మహిళ మెడలో బంగారు చైన్లు అపహరణ
నెల్లూరు (క్రైమ్) : ఇంటి ముందు నిలబడి ఉన్న ఓ మహిళను లాయర్ ఇంటి చిరునామా అడుగుతూ ఆమె మెడలోని ఎనిమిది సవర్ల బంగారు చైన్లను గుర్తుతెలియని దుండగులు లాక్కెల్లారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం బీవీనగర్‌లోని సంఘమిత్ర స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. బీవీనగర్‌కు చెందిన కె. జోజిరెడ్డి భార్య జషింతమ్మ శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి నిలబడి ఉంది. ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై వచ్చారు. బైక్‌ను ఆన్‌లోనే ఉంచి ఇక్కడ లాయర్ రమేష్‌రెడ్డి ఇల్లు ఎక్కడ అంటూ ఆమెను అడిగారు.
ఆమె తనకు తెలియదని చెబుతున్న తరుణంలో బైక్ వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు చైన్లు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె గొలుసులను గట్టిగా పట్టుకుంది. దుండగులు గట్టిగా లాగడంతో ఆమె చేతికి నల్లపూసల దండ ముక్క వచ్చింది. దీంతో దుండగులు బైక్ పై ఉడాయించారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధితురాలు పెద్దగా కేకలు వేసే సరికి చుట్టుపక్కల వారు గుమికూడి బైక్‌ను వెంబడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితురాలు ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ విజయకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిరునామా అడిగి..
Published Sat, Sep 12 2015 3:25 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement