ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్‌గా తీసుకెళతారు.
చదవండి: మణికొండ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్
అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు.. షాద్‌నగర్ ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్‌నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు.
చదవండి: టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్‌ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment