అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీలో అతనిపై కాల్పులు జరిపిన వ్యక్తిని తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. ఈవెంట్ గ్రౌండ్‌కు సమీపంలో ఉన్న భవనం పై నుంచి అతను డొనాల్డ్‌పై కాల్పులు జరిపాడని తెలిపారు. అతను భవనంపైకి రైఫిల్‌తో చేరుకున్నాడని ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ మీడియాకు తెలిపారు.
తాను భవనంపై అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి గురించి పోలీసులకు, సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా ట్రంప్ తన ఎన్నికల ర్యాలీలో వేదికపైకి వచ్చిన కొద్దిసేపటికే ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైనట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపైకి వచ్చి, ట్రంప్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ట్రంప్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని సమాచారం.
ఈ ఘటన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తన కుడి చెవి పై భాగానికి బుల్లెట్ తాకిందని తెలిపారు. తుపాకీ పేలిన శబ్దం వినిపించిన వెంటనే ఒక బుల్లెట్ తన చెవి చర్మం గుండా వెళ్లిందన్నారు. దీంతో ఏదో తప్పు జరిగిందని అనిపించిందని ట్రంప్ పేర్కొన్నారు.
WATCH: Shooter at Trump rally opened fire from the roof of a nearby building pic.twitter.com/AgMbtLqKEe
— BNO News (@BNONews) July 14, 2024
Comments
Please login to add a commentAdd a comment