Maharashtra: Girl Plan To Kill Father To Remove Obstacles In Love Marriage - Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం ప్లాన్‌.. తండ్రిని కారు ఆపమని, హఠాత్తుగా వెనుక నుంచి..

Published Fri, Aug 11 2023 3:39 PM | Last Updated on Fri, Aug 11 2023 4:11 PM

Maharashtra: Girl Plan To Kill Father To Remove Obstacles In Love Marriage - Sakshi

ముంబై: తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని ఓ కూతురు దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి ప్లాన్‌ కూడా చేసింది. అందుకోసం కొందరిని మాట్లాడుకుని సఫారీ కూడా ఇచ్చింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది.  అసలేం జరిగిందంటే.. పోలీసుల కథనం ప్రకారం.. షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా  వ్యాపారి. అతని కుమార్తె సాక్షి. ఆమె చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది.

వీరి ప్రేమకు తన తండ్రి అంగీకరించడని భావించిన సాక్షి.. ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.అయితే తన తండ్రి నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని.. ఏకంగా  కన్న తండ్రినే అడ్డుతొలగించుకోవాలనుకుని పథకం వేసింది. అందులో భాగంగా పూణె వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి మాదాకు తిరిగి వచ్చింది. షెట్‌ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి తన తండ్రిని రమ్మని పిలిచింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చాడు. తర్వాత తిరిగి వెళ్తుండగా వడచివాడి గ్రామ సమీపంలో సాక్షి తండ్రిని కారు ఆపమంది.

అసలు విషయం తెలియన  ఆ తండ్రి కారు ఆపగానే.. హఠాత్తుగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. వారు అతన్ని తీవ్రంగా కొట్టారు, అతని రెండు కాళ్ళు విరిచారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచాడు. మహేంద్ర గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.  ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.  మహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉపసర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి సంఘటనా స్థలానికి వచ్చారు.

తీవ్ర గాయాలపాలైన మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కుమార్తె ప్రధాని నిందితురాలిగా తేలింది. ఈ కుట్రలో ఆమె ప్రియుడు కూడా హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: Hyderabad: అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భార్య ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement