ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్‌లోని దామోహ్ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది.
తాను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు. పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది.
అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
(చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment