Tamilnadu - Sakshi

ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా,  ప్రమాదం జరిగిన హెలీకాప్టర్‌లో మొత్తం 14మంది..

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కుప్పకూలింది. కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని మొదట చూసిన ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి కథనం ప్రకారం.. ఆ పరిసరాల్లో తాను ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి శబ్దం విన్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపాడు.

అక్కడ చూడగా.. ఓ చాపర్‌ చెట్టును ఢీ కొట్టి, మంటలు చెలరేగాయని తెలిపాడు. అదే క్రమంలో హెలికాప్టర్‌ మరో చెట్టును ఢీ కొట్టడం కళ్లారా చూశానని తెలిపాడు.  ఈ ఘటనలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడిపోవడం తాను చూశానని అతను చెప్పాడు. ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా,  ప్రమాదం జరిగిన హెలీకాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది.

చదవండి: TN Army Helicopter Crash: బ్రేకింగ్‌ న్యూస్‌: కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌, 11 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement