![Uncle Attack On Married Couple Over Love Marriage In Abdullapurmet - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/7/love-marriage.jpg.webp?itok=qYtRlvQr)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో వివాహిత భర్తకు గాయలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్ గూడకు చెందిన రాజు, అదే గ్రామానికి చెందిన మరో మైనారిటీ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపతో శుక్రవారం హాస్పిటల్‌కు వెళ్ళి తిరిగి వస్తుండగా వివాహిత మేనమామ జహంగీర్.. మహిళ, ఆమె భర్త రాజుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో రాజుకు తీవ్ర గాయాలవ్వగా హయత్ నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు జహంగీర్ కోసం గాలిస్తున్నారు.
చదవండి: ఉప్పల్‌లో దారుణం: నా భర్త కామపిశాచి.. కన్నకొడుకుపై కర్కషంగా..
Comments
Please login to add a commentAdd a comment