చ్రందధన (తలకొండపల్లి) : గుప్తనిధుల కోసం దుండగులు ఓ ఆలయంలోని విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే... తలకొండపల్లి మండలం చంద్రధన శివారులోని క్యారమ్ బావి వద్ద పురాతన కాళికాదేవి ఆలయం ఉంది. అందులో గుప్తనిధుల ఉంటాయని భావించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాని పైకప్పును కూలగొట్టి లోపల ఉన్న విగ్రహాన్ని పెకిలించి బయటకు పడేసి కింద భాగంలో గజంలోతు తవ్వారు.
ఎప్పటిలాగే ఆదివారం ఉదయం అక్కడికి పూజలు చేయడానికి వచ్చిన గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి శిక్షించాలని సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రాములు డిమాండ్ చేశారు.