మారుతినగర్‌లో చోరీని పరిశీలిస్తున్న పోలీసులు(ఫైల్), బీరువాను పగులగొట్టిన దుండగులు(ఫైల్)
సాక్షి, నిజామాబాద్: మళ్లీ దుండగుల అలజడి పెరిగింది. వరుసగా చోరీలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏదో ఒక చో ట చోరీలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో దుండగులు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే పదిలోపు చోరీలు జరిగాయంటే పరిస్థి తి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నా రు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకా శం ఉండడంతో అవగాహన, ప్రచారం కల్పించాల్సిన పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండ డంతో చోరీల నియంత్రణ ఇబ్బందిగా మారింది.
ప్రణాళికతోనే చోరీలు...
నాలుగు రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఓ పైనాన్స్‌లో దుండగులు పడి లాకర్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ పుటేజీలను సైతం తీసుకెళ్లారు. షెట్టర్ పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ ప్రధాన రహదారిపైనే ఈ చోరీ జరిగింది. మరో మూడు రోజుల్లోనే ఇదే ప్రధాన రహదారిపై ఉన్న ఓ గ్లాస్ ఎంపోరియం షెట్టర్ పగులగొట్టి చోరీ చేశారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్టలో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. 6వ పోలీసుస్టేషన్ పరిధిలో మరో చోరీ జరిగింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలోనే ఈ చోరీలు అవుతున్నాయి. మహారాష్ట్ర ముఠాకు చెందిన దుండగులు ఈ అలజడి సృష్టిస్తున్నట్లు పోలీసులు విచారిస్తున్నారు.
గతంలో అపార్ట్‌మెంట్‌లతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మూటలు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గత వారం రోజుల కింద బాల్కొండ, ముప్కాల్ కేంద్రాల్లో షెట్టర్ పగులగొట్టి చోరీలు జరుగగా ఇటీవలే అరెస్టు చేశారు. అయినా చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆర్మూర్‌లో మహారాష్ట్రకు చెందిన దుండగుల ముఠా వరుసగా రెండు రోజులపాటు దోపిడీ చేసింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఇరిగేషన్ కార్యాలయంలో ఒక కారును అపహరించారు. మహారాష్ట్రకు చెందిన ఈ దుండగులు జిల్లాలో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెక్కి నిర్వహిస్తున్నారు. రాత్రివేళ అనుకూలమైన ప్రాంతాల్లో దోపిడీలు చేసేస్తున్నారు. నవీపేట, బోధన్ ప్రాంతాల్లో ఇటీవల చోరీలు పెరిగాయి. జిల్లా కేంద్రంలో చోరీ చేసి పారిపోతూ నవీపేట, బోధన్ ప్రాంతాల్లో అందిన కాడికి దోచుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఫైనాన్స్ దుండగులు ..
వారం రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఫైనాన్స్‌లో చోరీ చేసిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన సాగర్‌సింగ్‌ను పోలీసులు విచారించగా ఇతడి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించగా అక్కడ ఈ ముఠాకు సంబం«ధించి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వారికోసం అక్కడి పోలీసులు వేట సాగిస్తున్నారు.
పెరుగుతున్న కేసులు..
జిల్లాలో పగటిపూట జరిగిన గత మూడేళ్లలో పరిశీలిస్తే 2015లో 27, 2016లో 33, 2017లో 34, 2018లో 42 నమోదయ్యాయి. రాత్రిపూట జరిగిన చోరీలను పరిశీలిస్తే 2015లో 221, 2016–218, 2017–192, 2018లో 206 చోరీలు జరిగాయి. ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో పెట్రోలింగ్ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోతున్నారు.
త్వరలోనే పట్టుకుంటాం..
ఇటీవల జిల్లా కేంద్రంలో చోరీలకు పాల్పడిన ముఠాలను గుర్తిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. కఠిన చర్యలు తప్పవు. చోరీల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. మహారాష్ట్రకు చెందిన ముఠాలు జిల్లా కేంద్రానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ.
Comments
Please login to add a commentAdd a comment