
‘పేట’లో పట్టపగలే చోరీ
ఇంటి తాళాలు పగులగొట్టి 14 తులాల బంగారు ఆభరణాల అపహరణ
సూర్యాపేట : దుండగులు పట్టపగలే తెగబడ్డారు. సూర్యాపేటలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 14 తులాల బం గారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన ఎండీ మోహినొద్దీన్ అలంకార్ రోడ్డులో వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మసీద్‌లో ప్రార్థన చేసేందుకు వెళ్లాలని భార్యను వస్త్ర దుకాణానికి రావాలని కోరాడు. దీంతో ఆమె ఇంటికి తాళాలు వేసుకుని దు కాణం వద్దకు చేరుకుంది.
ప్రార్థన ముగి ంచుకుని మోహినొద్దీన్ దుకాణానికి చేరుకోగానే భార్య ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయిం ది. అసలు ఏం జరిగిందో కూడా తెలి యకముందే ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. గుర్తుతెలియని దొంగలు ఇంటి వెనుక నుంచి వచ్చి లోనికి చొరబడ్డారు. తా ళాన్ని రంపంతో కోసి బీరువాలోని 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.