ప్రేమ పెళ్లికి సాక్షి సంతకం పెట్టినందుకు.. | attacked on the witness for signing a wedding | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లికి సాక్షి సంతకం పెట్టినందుకు..

Published Wed, Jul 19 2017 4:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

attacked on the witness for signing a wedding

హైదరాబాద్‌: స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తాం.. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వితం అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్నేహం కోసం ఏమి చేసినా తక్కువే అనిపిస్తుంది.  అలాంటిది స్నేహం కోసం సాక్షి సంతకం పెట్టలేనా అని ఓ యువతి ముందడుగేసి,  తన స్నేహితురాలి ప్రేమ పెళ్లికి సాక్షి సంతకం పెట్టింది. కానీ అదే ఆమె పాలిట శాపంగా మారింది. ‘మాకు ఇష్టం లేకుండా.. మా కూతురు పెళ్లి చేయిస్తావా అంటూ’.. వధువు బంధువులు ఓ యువతిపై దాడి చేశారు.

ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ జంట ప్రేమ వివాహం చేసుకోవడానికి సహాయం చేసిందంటూ నూతన పెళ్లికూతురి బంధువులు ఓ యువతిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి రోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో బాధితురాలు బుధవారం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement